Availability: Out of Stock

Sri Datta Puranam

Author: Ravi Mohana Rao
SKU: MOHAN001

450.00

ఇది శ్రీ దత్తపురాణమను మహాగ్రంథము, సంస్కృతమున పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి                  రచించినది,  తెలుగులో టీకతో సమర్పింపబడుచున్నది. ఇది ఎన్మిది అష్టకములుగను, ఒక్కొక్క అష్టకము ఎన్మిది అద్యాయముల                    గుచ్చముగను  రూపము దాల్చినది. ఇందు మొత్తము 3500 శోకములున్నవి.

ఈ అష్టాష్టక అష్టాధ్యాయ విషయములు సూచికలో చూడవచ్చును. సంస్కృత వ్యాఖ్యతో కూడిన నాగరిలిపి ప్రతి నాకు                      లభించినది. దానిని పరిశీలించి తెలుగులో ప్రతిపదార్థతాత్పర్యములను కూర్చినాను. పాఠకమహోదారులకు ఇది ప్రయోజనకారి కాగలదని నమ్మిక.

సర్దము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము అను ఈ అయిదు లక్షణములున్నది పురాణము, అని              లక్షణము చెప్పబడినది. ఈ గ్రంథమునందు ఈ లక్షణములున్నవా? అను ప్రశ్నకు శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి వారి సమాధానము : ఈ        గ్రంథమున ప్రకరణవశాత్తు ప్రథమకాండమున సర్గము, అంతిమకాండమున ప్రతిసర్గము, మధ్యలో వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము      వర్ణింపబడినవి కావున దీనిని పురాణమనుట సార్థకమే.

ఇందు ఉపాసనాకర్మజ్ఞానకాండల విషయములను సమాచరించు భక్తుల అనుభవము ప్రతిపాదింపబడినది. తెలుగువారికీ                  గ్రంథవిషయము నందించుట కర్తవ్యముగా నెంచి మిత్రులు రావి మోహనరావుగారు ప్రోత్సహించగా నే నీ పనికి పూనుకొని యథాశక్తి                    శ్రమించినాను. నా శ్రమ ఫలవంతమైనదను నమ్మికతో దీనిని మీ ముందు ఉంచుచున్నాను. ఈ కృషిలో నా ప్రతిభావ్యుత్మతులు చాలినవో              లేదఆశ్రీ  దత్తునకే ఎఱుక. ఎఱుక గల పాఠకులు దతస్వరూపులై మన్నింప ప్రార్థన.

Out of stock

Additional information

select-format

Paperback

book-author

Ravi Mohana Rao