Description
కవితలు …. ”నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వదులుకోలేను… నా ఆశయం ప్రజల ఆశయం. సంస్కారవంతుల సదభిప్రాయం నాకు అండగా ఉంది”. – గురజాడ అప్పారావు
”భాష ఎంతగా శృంఖలా బద్ధమైపోవాలో అంతగా శృంఖలా బద్ధమై పోయాకా, సాహిత్యం ఎంతగా దిగజారి పోవాలో అంతగానూ దిగజారిపోయాకా, భవిష్యత్తు ఎంతగా అంధకార బంధురమైపోవాలో అంతగానూ అంధకార బంధురం అయిపోయాకా పుట్టుక వచ్చాడీ మహాకవి….” – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
”ఆంధ్రవాణికి అపూర్వాలంకారాలని భ్రమించి ఆనాటివారు శబ్ద శాసనంతో ఆమెకు కల్పించిన సంస్క ృతీ శృంఖలాల బంధింపు వల్ల ఆమె తన వారైన సామాన్య జనుల ఆదరాభిమానాలకు అందుబాటు కాకుండా పోయింది. ఈ దుస్థితి తప్పించి, బేడీలు విడదీసి, ఆత్మీయులైన సామాన్య జనుల బాంధవ్యం సమకూర్చడంలో ఆమెకు ఆత్మచైతన్యం కలిగించిన మహానీయుడు గురజాడ అప్పారావు”. – ముద్దుకృష్ణ
”సుమారు వెయ్యేళ్ళు ఆవ్యాహతంగా సాగుతూ నలిగిన క్లాసికల్ బండిదారి నుంచి గురజాడ తెలుగు కవిత్వానికి ఒక కొత్త మలుపు యిచ్చాడు. రథాలు, పల్లకీలు, గుర్రబ్బళ్ళూ వెళ్లే దారిని తప్పించి, మోటారూ, రైలు బళ్ళూ తిరిగే ఆధునిక యుగానికి తెలుగు కవిత్వాన్ని మళ్ళించాడు. గురజాడ చూపించిన మలుపును నేను మరింత వెడల్పు చేశాను”. – శ్రీశ్రీ