Availability: In Stock

Raa Raa Samagra Sahityam 1, 2 & 3

SKU: GEN0015

700.00

ముందుమాట

ఆధునిక భారతదేశ చరిత్రలోని భావోద్వేగ పూరితమైన రెండు ఘట్టాలు రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య కారునిగా, రా.రా. గా మారడానికి దోహదం చేశాయి. అందులో మొదటిది రాచమల్లు రామచంద్రారెడ్డి మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజి మొదటి సం. విద్యార్థిగా (1940-41) వున్నపుడు జరిగింది. రెండవది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రపు తొలి శాసనసభ ఎన్నికల సందర్భంగా 1955లో జరిగింది.

1940లో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో జర్మనీ యూరపు పై దాడి చేసి రెండవ ప్రపంచయుద్ధానికి తెరతీసి, బ్రిటీషు రాజకీయ సైనిక శక్తులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదే అదునుగా భారత జాతీయ వాదులూ, గాంధీ, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం చేయాలని బ్రిటీష్ పాలకులపై వత్తిడి పెంచారు. భారతదేశాన్ని యుద్ధంలోకి దించడానికి వ్యతిరేకంగా గాంధీజీ అక్టోబరు 1940లో దేశ వ్యాప్తంగా వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సంఘటిత పరచడానికి పలువురు కాంగ్రెసు వాదుల్ని సన్నద్ధుల్ని చేశారు. దిక్కుతోచని బ్రిటీష్ ప్రభుత్వం ముందుకు ముందే దేశవ్యాప్తంగా ఇరవై వేల మందికిపైగా నాయకుల్ని జైళ్లలో కుక్కింది. ఈ బ్రిటీష్ దమనకాండకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం వీధుల్లోకి వచ్చి సమ్మెపిలుపు నిచ్చింది. ఆ సమ్మెలో భాగంగా మద్రాసులోని అన్ని కాలేజీల విద్యార్థులు సమ్మెబాట పట్టారు. వారిలో గిండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులూ, వైద్య కళాశాల విద్యార్థులు కూడా వున్నారు. వారిలో అప్పటికే మార్క్సిస్టు భావజాలంతో పరిచయం వున్న రాచమల్లు

రామచంద్రారెడ్డి గూడా వున్నాడని చెప్పనక్కరలేదు గదా!

సమ్మె జరగడం వరకూ బాగానే వుంది. అయితే సమ్మె విరమించిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. అదీ గిండీ ఇంజనీరింగ్ కాలేజీలోనే. సమ్మె ముగిసి విద్యార్థులందరూ వారి వారి తరగతులకు హాజరవుతున్నపుడు జరిగిన విచిత్రం అది. వైద్యకళాశాలతో సహా మిగతా అన్ని విద్యాలయాల అధికారులూ యెలాంటి…………

18 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Kuppireddy Padmanabha Reddy