Additional information
Format | Paperback |
---|
₹80.00
చిన్నప్పుడు ఇంట్లో – తల్లి – తండ్రి – పనిమనిషి – పెద్దయ్యాక బాస్ – ఇంటి యజమాని – అతడికొడుకు – అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్’లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి పరిచయమయ్యాడు ఓ విచిత్రమైన యువకుడు ….. అనుదీప్.
ఆమె శరీరం మీదే ఆమెకి తెలియకుండా ప్రేమలేఖ రాసి ప్రజెంట్ చేశాడు. ఆమె కోసం, కుడి చేతిని భుజం వరకూ కోసేసుకున్నాడు. ప్రేమకన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుచ్ఛక్తి సరఫరాని ఇరవైనాలుగ్గంటల పాటు నిలిపివేశాడు. ఆమె కంగారు పడింది. కంగార్లోంచి ప్రేమ పుడుతుందా ? థ్రిల్లర్…. థ్రిల్లర్…. థ్రిల్లర్…. చదువుతున్నంతసేపూ ఉద్వేగమూ ఉత్కంఠా… చదివాక మనస్సంతా మధురమైన బాధా తియ్యటి వేదనా…. మనుషుల్లోని ప్రేమ రాహిత్యాన్ని ఎత్తి చూపిన నవల మాత్రమే కాదు. ఇది తెలుగులో ‘అబ్సర్డ్- రచనలు లేని లోటుని తీర్చిన నవల కూడా.