Availability: In Stock

The Best Of Yandamuri Veerendranath – ది బెస్ట్‌

SKU: NAV002-1-1-2-1

120.00

అత్యుత్తమమైన పాతిక కథల సంకలనం – యండమూరి వీరేంద్రనాథ్‌
జడివానలో ఓ రాత్రి ఇరవై రెండేళ్ల అమ్మాయి అతడి అరుగు మీద నిలబడింది. అతడు యువకుడు. లోపలికి రమ్మన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి అతడింట్లోనే ఉండిపోయింది. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. అతడి స్నేహితుడొకడు అతడ్ని వెక్కిరించాడు. ఆ అమ్మాయి కచ్చితంగా నిన్ను ఇంపోటెంట్‌ అనుకుని వుంటుందన్నాడు. మళ్లీ ఒకసారి ఆ అమ్మయి తారస పడింది. అతడు ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ప్లాను వేసి మరీ కరెంటు పోగొట్టాడు. ఒక్క ఉదుటన ఆ అమ్మాయిని తన బిగి కౌగిలిలో బిగించాడు. అప్పుడే జరిగింది ?
1969లో యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన ‘అబద్ధం లాంటి నిజం’ మానవ మనస్తత్వంలోని ఓ అట్టడుగు కోణాన్ని చిత్రిస్తుంది. ఈ కథతో పాటు యండమూరి వీరేంద్రనాథ్‌వారి పాతికేళ్ళ రచనా వ్యాసంగంలో అత్యుత్తమమైన 25 కథలను ఎంపిక చేసి ”ది బెస్ట్‌” ఆఫ్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ సంకలనాన్ని వెలువరించారు. 1969-94 సం||ల నడుమ యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన మంచి కథలు ఇందులో ఉన్నాయి.
ఫేర్వెల్‌ రాజేశ్వరి, ఆ ఒక్కటి అడక్కు, పురుషోత్తముడి ఫోటో, పట్నం బస్సు, అమ్మాయిలకి మాత్రమే, స్త్రీ / స్త్రీ, చదరంగంలో చచ్చేది, టాన్‌, వరండా కుర్రాడు, నవ్వే కన్నీళ్ళు, ఉల్లిపాయ, బ్రహ్మర్షి అన్నవి ఈ సంకలనంలో చోటు చేసుకున్న కొన్ని కథల పేర్లు.

Additional information

Author

Yandamuri Veerendranath

Format

Paperback