• Savitri Classics

    0

    ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకం ఒక్కోపేజీ తిప్పుతూ చదువుతూ వెళుతుంటే అప్పటి రోజులు, ఆ చిత్రాలు, ఆనాటి కళాకారులు.. అన్నీ కళ్ళముందు రీల్లా తిరిగాయి. అప్పటి కాలానికి వెళ్లిపోయాను. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల రోజుల్ని ఎందుకు స్వర్ణయుగం అంటామో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. సావిత్రిగారు నటించిన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు వేరు వేరు అధ్యాయాలుగా విభజించి వివరించడం బాగుంది. మరీ ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఎంత చెప్పాలో అంతే చెబుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా సులభంగా అర్థమయ్యేలా సాగిన సంజయ్ కిషోర్ రచనాశైలి బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనీ, మళ్లీ మళ్లీ చదవాలనీ అనిపిస్తుంది ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సావిత్రి గారంత అందంగా ఉందీ పుస్తకం. ముఖ్యంగా సావిత్రిగారి అభిమానులకు ఈ పుస్తకం ఓ పండగేనని చెప్పాలి.

    ‘పద్మభూషణ్’ శ్రీమతి పి. సుశీల
    ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని

    సంజయ్కిషోర్ వ్రాసి రూపొందించిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకం చేతిలోకి తీసుకొని ముఖచిత్రాన్ని అలా చూస్తుండిపోయాను. పేజీ తిప్పాలన్న అలోచన కూడా కలగలేదు. పుస్తకం లోపల ఏముంటుందో మొత్తం ఆ ముఖచిత్రమే చెప్పేసింది. అంత అందంగా ఉంది. భక్తులు రామాయణం, మహాభారత గ్రంథాలను ఎలా దాచుకుంటారో.. సినీప్రేమికులు సంజయ్కిషోర్ వ్రాసే పుస్తకాలను అలా దాచుకోవాలి.

    శ్రీ మురళీమోహన్

    ప్రముఖ నటులు, నిర్మా

    750.00
    Add to cart
  • Yodhudu Ambedkar

    0
    150.00
    Add to cart
  • Adolfh Hitler

    0
    మొదటి ప్రపంచంలో ఒక సామాన్య పౌరునిగా ఆస్ట్రియాలో జన్మించి జర్మనీ తరపున పోరాడి అందులో జర్మనీ ఓడిపోగా నానాజాతి సమితి ఇతర జర్మన్ వ్యతిరేక ఐరోపాదేశాలూ జర్మనీని నిర్వీర్య చేయగా హిట్లర్ 40 మంది వున్న ‘నాజీ’ పార్టీలో చేరి జర్మన్ లలోని అసంతృప్తిని తనకనుకూలంగా మలచుకొని జర్మనీని చాన్సలర్ తర్వాత అధ్యక్షుడు; సర్వసేనాధిపతి అయి రెండవ ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువై అటు పశ్చిమ ఐరోపాలో బ్రిటన్ వరకూ తూర్పున రష్యావరకూ జర్మన్ సామ్రాజ్యాన్ని విస్తరించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
              కాని యుద్ధపుచివరి దశలో ప్రపంచాన్నే జయించాదలచి తప్పుడు ఎత్తుగడలతో రష్యాలో ఓటమిచెంది అటునుండి బ్రిటన్ కు అమెరికా సహాయపడగా తను జయించిన రాజ్యాలు పోగొట్టుకోవడమేకాక జర్మనీని కూడా సర్వనాశనం వైపు నడిపి చివరికి పరాభావంతో ఆత్మాహత్య చేసుకున్న మొండివాడేకాక ఆర్యతెగ అందునా జర్మన్ లే అధికులని చాటదలచి యుద్దాలతో జర్మనీని, ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన అహంకారి. మేధావి క్రూరుడైతే ఏమి జరుగుతుందో హిట్లర్ జీవిత చరిత్ర తెలియజేస్తుంది. అది తెలుసుకోవడానికాక రెండవ ప్రపంచ యుద్ధ కారణాలు, యుద్ధ ప్రభావాలు తెలుసుకోవడానికి ఈ రచన చదవండి.
                                                                                                     – స్వర్ణ
    175.00
    Add to cart
  • Ajnatha Yodhudu

    0
    అజ్ఞాత యోధుడు
    నాకు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చెవులు బ్రద్దలయ్యేలాంటి విస్ఫోటనం వల్ల ఇల్లు ముక్కలు చెక్కలు అవుతుందని అనిపించింది. సూర్యోదయకాలపు గుచ్చుకునే వెలుతురుకు నా కళ్ళు సంకోచించాయి. జనాల కేకలు, ప్రేల్చుతున్న తూటాల శబ్దాలతో నా చెవులు నిండిపోయాయి. నేను చాలా ఆలస్యంగా, తెల్లవారటానికి మునుపు పడుకున్నాను. బాగా అలసిపోయాను. ఆ కారణంగా నిద్ర నుంచి లేవటానికి నాకు చాలా కష్టమైంది.
    ఆస్ట్రోవికా కొండ నుంచి దూరపు ప్రయాణాన్ని ముగించి నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. అక్కడ దాయాదులకు సంబంధించిన ఒక పొట్లాటనో, అపరాధమో జరగబోతోంది. ఇరువైపులవారిని రాజీ చేయటానికి మా పార్టీ,…………….
    200.00
    Add to cart
  • Akbar- The Great

