Availability: In Stock

Kopparapu Kavula Daiva Sankalpam

200.00

కావ్య పరిచయం
దైవ సంకల్పం వెలుగులు
– ప్రాచార్య శలాక రఘునాథశర్మ
ఆశుకవిత్వానికి అలవాటుపడ్డవారికి రసనిర్భర కావ్య నిర్మాణం మీద సాధారణంగా దృష్టి నిలువదు. ఒకవేళ నిలిచినా నిర్మాణం నిరంతరంగా, నిరంతరాయంగా సాగదు. సాగినా విక్షేపాత్మకమైన మనస్సు కలాన్ని కావ్యాంతం దాకా పోనివ్వదు. ఒకవేళ పోనిస్తే ఆ కావ్యం ఒక అద్భుత సందర్భాల, ఆహ్లాదకర సంఘటనలు, రమణీయ వాగ్విన్యాసాల విశాల విహారశాలగా రూపొందుతుంది. దీనికి సజీవమైన ఉదాహరణ కొప్పరపు సోదరుల కలం వెలువరించిన కమనీయ కావ్యం ‘దైవ సంకల్పం’,
కొప్పరపు కవులు ఆ మాట అనలేదు కానీ విశ్వనాథవారి వాక్కును అన్వయిస్తే వారి చేతలు దీపితాలాతమువోలె ఆలాతాన్ని క్షణ విలంబలనం కూడా లేకుండా అతి తీవ్రంగా త్రిప్పుతూ ఉండాలి. త్రిప్పేవాడు ఏ కొంచెం అలసత్వం వహించినా చక్రం ఉండదు. చేతిలో కొరివి మాత్రమే ఉంటుంది. కొరివి ఉద్వేజకం. చక్రం ఆహ్లాదకరం. ఆ తాత్పర్యంతోనే విశ్వనాథవారు ఆ మాట అన్నారు. కొప్పరపు కవులు దానికి చక్కని ఉదాహరణగా నిలిచారు. పద్యం చెప్పటానికి, పెద్ద శక్తిమంతుడు కానక్కరలేదు. హృద్యం కావాలంటే, దానికి నిరవద్యతతో విరాజిల్లే నేతృత్వం కలగాలంటే అతడు తప్పనిసరిగా ప్రతిభలో మహాప్రాంశువు అయి ఉండాలి. ఈ సోదర కవులు ఎంతటి త్రివిక్రమ క్రమ పరిపాకం కలవారో నిరూపించటానికి నేనున్నానని నిరాఘాటంగా నిలుస్తున్న నిస్తుల కావ్యం ‘దైవసంకల్పం’..
కవిత్వానికి ఆవేశం కావాలంటారు కొందరు. నిజమే కానీ అది ‘భవ్యకవితావేశం’ అయితే తప్ప కవిత్వం చప్పచప్పగా తప్పితాలుగా అయిపోతుందని కవి బ్రహ్మలాంటి వారి అభిప్రాయం. ఆవేశం 14. భవ్యం కావటమంటే అది సంయమన సామ్రాజ్య పట్టాభిషిక్తం కావటమే. అది ఉత్తమ కావ్య సంపదను సమృద్ధిగా సమకూరుస్తుంది. దానికి మంచి ఉదాహరణ ‘దైవసంకల్పం’.
కొన్ని సందర్భాలలో ఇతివృత్తం కవికి కొండంత అండగా నిలుస్తుంది. మరికొన్ని సందర్భాలలో కవి ప్రతిభ ఇతివృత్తానికి హితరమణీయ దీప్తిని కలిగిస్తుంది. అప్పుడు కావ్యం హిరణ్యాత్మకమై కవిని హిరణ్యగర్భ సదృశుని చేస్తుంది. ఈ రెండవ విధానానికి దృష్టాంతంగా నిలువగల సత్తా నాకున్నదని సగర్వంగా చాటుతున్న కావ్యం ‘దైవసంకల్పం’.
“కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు ఆర్యసత్కథలు పుట్టురత్నములు. సత్కవి కల్పనామనీషావహ పూర్వవృత్తములు సానలు దీరిన జాతిరత్నములు” అని వక్కాణించాడొక గొప్ప భావకుడు. నిజజీవితంలో తారసిల్లిన ఒక చిన్న సంఘటన నుండి కూడా జాతిరత్నస్థాయి సత్కావ్యాన్ని కాక సమర్థుడు సంతరింపగలడని నిరూపించే మహాకృతి ‘దైవసంకల్పం’…………….

5 in stock (can be backordered)

Additional information

Weight 48 kg
select-format

Paperback