Availability: In Stock

Avadhana Sathakam- 1

SKU: NAV002-1-1-2-1-1

500.00

ప్ర: పెళ్ళయిన ఆడవాళ్ళకు తాళిబొట్టు గుర్తు మరి పెళ్ళయిన మగవాళ్ళకు?
జ. ఏడుపుగొట్టు మొహం. హాయిగా నవ్వలేక పోవడం.

                             ప్ర: దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?
                             జ. పగలు మనం తిరుగుతామనే భయంతో
ప్ర: పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళడం అంటే…
జ. అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని చంకన బెట్టుకుపోవడం.

                             ప్ర: కరిచే కుక్క మంచిదా? మొరిగే కుక్క మంచిదా?
జ. మా యింట్లో కరిచే కుక్క మంచిది. మీ యింట్లో మొరిగే కుక్క మంచిది.

ప్ర: పిల్ల ముందా? గుడ్డు ముందా?
జ. పిల్లే ముందు. 
పిల్ల పుట్టి బడిలో చేరి పరీక్ష రాశాక కదా మార్కుల్లో గుడ్డు పెట్టేది.

                             ప్ర: పద్యా నికీ, శ్లోకానికీ తేడా ఏమిటి?
జ. పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది.

                                  ఎందుకంటే అది slow ……… come

ప్ర: ‘మండే’ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జ. సండే సెలవు అనుభవించిన వారికి మర్నాడు పనిచేయాలంటే
     ఒళ్లు “మండే” – అందుకే

                             ప్ర: అంటరానితనం మహాపాపం. మరి వంటరాని తనం?
జ. మొగుడు పాపం

ప్ర: ఎక్స్ ప్రెస్ బస్ ను నాన్ స్టాప్ అంటారు. ప్యాసింజరు బస్ ను ఏమనాలి?
జ. నానాస్టాప్ అనాలి.

Additional information

Author

Dr Garikipati Narasimharao

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Avadhana Sathakam- 1”

Your email address will not be published. Required fields are marked *