Availability: In Stock

Stock Market Lo Nastalanu Nirodhinchadam

SKU: manhul0057

299.00

6 in stock

Description

స్టాక్ మార్కెట్ లో నష్టాల్ని నిరోధించడం ఎలా?

  1. ఉపోద్ఘాతం

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి గురించి మీ మిత్రుల్నీ, ఇరుగుపొరుగు వారినీ లేక బంధువుల్నీ అడగండి. చాలామంది అది జూదంలో మరొక విధానమని మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తారు. స్టాక్ ధర గమనం వెనుక ఏ విధమైన తర్కమూ లేదనే చాలామంది ఇంకా నమ్ముతారు. స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తాల్లో లాభపడే వారంతా ‘అదృష్టవంతులే!

దీనికి విరుద్ధంగా, ఆసక్తికరమైన వాస్తవం- ప్రపంచంలోని బిలియనీర్ లలో ఎక్కువమంది ప్రత్యక్షంగా లేక పరోక్షంగా స్టాక్ మార్కెట్ ద్వారానే తమ పెన్నిధిని సృష్టించుకున్నారు. ప్రత్యక్షంగా అంటే సరాసరి స్టాక్ పెట్టుబడి, పరోక్షంగా అంటే స్టాక్ మార్కెట్లో తమ కంపెనీల్ని ‘లిస్టింగ్’ చేయించుకోవటం. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో పెట్టుబడిదారుల్లో, వితరణదాతల్లో ఒకరైన వారెన్బఫే, తన సంపదని ప్రత్యక్షంగా స్టాక్ పెట్టుబడి ద్వారా వృద్ధి చేసుకున్నారు. ప్రసిద్ది చెందిన ఇతర బిలియనర్ లో మైక్రోసాఫ్ట్ స్థాపకుడు) బిల్ గేట్స్, (ఫేస్ బుక్ స్థాపకుడు) మార్క్ జోకర్ బెర్గ్, (గూగుల్ స్థాపకుడు) లారీపేజ్ వంటి వారు తమ కంపెనీల్నీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ద్వారా తమ సంపదని వృద్ధి చేసుకున్నారు. భారతదేశంలో కూడా, రాకేష్ జంజన్ వాలా, రాధాకిషన్ దామాని, విజయ్ కేడియా వంటి ఇతర బిలియనరైనవారు తమ మొత్తం సంపదనంతా ప్రత్యక్షంగా స్టాక్ పెట్టుబడి ద్వారానే సముపార్జించు కున్నారు.

నా ప్రశ్న ఇదీ: స్టాక్ మార్కెట్ పెట్టుబడి మరో విధమైన ‘జూదం’ అయితే కోటీశ్వరులంతా స్టాక్ మార్కెట్ ద్వారా తమ సంపదని ఎలా సృష్టించుకోగలిగారు? సాంప్రదాయకమైన ‘జూదం’ ద్వారా ఒకటి రెండు సార్లు సంపాదించవచ్చు. కానీ, ‘జూదం’ ద్వారా ఒక బిలియనీర్ కావటం సాధ్యం కాదు. వారు కేవలం అదృష్టవంతులని చెప్పగలరా?……….

Additional information

select-format

Paperback

Author

J S Murthy