Availability: In Stock

The Happiest Man On Earth

Author: Eddie Jaku
SKU: GEN008-1

299.00

నేను 1920లో తూర్పు జర్మనీలోని లీపిగ్ పట్టణంలో జన్మించాను. నా పేరు అబ్రహం

ఇంగ్లీషులో ఈ పేరును ఎడ్డీ అని పలుకుతారు. కాబట్టి దయచేసి నన్ను ఎడ్డీ అని పిలు

మిత్రమా.

మాది ప్రేమానుబంధాలుగల చాలా పెద్ద కుటుంబం. నా తండ్రి ఇసిడోర్కి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్లు. నా తల్లి లీనా పదమూడు మంది సంతానంలో ఒకరు. ఇంతమంది పిల్లల్ని పెంచిన మా అమ్మమ్మ శక్తిని ఊహించుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె తన కుమారుడిని కోల్పోయింది. జర్మనీ కోసం ఒక యూదుడు తన జీవితాన్ని త్యాగం చేశాడు. అలాగే భర్తనీ కోల్పోయింది. మా తాతయ్య సైనిక పూజారి. ఆయన యుద్ధం నుండి తిరిగి రాలేదు. మా నాన్న పోలాండ్ నుండి వలస వచ్చి జర్మనీలో స్థిరపడ్డారు. ఆయన జర్మనీ పౌరుడిగా గర్వపడేవారు. ఆయన రెమింగ్టన్ టైప్ రైటర్ సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్లో అప్రెంటిస్ గా, చేరడం కోసం మొదట పోలాండ్ని విడిచిపెట్టారు.

ఆయన చక్కటి జర్మనీ భాష మాట్లాడేవారు. జర్మనీ వర్తక నౌకలో పనిచేస్తూ అమెరికా వెళ్లారు. అమెరికాలో తన వ్యాపారంలో బాగా రాణించారు గానీ తన కుటుంబానికి దూరమైయ్యారు. యూరప్ లోకి తిరిగి వచ్చి మరో జర్మన్ వ్యాపార నౌకలో పని చూసుకుందా మనుకున్నారు. సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వస్తూ చిక్కుకుపోయారు. ఎందుకంటే ఆయన పోలిష్ పాస్పోర్టుపై ప్రయాణిస్తుండడంతో జర్మనీవారు ఆయనను అక్రమ చొరబాటు దారుగా భావించారు. అయితే జర్మనీ ప్రభుత్వం ఆయన్ని నైపుణ్యం గల మెకానిక్ గా గుర్తించి యుద్ధ ప్రయత్నాల కోసం భారీ ఆయుధాలు తయారుచేసే లీగ్లోని కర్మాగారంలో నిర్బంధంలో ఉండి పనిచేయడానికి అంగీకరించింది………………..

18 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Eddie Jaku