Additional information
select-format | Paperback |
---|---|
book-author | Koduri Sreerama Murthy |
₹70.00
మహనీయుల జీవితాల్లో మనకు తెలిసింది ఒక భాగమైతే, మనకు తెలియకుండా ఉన్న భాగంకూడా సహజంగానే మరొకటి ఉంటుంది. దానిని కూడా తెలుసుకుంటే పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే వీటిని రాశాను. ఇందులో 11 మంది ప్రముఖుల జీవితాల్లోని రెండు వైపులనూ చూపడం జరిగింది. ఈ వ్యాసాలలో కొన్ని ఆంద్ర పత్రికవారు ఒకప్పుడు వెలువరించిన ‘కలువబాల’ పత్రికలో ‘అద్దానికి మరోవైపు’ పేరిట ప్రచురితమైన శీర్షికలో వచ్చాయి. ఆ పత్రిక ఆగిపోయింది. శీర్షిక కూడా ఆగిపోయింది. అందుచేత మరికొన్ని విడిగా రాసినవి వ్రాత ప్రతిలో ఉండి పోయాయి.
వీటిని పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుందనిపించి, పల్లవీ పబ్లికేషన్స్ వారికి పంపిస్తే వారు వెంటనే ప్రచురించేందుకు అంగీకరించారు. అందుకు వారికి కృతఙ్ఞతలు. ఇందులో 11 మంది ప్రముఖుల గురించే రాశానుగాని, ఇలా ఎంతమంది గురించి అయినా రాయవచ్చును. ఈ పుస్తకానికి లభించిన ఆదరణను బట్టి, ఆ ప్రయత్నాన్ని జరుగుతుంది.
– కోడూరి శ్రీరామమూర్తి
19 in stock (can be backordered)
select-format | Paperback |
---|---|
book-author | Koduri Sreerama Murthy |