Additional information
Author | GNReddy |
---|---|
Format | Paperback |
₹300.00
చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్.రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. ”తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం” అన్న అంశం మీద పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్. పట్టా వచ్చింది. తెలుగు సెమాంటిక్స్ మీద వీరు చేసిన కూలంష పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక ప్రసిద్ధ సంస్థలలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. రాక్ ఫెల్లర్ పరిశోధకులుగా పూనాలో కొంతకాలం పనిచేశారు. లెక్చరర్ పదవి నుండి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల స్థాయి వరకు ఎదిగిన సాహిత్యమూర్తి వీరు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా (1984-1987) పదవీ విరమణచేసిన తర్వాత యు.జి.సి. వీరిని ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా (1988-1989) నియమించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు. అమెరికాలోని విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. వివిధ దేశాలు పర్యటించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్, యం.ఫిల్. డిగ్రీలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీలలో చాలాకాలం సభ్యులుగా ఉన్నారు. వీరు తెలుగు నిఘంటువు (1973), ఇంగ్లీషు తెలుగు నిఘంటువు (1978), మాండలిక వృత్తి పదకోశం (కుమ్మరం, వడ్రంగం) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నారు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్క ృతులపై వివిధ మౌలిక రచనలు చేశారు.
Author | GNReddy |
---|---|
Format | Paperback |