Availability: In Stock

Sanivaram Naadi

SKU: GOD508

280.00

శనివారం నాది
Our greatest joy and our greatest pain come in our relationships with others.
—Stephen R. Covey
“మొదలైందా?” అతను అడిగాడు.
ఆ గదిలోకి వచ్చిన మంత్రసాని తలూపి అడిగింది.
“నిజంగా మీరు చూడాలనుకుంటున్నారా?”
“ఇంతదాకా వచ్చాక ఆ అనుమానం దేనికి?” నవ్వాడు.
“చూడటానికి ఎంతో బాధాకరంగా ఉంటుంది.”
“భయంకరంగా కూడా ఉంటుందా?” ఆశగా అడిగాడు.
“నిజానికి ఓసారి చూస్తే మీరెప్పుడూ ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళలేరు.”
“ఫర్వాలేదు. పద.”
అతను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, చిన్నగా మూలుగు వినిపిస్తున్న పక్క గదిలోకి వెళ్ళాడు. వెనకే మంత్రసాని వెళ్ళింది.
అదో చిన్న గది. గదిలో మంచం మీద ఓ ముప్ఫై ఆరేళ్ళ యువతి వెల్లకిలా వేడుకుని ఉంది. కళ్ళుమూసుకుని మూలుగుతోంది. ఆమె మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఓ బల్ల మీద కిరసనాయిలు స్టవ్ మీద గిన్నెలో మరుగుతున్న నీళ్ళు. ఆ నీళ్ళలో స్టెరిలైజ్ అవుతున్న రెండు కత్తెరలు, స్టవ్ పక్కనే హాస్పిటల్లో ఉపయోగించే దూది, పాతగుడ్డలు. నిశ్శబ్దంగా మంచం పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు…………….

5 in stock (can be backordered)

Additional information

select-format

Paperback