Description
తెలుగు సినిమా సాహిత్యం
కధ – కధనం – శిల్పం
6 పునర్ముద్రణలు పొందిన పుస్తకం
* కధారచన అనేది ఒక రహదారి అయితే దానిమీద నడిచే మొదటి బాటసారి సంభాషణ రచయిత.
* సాహితీ కధ చదువుతారు. సినిమా కధ చూస్తారు.
* కధాంశం ఇతివృతంగా ఎదిగే పద్దతిలో రచయిత కధ విషయంలో ఈ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
* పాత్రలు చుట్టూ కధ అల్లబడే ముందు ఆ పాత్రకు సంబంధించిన ఈ కింది విధంగా 33 రకాలుగా విశ్లేషించుకోవాలి.
* సాహిత్య కధ చదువుకున్న వాళ్ళకు పరిమితం. సినిమా కధ చదువుకున్న వాళ్ళతో పాటు అవిద్యావంతుల్ని కూడా అలరిస్తుంది.
* ఎన్.టి.ఆర్. తో సర్దార్ పాపారాయుడు తీసిన దాసరి, అక్కినేనితో ప్రేమాభిషేకం తీసాడు తప్ప బొబ్బిలిపులి తియ్యలేదు. ఎందుకని?
* సినిమా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన నూతన రచయిత ముఖ్యంగా ఈ ఏడు ప్రత్యేక లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి.
* పాతాళబైరవి లక్షంగా పదవైచిత్రి, సంఘటనా శిల్పం !
* మల్లీశ్వరి లక్ష్యంగా కదన లక్షణం !
* మాయాబజార్ లక్ష్యంగా కధనశిల్పం లక్షణం !
* ఖైదీ చిత్రం ఏకవాక్య దృశ్యమాలిక !
ప్రత్యేకించి ఈ పుస్తకంలోని మూడు నాలుగు అధ్యాయాలు సినిమాల పట్ల ఆసక్తి వున్న ప్రతివారికీ పటనీయాలు…. కధనం శిల్పాలపై మూడు నాలుగు అధ్యాయాలలో గోపాలకృష్ణ విజయవంతమైన కళాత్మక చిత్రాలను ఉదాహరణగా తీసుకుని వాటి కధ,మలుపులు,పాత్రలు, సంభాషణలు, సంఘటనలు వగైరాలు ఎలా రూపుదిద్దుకున్నదీ చక్కగా చెప్పారు. సినిమా రచన గురించి తెలుసుకోగోరే వారికి ఇదెంతో ఉపయోగకరం.
– ప్రజాశక్తి