Additional information
select-format | Paperback |
---|---|
book-author | Paruchuri Gopalakrishna |
₹300.00
ఆశంస
ఎందరో మహాను భావులు. అందరికీ వందనాలు. ‘స్క్రీన్ ప్లే’ అన్న మకుటంతో కదన రచనలో వచ్చే సమస్యలేమిటి అనే విషయంపై, నూతనంగా చలన చిత్ర కథలు, సంభాషణలు, కథన రచనలో పాల్గొనే ఎందరో అధునాతన రచయితలు, సినిమా రచన చెయ్యాలని అభిలషించే యువతీ యువకుల కోసం, ఈ గ్రంథం రచించాలన్నది ఏనాటి నుంచో నా మనసులో పాతుకుపోయిన ఆకాంక్ష.
దాని కోసం అమెరికా వెళ్ళినప్పుడు చాలా ‘హాలీవుడ్ స్క్రీన్ ప్లే’ గ్రంథాలు కొని తీసుకు రావటం జరిగింది. 2007వ సంవత్సరం నుంచి తెలుగు విశ్వవిద్యాలయంలో “స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించి, తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన కూడా ‘స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించడం జరిగింది.
అంతే కాకుండా రాఘవేంద్రరావు గారు, ఎ. కోదండరామిరెడ్డి గారు, బి. గోపాల్ గారు ఇలా ఎంతో మంది దర్శకులను ‘షూటింగ్ స్పాట్ లో గమనించి కొన్ని స్క్రీన్ ప్లే వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది.
బొబ్బిలి బ్రహ్మన్నలో ఒక షాట్ తీసినప్పుడు ఇలా ఎందుకు చేసారు అని అడిగితే అభినయానికి విలువనిచ్చి అని చెప్పారు. అలాగే శారదగారి పాత్ర కూతురు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తలుపు తీసే షాట్లో ఎదురుగా కృష్ణంరాజు గారు కనిపించాలిగదా అంటే అది జనం ఊహిస్తారు. అందుకని కెమెరా లోపల పెట్టి తలుపు తియ్యగానే సజెషన్లో హీరో నిలబడి వుంటాడు. అతని అభినయం తెలిసిపోతుంది. అతను బాధగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా అనేది. తలుపు తెరిచి చూడగానే కట్రాయిలా నిలబడ్డ భర్తను చూసి వెనకడుగు వేస్తే, ఆమెకు గుండెఝల్లు మంది అన్న ఎక్స్ ప్రెషన్ ‘ఆడిటోరియా’నికి తెలుస్తుంది అన్నారు. ఇలా ఆయనను ఎన్నో సినిమాలలో చిన్న………….
18 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Paruchuri Gopalakrishna |