Availability: In Stock

Valmiki Ramayanam

SKU: TLP001

220.00

Description

సరళ వ్యవహారికంలో వెలువడిన వాల్మీకి రామాయణాలు అనేకం చదివాను. అవేవి నా గుండెను తట్టలేదు. ఉప్పులూరి కామేశ్వరరావు గారి వాల్మీకి రామాయణం చదివాను. బొమ్మ కళ్ళకి కట్టి, కన్నీరు పెట్టుకున్నాను. మూలానికి విధేయమంటూ అంతుచిక్కని వర్ణనలూ, వ్యాఖ్యానాలూ చొప్పించి రసాభాస చేయకుండా వాల్మీకి ఆత్మను ఆవిష్కరించిన అసలుసిసలైన పుస్తకం ఇది. రామాయణం అంటే స్నేహం కోసం ప్రాణాలర్పించడం, రామాయణం అంటే ప్రభుభక్తిని ప్రస్ఫుటం చేయడం, రామాయణం అంటే అధర్మం పై యుద్దాన్ని ప్రకటించడం అని ఈ పుస్తకం చదివి చక్కగా తెలుసుకున్నాను. చాలు, ఇంకేం కావాలి?

                                                                                    – జగన్నాథశర్మ 

ఈ పుస్తకంలో కథ చెప్పిన తీరు చాలా చక్కగా ఉంది. పుస్తకం తెరిచాక మధ్యలో వదలనివ్వకుండా పూర్తిచేయించింది. వాల్మీకి రచించిన రామాయణం ఎందఱో తెలుగులో వ్రాసారు. కానీ, వాల్మీకి హృదయం పాఠకుడికి ఆవిష్కారం అయేలా వ్రాసినవారు చాలా అరుదు. ఆ అరుదైన వారిలో శ్రీ కామేశ్వర రావు గారు ఒకరు. వాల్మీకి రచనలో ప్రధానమైన విషయాలేవీ వదలకుండా, సందేశాత్మకమైన వ్యాక్యాలు తేల్చెయ్యకుండా, సంభాషణలోని పొంకం చెదరకుండా ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంధాన్ని ఇంత చిన్న పుస్తకంలో నేర్పుగా ఇమిడ్చారు. నేటి సమాజానికి ఈ తరహా రచనలే చాలా అవసరం.

– త్రిపురనేని హనుమాన్ చౌదరి

Additional information

book-author

Uppuluri Kameswara Rao

select-format

Paperback