Availability: In Stock

Sankellu Tenchukuntu. . . .

SKU: BHOOMI001

300.00

మా ఊరు.. ఆ రోజులు

అధ్యాయం – 1.

మా ఊరు.. ఆ రోజులు

ఇది నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు, అధికారులు, వారితో ముడిపడిన ఘటనలకు సంబంధించిన యథార్థ జీవితం.

నేను జన్మించాను. ‘ప్రాంతంలో’ అని ఎందుకు అన్నానంటే నా తల్లిదండ్రులు లేదా తాత, అవ్వలు నేను ఏ రోజున పుట్టానో రాసిపెట్ట లేదు. ఓ నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం పూట నేను పుట్టానని అమ్మ చెప్పేది. అది ఏప్రిల్ కావచ్చు లేదా మే నెల కావచ్చు. గ్రామాల్లో నివసించే ఓ చదువురాని దళిత మహిళ సంవత్సరం, నెల, తేదీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అమ్మలాగే నాన్నకూ చదువు అక్షరం ముక్కరాదు. నేను 1962లో ఐఏఎస్లో చేరిన తర్వాతనే వారు మాతృభాషలో అక్షరాభ్యాసం చేశారు.

తన కడుపులో ఉన్నది ఓ మగబిడ్డ అని, అతడు ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే ఉన్నతపదవి చేపడతాడని ఏ సోదెమ్మ అమ్మకు చెప్పలేదు? ఊళ్లో ఉండే అందరు ఇతర మహిళల్లాగే అమ్మ కూడా ఎలాంటి వైద్య సదుపాయం లేకుండా నాకు జన్మనిచ్చేందుకు మరణం అంచులదాకా వెళ్లి తిరిగివచ్చింది.

నన్ను నన్నుగా తీర్చిదిద్దడంలో అతి ముఖ్యపాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే అమ్మ శ్రీమతి కాకి మాణిక్యమ్మ, నాన్న శ్రీ కాకి శోభనాద్రి అని చెప్పకుండా ఎలా ఉండగలను? నా తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలినాలి చేసుకుని జీవనం గడిపే కోట్లాది మంది లాగే కడుపేదలు. ఆ రోజుల్లో వ్యవసాయం ఊళ్లోని కూలీలందరికీ ఏడాదికి 150 రోజుల దాకా, కొందరికైతే 200 రోజుల దాకా పని కల్పించేది. నిరంతరాయంగా కొనసాగే దయనీయమైన ఉపాధికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఉండదు. కొందరు మరికొన్ని వారాల పాటు పని వెతుక్కుంటూ పొరుగూళ్లకు వెళ్లేవారు. మా నాన్న తన జీవితమంతా ఓ భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేశారు. పాలేరు అంటే ఓ ఏడాది పాటు పనికి కుదుర్చుకోవడం. ఏడాది తర్వాత ఆ ఏర్పాటు కొనసాగనూ వచ్చు లేదా ఎవరిదారి వారు చూసుకోవచ్చు.

అంతా నోటిమాట మీదే నడుస్తుంది. ఎలాంటి రాతకోతలు ఉండవు. 75 కిలోల ధాన్యపు బస్తాల రూపంలో జీతాలు ఇచ్చేవారు. మామూలుగా అయితే ఓ 15 బస్తాల………………………

27 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Kaki Madhavarao Ias Retd

Published Date

2023