Availability: In Stock

Rendu Gundela Chappudu – రెండు గుండెల చప్పుడు

SKU: BNAVA004-1-2-3-1

60.00

నాకు యవ్వనం వుంది. అందం వుంది. రచయిత్రిని. నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కట్టడిలో వుండటం నాకిష్టంలేదు. అందుకే ఈ వివాహ వ్యవస్థని నేను నమ్మను. నాకున్న ‘స్వేచ్ఛ’ నన్ను అంచెలంచెలుగా తారాపధానికి చేరుస్తుంది. – పద్మిని.

అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకురావటానికి నేను రచనలు చేస్తాను. నేను వ్రాసేది చదివి పాఠకులు చైతన్యవంతులై, అట్టడుగు వర్గాల్ని పైకి తేవాలి. దాన్నే ‘సామాజిక స్పృహ’ అని నేను నమ్ముతాను – విష్ణుమూర్తి.

నా భార్య అంటే నాకు వల్లమాలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఎక్కువ వుంటుందో అక్కడ స్వార్ధం వుంటుంది. దాన్ని ‘కట్టడి’ అని నా భార్య అనుకుంటే నేనేం చెయ్యను ? – ప్రభాకర్‌.

నేను సగటు స్త్రీని. ఆలోచించే శక్తి వుంది. వివాహం మంచిదా ? స్వేచ్ఛ మంచిదా ? వివాహంలో స్వేచ్ఛ లేదా ? ఏ నిర్ణయం తీసుకోను ? – సుభాషిణి.

కష్టం నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నం తప్పుకాదు. కాని ఎన్నుకునే మార్గం తప్పుకావచ్చు. ‘కష్టం’వేరు. ‘అసంతృప్తి’ వేరు. అసంతృప్తుల్ని కష్టాలుగా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నాల్ని ఖండించాలి. మనం ఒక నిర్ణయం తీసుకుని పని చేస్తే, కొన్ని కష్టాలు తొలగిపోవచ్చు. మరికొన్ని కొత్త కష్టాలు రావచ్చు. వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందే మనం ప్రిపేరయి వుండాలి. తెలియని దేవుడిని ఆహ్వానించేకన్నా, తెలిసిన దెయ్యాన్ని మార్చుకునే ప్రయత్నమే మంచిది’ అంటూ డి.ఎస్‌.పి. మూర్తి సలహా ఇచ్చాడు సుభాషిణికి.

నాలుగు విభిన్న పాత్రలతో మనోవిశ్లేషాత్మకంగా రాసిన నవల ‘రెండు గుండెల చప్పుడు’ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌.

Additional information

Format

Paperback