Additional information
Format | Paperback |
---|
₹60.00
‘భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా? ప్రొఫెసర్ ఆనందమార్గం అంచనా నిజమయ్యే పక్షంలో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకు వస్తోంది. కొన్నివేల కోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న ఈ నక్షత్రం భూమి యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటలకి ప్రవేశించి, మూడు సెకన్ల కాలంపాటు ఉండి అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అయితే భూమిలో వుండే పదార్థాలన్నీ పోటీపడి ఆ నక్షత్రాన్ని చేరుకోవడానికి తొందర పడడంలో భూమి పేలిపోతుంది. కాగితంలో పకోడీలు దట్టంగా కూరి నొక్కితే పేలినట్లు భూమి పేలిపోతుందా? పదిహేడో తారీఖు వరకూ వేచి చూద్దాం. ప్రొఫెసర్ మాటలే గాని యధార్థమైతే చూడడానికి మనం ఎలానూ వుండముగా….”
ఇండియన్ టైమ్స్‌లో ప్రచురితమైన సంచలన వార్త అది. దాంతో అంతా గగ్గోలెత్తింది. మనిషి మనుగడ మీద జూదం మొదలయింది.
అష్టగ్రహ కూటమి ఏర్పడి ప్రపంచ వినాశనం జరగుతుందని ఒకనాడు గగ్గోలు…
స్కైలాబ్ విరుచుకుపడనుందని ఒకసారి చెలరేగిన గందరగోళం…
గ్రహాలూ గ్రహశకలాలూ తోకచుక్కలూ భూమిని ఢీ కొంటాయంటూ తరచు పేపర్ వార్తలు సృష్టించే కంగారు…
అలా ప్రపంచం నాశనమవుతుందంటే… ఆ క్షణాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసే – రాజకీయ నాయకుల రంగులు. వ్యాపారస్తుల యావ. సైంటిస్టుల కీర్తి కాంక్ష. నిరుద్యోగుల నిస్సహాయత. కలుసుకోలేని ప్రేమికుల ఆవేదన. ముష్టివాళ్ళ అతిసాహస వైఖరి. మిడిల్‌క్లాస్ సంసారుల నైతిక క్షోభ… వీటన్నిటినీ చిత్రిస్తూ ఉత్కంఠభరితంగా సాగిపోయే యండమూరి వీరేంద్రనాథ్ ఫాంటసీ-
9 in stock (can be backordered)