Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹80.00
సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్ తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.
కిషన్ చందర్ 1914 నవంబర్ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్.ఎల్.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, రష్యన్, డేనిష్, పోలిష్, జర్మన్, హంగేరియన్, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.
ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌చందర్ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.
పేజీలు : 100
20 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |