Additional information
Format | Paperback |
---|
₹100.00
‘నువ్వింత తెలివైనవాడివిలా కనబడుతున్నావు. ఇంత చక్కగా ఆలోచిస్తున్నావు. ఈ ఊబిలో ఎలా ఇరుక్కు
పోయావు ?”
”ప్రతివాడికీ ఒక బలహీనత వుంటుంది తాతా, నా బలహీనత – నా అమ్మ. అమ్మని కనుక్కోవాలన్నది నా జీవితాశయం. సరిగ్గా ఆపేరు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా దిగిపోతూ వుంటాను. ఈ ప్రపంచంలో ఎంతమంది నా బలహీనతని ఆసరాగా చేసుకుని తమ పబ్బం గడుపుకున్నారో, వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను !! ఎలాగైనా అమ్మని కనుక్కొని తీరతాను…..”
”ఇక్కడ నుంచి బయటపడితే….” నవ్వుతూ పక్కనుంచి అన్నాడు సింహం…..
అతనికి పేరు లేదు. తల్లి కడుపులోంచి…. చెత్త కుండీలోకి…. అక్కణ్ణుంచి కాకులు దూరని కారడవిలోకి బానిసగా…. తోడేళ్ళ లాంటి మనుషుల మధ్య నుండి బయటపడి…. అంతకన్నా భయంకరమైన మాఫియా గ్రూపుల నడుమ చిక్కుకుని……
కేవలం ఒకే ఒక ఆశ. తన తల్లెవరో తెలుసుకోవాలని ! ఆ తపనని క్యాష్ చేసుకునే గుంటనక్కలు, రాబందులతో ఎడతెడగని పోరాటం….
అతడు చివరికి తన తల్లెవరో తెలుసుకున్నాడా ? ఎవరామె ?
1980 దశకంలో వెలువడి సంచలనం సృష్టించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల రాక్షసుడు. ఆ తరువాత సినిమాగానూ వచ్చి సూపర్‌హిట్ అయింది. ఇండియాలో ప్రజాస్వామ్యం ఎంత నేతిబీర చందమో, ప్రభుత్వ యంత్రాంగం దళారీలతో ఎలా కుమ్మక్కయ్యిందో, సాధారణ పౌరులెలా ఏమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టున్నారో పదునైన శైలిలో చిత్రించిన నవల – రాక్షసుడు.