Additional information
select-format | Paperback |
---|---|
book-author | Ranganayakamma |
₹100.00
పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం (మార్క్స్ ‘కాపిటల్’ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు) – రంగనాయకమ్మ
పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం.
ప్రకృతి విషయాల్లో, ప్రతి సైన్సునూ నేర్చుకోనక్కరలేదు. వైద్యశాస్త్రం ప్రతిమనిషికీ క్షుణ్ణంగా అక్కరలేదు. రోజువారీగా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు. అనారోగ్యాలు మీద పడ్డప్పుడు. వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం ప్రతి మనిషికీ అక్కరలేదు. ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే. కాని, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు. మనం మనుషులం, జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి. వాటికి ఏ శాస్త్రాలూ, జ్ఞానాలూ అక్కరలేదు. కానీ, మనుషులకు మనుషుల సంబంధాల గురించి తెలియాలి. ఆర్ధికశాస్త్రమే మనుషుల సంబంధాల్నీ, వారి జీవిత విధానాల్నీ వివరిస్తుంది. ఈ శాస్త్రమే, నిన్నటి ఇవాల్టి రేపటి జీవితాల్ని చూపిస్తుంది. ఇది ప్రతి మనిషికీ తెలిసి వుండాలి.
పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం పుస్తకం రంగనాయకమ్మ గారు రాసారు. ‘పిల్లల కోసం’ అనే దృష్టితో పాఠాల్ని ఎక్కువ వివరాలతో ఇచ్చారు. ఇది పిల్లల కోసం కాబట్టి పుస్తకంలో అక్షరాలపైజు చాలా పెద్దది. కాని పాఠాలన్నీ చిన్నవే. ఈ మాత్రం పాఠాలు లేకపోతే ఈ సైన్సుని కనీసంగా అయినా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ పాఠాల పేర్లూ, వాటిల్లో మాటలూ, వాటిల్లో పాత్రలూ, పిల్లల చెవుల్లో, మనసుల్లో పడితే చాలు. అసలు ఇలాంటి శాస్త్రం ఒకటి వుందని పిల్లలకు తెలిస్తేచాలు. పిల్లలకు ఎక్కడన్నా అవసరమైతే, పెద్దవాళ్ళు కొంచెం సహాయం చేస్తే అసలు సమస్యే వుండదు.
19 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Ranganayakamma |