Additional information
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |
₹30.00
అంతరిక్షం నుండి భూగోళాన్ని చూసిన మొదటి మానవుడు యూరీ అలెక్స్‌యేవిచ్ గగారిన్.
ఆకాశం అద్భుతాలకు నిలయం. పగలు సూర్యుడు ఉంటాడు. రాత్రి నక్షత్రాలు వస్తాయి. పెరుగుతూ, తరుగుతూ చంద్రుడు వస్తాడు. అప్పుడప్పుడూ తోకచుక్కలు కనిపిస్తాయి. ఇవి అన్నీ ప్రాచీన మానవులకు ఆశ్చర్యపరిచాయి. క్రమక్రమంగా విజ్ఞానం వికాసం చెందుతూ ఆకాశంలోని వింతల గురించి అవగాహన కలిగించింది. ఆకాశంలో పక్షలు ఎరుగుతూ ఉంటాయి. వాటిలాగా ఎగిరి పోవాలని ప్రయత్నాలు చేశారు. మొదట వేడి గాలి గుమ్మటాలు ఆకాశంలో ప్రయాణించడానికి దారి చూపించాయి. తరువాత విమానాలు వచ్చాయి. భూమి నుండి 7 మైళ్ళ ఎత్తు వరకే ఇవి ప్రయాణం చేయగలుగుతున్నాయి. ఆకాశంలో గాలిలేనిచోటు ఉన్నది. అక్కడ ప్రయాణించడానికి ప్రత్యేకమైన సాధనాలు కావాలి. దానికోసం రాకెట్లు రూపుదిద్దుకున్నాయి. ఇవి గాలిలేని ప్రదేశాలలో కూడా ప్రయాణించగలుగుతాయి. వీటితో ఆకాశం చాలావరకు అందుబాటులోకి వచ్చింది. భూమి నుండి చాలాఎత్తు పోయిన తరువాత అంతరిక్షం ఉన్నది. దీనినే రోదసి అనికూడా అంటారు. అంతరిక్షాన్ని అందుకోవాలని, దానిలో ప్రయాణం చేయాలనీ ఆకాంక్ష పెరిగింది. దానికోసం కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్షనౌకలు అవతరించాయి. ఇక అంతరిక్షంలోకి మానవులను పంపే కార్యక్రమం మొదలయ్యింది. వోస్టాక్ అనే అంతరిక్ష నౌకలో రాకెట్టు సహాయంతో, అంతరిక్షంలో ప్రయాణించగల సాహసి కోసం అన్వేషణ మొదలయ్యింది. యూరీ అలెక్సేయెవిచ్ గగారిన్ ఎన్నికయ్యాడు. గగారిన్ రష్యాకు చెందిన వాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి మానవుడు. అతడి ప్రయాణం మానవ విజయానికి చిహ్నం. ఆ వీరుడి గురించి, అతడి సాహసయాత్ర గురించీ ఈ పుస్తకంలో వివరిచబడింది.
20 in stock (can be backordered)
Weight | 48 kg |
---|---|
select-format | Paperback |