Availability: In Stock

THE SHOW MOST RUN

170.00

16 in stock

Description

బంగారు వడ్లగింజలు

సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో ‘భట్టిప్రోలు కథలు’ అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.

డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.

‘ద షో మస్ట్ రన్’ కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.

సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.

భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు” అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో ‘చూరుకుట్టు బద్ద’, ‘నత్తముక్కల గోంగూర’ నాకు బాగా నచ్చిన కథలు……………..

Additional information

book-author

Dr Nakka Vijaya Ramarao

select-format

Paperback