    0
    ఇంతకముందు పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించే మహాసామ్రాజ్య స్థాపకులైన అలెగ్జాండర్, జూలియస్ సీజర్, చెంఘిజ్ ఖాన్, ఏకవ్యక్తి పాలకులైన నెపోలియన్, హిట్లర్ జీవిత చరిత్రలు; వారి బలాలు బలహీనతలు గురించి సంగ్రహంగా రాశాను. అయితే భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులలో అంతటి గొప్పవారు లేరా అంటే అశోకుడు ఒకడు కాగా మధ్య యుగాలలో ఆసియావాసి అక్బర్ గొప్ప పాలకుల్లో మరొకడు.ఇతడు చెంఘిజ్ ఖాన్ వారసుడైన బాబర్ మనుమడు. ఎందరో విదేశీయులు భారతదేశాన్ని దోచుకుని వెళ్ళిపోగా బాబర్ మాత్రం భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించగా అతడి మనుమడు, హుమాయూన్ కుమారుడైన అక్బర్ దక్షిణ భారతంలోని దక్కను ప్రాంతం వరకూ జయించి మొగల సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాడు. 
                 ఇస్లాం మతంలో జన్మించిన ఈ చదువురాని పండితుడు అన్ని మత నాయకుల సమావేశాలు జరిపి తనూ ఆ చర్చల్లో పాల్గొని ప్రతి మతంలో మంచి – చెడు ఉన్నాయని; ఏది హేతుబద్ధమో అదే మంచి అని దీన్ – ఇల్లాహీ మతాన్ని ప్రతిపాదించాడు. కాని దాన్ని తన కొలువుకే పరిమితం చేశాడు. బలవంతపు మత మార్పిడులను నిరసించి మతసహనంతో కూడిన పాలన చేశాడు. తన కొలువులో ఎందరో హిందువులకు ప్రాధాన్యత నిచ్చి భారతదేశంలో నూతన సంస్కరణలకు పాలనా విధానానికి దోహదపడిన మధ్యయుగాల మహాచక్రవర్తి. అంతేకాక మొగల చక్రవర్తులలో అతి తక్కువ కాలం పాలించి భారతీయ ప్రజల మన్ననలు పొందినవాడు. అతడి జీవిత విశేషాలు, ఆసక్తికర ఘటనల సమాహారం ఈ రచన.
                                        – స్వర్ణ
    90.00
    Add to cart
  • Idi Naa Godava

    0
     కాళోజీ అదృష్టవంతుడు. ప్రజా ఉద్యమాలు ఆయనకు ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో నిరాశ నిస్పృహలకు గురి అయ్యే స్తబ్దతకు చోటు ఇచ్చాయేమోకాని ఎనభై ఒకటో  ఏట కూడా ఇంట్లో కూర్చోనీయకుండా జనంలోనికి, వీధుల్లోకి, జనపదాల్లోకి, తమ మధ్యకు తెచ్చుకుంటే ఉన్నాయి. ‘ఆనాడు నైజాంకు అదే చెప్పాను. ఇవ్వాళ నారా చంద్రబాబు నాయుడుకు అదే చెప్తున్నాను. ప్రజలకు చెప్పాల్సిందేమీలేదు. ప్రజలే తమ అనుభవాలు, పోరాటాలు చెప్పడానికి ఎన్నో అడ్డంకులు దాటి వచ్చారు. కనుక ప్రజలూ నేను కలిసి ప్రజల్లో ఒకనిగా ‘నా గొడవ’ బద్మాషులైన పాలకులకు చెప్తున్నాను’ అంటున్నారు.
    150.00
    Add to cart
  • AMBEDKAR Quotes

    0
    400.00
    Add to cart
  • Ambedkar Jeevanam

    0
    కుల అణచివేత గురించి బాబాసాహెబ్ ఆయన మార్గ దర్శకుడు పూలే, వర్ణ వివక్ష గురించి మార్టిన్ లూథర్ జూనియర్, కార్మికుల గురించి మర్క్స్, చేసిన విశ్లేషణలు ప్రపంచ గమనానికి అద్దం పట్టాయి.
             అంబెడ్కర్ జీవనం మన శరీరంలో నరనరాన గూడు కట్టుకొన్న నిరాశను, సోమరితనాన్ని నిర్దాక్షిణ్యంగా బద్దలు కొడుతోంది.
        ప్రతి ఒక్కరి జీవితంలోని విలువైన సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకొనే సామర్థ్యం సంతరించుకొ గలగడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది.
                                                                           – డా. జి. వి. రత్నాకర్
    100.00
    Add to cart
  • Antaranithanam Atmakatha

