Availability: In Stock

Vasanthgeetham

SKU: Perspectives

250.00

‘వసంత గీతం’ నిర్దిష్టమైన సమకాలీన చారిత్రక నవల. 1985 – 86 మధ్య కాలం నవలా వస్తువు. అట్లే ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవితం, పోరాట ఆచరణ, త్యాగాలు చిత్రించిన రాజకీయార్ధక చారిత్రక నవల ఇది. రష్యా, చైనా విప్లవాల కాలంలో వెలువడిన యుద్ధ కాలపు నవలల వంటి ఒక ప్రామాణిక (క్లాసికల్) నవల ఇది. ఆదిలాబాద్ జిల్లా అడవంచు గ్రామాలు, అప్పటికి దండకారణ్యంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లా అడివి, ఈ నవలకు స్థలం, కార్యక్షేత్రం. తెలుగులో అరుదైన ప్రజా సైన్య నవల ఇది. ‘పోదామురో జనసేనలో కలిసి, ఎర్రసేనలో కలిసి’ అని 1972 -73లో పాడుకున్న పాటలు, ‘ఓరోరి అమీనోడా, ఓరోరి సర్కారోడా’ వంటి పాటలు ప్రజలకు ఎంతో భవిష్యదాశావహ గీతాలుగా… పాలకులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గుండె బెదురుగా, కొందరికి అతివాద దుస్సాహసంగా కనిపిస్తున్న కాలం కదిలివచ్చి ఒక దార్శనికతతో స్వీయరక్షణ అంటే శత్రువుపై దాడి, రిట్రీట్ అంటే విస్తరణ, ప్రజాపంధ అంటే ప్రజలకు భూములు పంచడమనే విప్లవ కార్యక్రమం ప్రజల్ని సాయుధుల్ని చేసి, ప్రజాసైన్య నిర్మాణంతో ప్రజా రాజకీయాలను అమలు చేసే ప్రత్యామ్నాయం అనే స్పెషల్ గెరిల్లా జోన్ పర్ స్పెక్టివ్ అని రుజువు కావడం ఒక కళ్లకు కట్టిన కధనం వలె సాగిన నవల ఇది. ఇది గ్రీష్మర్తువుతో పాటు వచ్చే ‘వసంత గీతం’

19 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

Author

Allam Rajaiah