Additional information
select-format | Paperback |
---|---|
book-author | Puranapanda Srinivas |
₹430.00
ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు
చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం
వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం
వల్లనే, సమస్త బ్ర హ్మాండం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని
అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే … తేజస్వుల వర్చస్సుగా ఈ
బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా
పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్.
ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం.
బాహ్య ఆవరణలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ
పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన,
నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని
అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం.
శ్రీపూర్ణిమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంగళకరమైన ఐశ్వర్యమే !
ఈరోజుల్లో ఒక పుస్తకం రెండేళ్లలో ఇరవైఐదు ప్రచురణలకు నోచుకోవడమంటే ఆ
రచయిత తాలూకు తపస్సు ఫలించినట్లే.
అందువల్లనే ఈ రచయిత మరొక అమోఘ రచనా సంకలనం ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ
ఉపాస్య గ్రంధాన్ని అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం, ఈ దేశహోమ్ శాఖామంత్రి
ఆవిష్కరించారంటే ఇదేమీ మామూలు విషయం కాదు.
18 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Puranapanda Srinivas |