Additional information
Format | Paperback |
---|
₹90.00
ప్రేమలో పడటాన్నీ, ప్రేమించటాన్నీ, ప్రేమించబడటాన్నీ ఒకటేలా భావిస్తారు చాలామంది. ఇద్దరు వ్యక్తులు కలుసుకుని, ఒకర్నొకరు అద్భుతమైన వ్యక్తులుగా గుర్తించుకోవటంతో మొదలైన ఈ ప్రేమ, తన అద్భుతాన్ని కోల్పోకుండా వుండాలంటే యిద్దరికి బేసిక్‌గా కొన్ని అర్హతలు వుండాలి.
ప్రేమించటానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించటానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడటము.
ఒక పసివాడు ఎదుగుతుంటే, అతడి వ్యక్తిత్వాన్ని నిర్దేశించేవి అతడి తల్లిదండ్రుల తెలివితేటలు, వారసత్వం, జీన్స్, డబ్బు-ఇవేవి కావు. అతడి చుట్టూ వున్న పరిసరాలు. అందులో అన్నిటికన్నా దగ్గరయిన, అతి ముఖ్యమయిన పరిసరం తల్లి.
తల్లికడుపులోంచి బయటి కొచ్చి మొట్టమొదటిసారి స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే శిశువులాగానే, తల్లిదండ్రుల ప్రభావం నుంచి బయటికొచ్చి స్వతంత్రంగా, జీవిత సవాళ్ళను ఎదుర్కోవటం ప్రారంభించిన మనిషి, ఆ పరీక్షలో ఓడిపోతే మాడి మసైపోతాడు. గెలిస్తే పునీతుడవుతాడు, స్త్రీకయినా పురుషుడికయినా ఈ పరీక్ష జీవితంలో ఏదో ఒక స్టేజిలో తప్పదు. ఇదే అగ్ని ప్రవేశం.
భిన్నమైన కథతో, విభిన్నమైన పాత్రలతో, స్త్రీ సమస్య గురించి ఇంతకు ముందు ఏ రచయిత్రీ వ్రాయనంత సూటిగా తనదైన శైలిలో, సస్పెన్సు, టెన్షన్ మేళవించి యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ప్రయోజనాత్మక నవల ‘అగ్నిప్రవేశం’.