Availability: In Stock

Navala Prajalu – నవల ప్రజలు

SKU: BVPH0010-1-1

100.00

మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ”టిమాల్కియోస్‌ బాంక్వెట్‌,” ”డాఫ్నీ అండ్‌ ఓలీ” వద్దనో, మరింత వెనక్కువెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్‌ (క్రీ.పూ.5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించింది మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరిమెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు – మరీ ముఖ్యంగా ముద్రణా యంత్రయుగానికి చెందిన వస్తువే.

సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమేకాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల.  మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది…..

20 in stock

Additional information

Weight 48 kg
select-format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Navala Prajalu – నవల ప్రజలు”

Your email address will not be published. Required fields are marked *