Additional information
Format | Paperback |
---|
₹75.00
ఆరోజు సోమవారం !
క్రితంరోజు ‘శలవు బద్ధకం’ లోంచి బయట పడటానికి ఇష్టంలేనట్టుగా మత్తుగాపడుకుని ఉన్నారు కొంతమంది.
సూర్యుడికి, గృహిణికి అది కుదరదు కదా !
ఉదయభానుడు ఉరుకులూ పరుగులూ మీద పైకి పొడుచుకొచ్చేస్తున్నాడు. ప్రాత:కాలాన్నే లేచి, పెరట్లో రాత్రి కురిసిన పారిజాతాలు ఒళ్లో నింపుకుంటూ, ముంగిట్లో రంగవల్లులు తీర్చే అతివలు ఆ లొకాలిటీలో లేరు !
గేట్లమీద పాలపేకెట్లు చూస్తున్నాయి. మెట్లమీద న్యూస్‌పేపర్లు అడ్డంగా పడివున్నాయి.
కిలకిలారావాల్తో నిద్రలేచి, కూనిరాగాలతో పనులు ప్రారంభించవలసిన సుందరవదనలు, ఆదరాబాదరా పనుల్లో జొరబడి, తిరిగిపోతున్న గడియారపు ముళ్ళకేసి నిస్పృహగా చూస్తున్నారు.
కలలు కంటే, నిద్రలేని రాత్రి కరిగిపోయి, మండే కళ్ళతో పగలు ఆఫీసుల కెళ్ళాల్సొస్తుందని కలలను సైతం త్యాగం చేసే ఉద్యోగస్తురాళ్లు!
మధ్య తరగతి మహిళలు !
పునీత పువ్వులాంటి పాప బస్‌పాస్ కోసం ఫోటో తీయించుకోవాలని స్టూడియో కెళ్ళింది. అక్కడ!
వనజ పదహారేళ్ళ అమ్మాయి. బస్‌లో కాలేజికెళ్తోంది. కండక్టర్ ‘పీఛేజావ్’ అంటూ చెయ్యివేసి వెనక్కి తోసాడు. ఎక్కడ!?
ధరణి ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగస్తురాలు. సైటుకి రమ్మన్నాడు బాస్. ఎందుకో తెలుసు. కాదంటే
మంచినీళ్ళు పుట్టని సైటుకి బదిలీ చేస్తాడు. అదీ పరిస్థితి. మరేం చెయ్యాలి ? ఇక్కడ!? – పైకి కనబడకుండా – మూడోకంటికి అస్సలనుమానం రాకుండా-కేవలం తెలియాల్సిన వ్యక్తికే తెలిసేలా-ఆ వ్యక్తి మనసులోనే దు:ఖపడేలా-మరొకరికి చెప్పుకోవటానికి సిగ్గు పడేలా – ఓ అంతరంగవేదనా తరంగం యండమూరి వీరేంద్రనాథ్ సృష్టి ‘సిగ్గేస్తోంది’.