Availability: In Stock
Veerakesari
₹70.00
అరుణకాంతులు శయ్యగారమాత ఆవరించి, చీకటిని పారద్రోలుచున్నవి. అలసటగా తన అందమైన అవయములను విరుచుకున్నది అరుణసుందరి. గత రాతిరి వెలిగించిన దివ్వె గొంపో వచ్చిన దాసి మృదువుగా మందహాసము చేసినది. “యెందులకే ఆ గడుసు నవ్వు?” చిరుకోపం ప్రకటించింది యువరాణి.
“ఇట్టి తరుణము తమ నాథులు గాంచిన కపొలములు కందిపోవా! పాపం! శ్రీవారు ఈ దేవి దర్శనము గానక, ఆ భవాని దర్శనార్ధమై ఆలయమును కేగినారు” కొంటె చూపులు విసిరినది దాసి చండి. అరుణసుందరి అదిరిపాటున లేచినది. “చండి! సత్యము వచింపుము. వారు యేటించి యుండిరా?”
“అసత్యము వచించుట ఎలా? తమరు శయ్యవిడి గవాక్షము ద్వారా తిలికించడు. ప్రభువులు, శ్రీవారు, పరివారము ఆలయమున కేగుచున్నారో లేదో తెలియును.”
19 in stock (can be backordered)