Additional information
Format | Paperback |
---|
₹90.00
‘కథ ఎలా ప్రారంభించినా దానికి చదివించే గుణం ఉండాలి అన్న విషయాన్ని ఏ రచయితా మర్చిపోకూడదు. ఉదాహరణకి మొదటి చాప్టర్ని ‘బాగా వర్షం కురుస్తోంది. రోడ్డంతా తడిసిపోయింది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఆ కారు నెంబరు ఏ.పి.పి. 4.045. ఆ కారులోభార్గవ కూర్చుని ఉన్నాడు. అతడి చేతిలో సిగరెట్ వెలుగుతోంది.’ అని మొదలు పెడితే పాఠకుడికి మొదటి పేరాలోనే సంగం ఇంట్రస్ట్ తగ్గి పోవటం మొదలు పెడుతుంది. వీలైనంత వరకు నవల మొదటి చాప్టర్‌లోనే ఏదో ఒక ముడి వేసేయటం మంచిది…..”
కథని కానీ నవలని కానీ ఎలా ముస్తాబు చేయాలో రచనా వ్యాసంగంలో పాతికేళ్ళ అనుభవమున్న నెంబర్ వన్ రైటర్ వివరిస్తున్నారు. ప్రతి చిన్న విషయమూ అర్థమయ్యేలా తన వృత్తి రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. వర్ధమాన రచయితలకి మరిన్ని టెక్నిక్కులు నేర్పి ప్రొఫెషనల్ రైటర్స్‌గా నిలబెట్టేందుకై రైటర్స్ వర్క్‌షాప్‌ని స్థాపించిన యండమూరి వీరేంద్రనాథ్ దానికి సిలబస్‌గా ”పాపులర్ రచనలు చేయడం ఎలా ?” అన్న పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నారు. ప్లాట్ (కథాంశం) నుంచి క్లైమాక్స్ దాకా కథ నడకకి సంబంధించిన పలు అంశాలని ఆయన బోధిస్తున్నారు.