Availability: In Stock
Sai Geethamritha Sa(Ga) Ram
₹230.00
కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .
వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.
పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.
ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.
18 in stock (can be backordered)