Availability: In Stock

Sagara Ghosha

SKU: NAV011

440.00

 ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్లనాటి భూమి పుట్టుక నుండి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్య కావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందాయకంగాను ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన  కావ్యం.

               ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయితే ఇతివృత్తం కొత్తది. ఒకానొక ప్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్లుగా భావించి, ఆ కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది.

“స్వచ్చంగా ఉండవలసిన నీటికెరటానివి, ఇలా ఉన్నావేమిటి”? అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుంచి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకు వెళతానని ఆర్థిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని ఆర్థిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష.

17 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Garikipati Narisimha Rao