    0
    మనదేశంలో అంటరానితనం ఉనికిలో ఉన్న విషయం విదేశీయులకు తెలుసు. కాని అది ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వారు మన పొరుగున లేరు. అంటరానితనం ఎంత దుర్భరమో వారు అర్థం చేసుకోలేరు. హిందువులు పెద్ద సంఖ్యలో నివసించే ఊళ్లకు వెలుపల బతకడం, ప్రతిరోజు ఊర్లోని అశుద్దాలను మోసుకెళ్లడం, ఇంటి ద్వారాల ముందు ఉంచిన ఆహారాన్ని తెచ్చుకోవడం, హిందూ వైశ్యుల అంగళ్లకు దూరంగా నిలబడి సరుకులను కొనుక్కోవడం, ఊళ్లోని ప్రతి ఇంటిని తనదిగా భావించి సేవలు చేసినా ఎవరినీ తాకడానికి వీల్లేదు. అంటరానివారు ఉన్నత కులాల చేత ఎలా వేదన చెందాల్సి వస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. సాధారణ స్థితిని వివరించడం లేదా ఆ దుర్మార్గాలకు సంబంధించిన ఘటనలను వారి ముందుంచడం అనే రెండు పద్ధతుల ద్వారా మన లక్ష్యాన్ని సాధించగలం. మొదటి పద్దతి కంటే రెండవది సమర్ధమైందని భావిస్తాను. ఈ పరిస్థితులను తెలియచెప్పడానికి నా అనుభవాలతో పాటు ఇతరుల అనుభవాలను కొన్ని, వివరిస్తాను. నా అనుభవాలతో మొదలెడతాను.
                                                                                                         – డా|| బి.ఆర్. అంబేడ్కర్
    60.00
    Add to cart
  • Dr B R Ambedkar

    0

    డా॥ అంబేడ్కర్ ఆధ్వర్యంలో

    పనులు, గనులు, అధికారాల శాఖ

    పనులు, గనులు, అధికారాల శాఖ అనే కొత్త శాఖ స్థాపనతో 1946, ఏప్రిల్ 8 నుంచి కార్మిక శాఖ పనుల విభజనల అమలులోకి వచ్చింది.

    ఈ పనులు గనులు అధికారాల శాఖ కేంద్ర ప్రభుత్వ పనుల శాఖ (పి.డబ్ల్యు. డి) కేంద్ర నిర్మాణాల ప్రొజెక్టర్ల నిర్వహణలాగా సివిల్ ఇంజనీరింగ్ గనులు, ఖనిజాలు, భారత భూగర్భ సర్వే, కేంద్ర జల మార్గాలతో సహా పెద్ద తరహా నీటి పారుదల పనులు, నీటిపారుదల, నౌకాయాన సమితి, విద్యుత్తు, స్టేషనరీ, ప్రింటింగ్ మొదలైన అంశాలను చూస్తుంది.

    కార్మిక శాఖ ఎప్పటిలాగే ఐ.ఎన్.టి.సి. కార్మిక సంక్షేమం, కార్మిక సంబంధాలు, అమలు, రక్షణ ప్రమాణాలు, మాజీ భద్రతా చర్చలు, కార్మిక చట్టాల శాసనీకరణ సైనికోద్యోగులకూ స్త్రీలకూ సంబంధించి పునరావాసం; సాంకేతిక, వృత్తిపర శిక్షణా పథకాలు, కార్మిక చట్టాలు – గణాంకాలు, పరిశోధన, దర్యాప్తు అంశాలను చూస్తుంది.

    ఈ రెండు శాఖలు కార్మిక సభ్యుడు గౌ॥డా॥బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఉంటాయి. బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా ఎప్పటిలాగే పరిశ్రమలు – సరఫరాల సభ్యుని ఆధ్వర్యంలోనే ఉంటుంది.

    గౌరవనీయులు శ్రీ హెచ్.సి.ప్రియర్ ఈ పనులు గనులు అధికారాల శాఖ కార్యదర్శిగా ఉంటారు. శ్రీ ఎస్. లాల్ కార్మిక శాఖ కార్యదర్శిగా ఉంటారు.

    దామోదర్ ప్రాజెక్ట్

    55కోట్ల రూపాయల దామోదర్ నదీ ప్రాజెక్ట్ మొట్టమొదటి ఆనకట్ట నిర్మాణం పని తిలైయావద్ద వెంటనే ప్రారంభించే అవకాశం గురించి సత్వరమే దర్యాప్తు చేయాలని…………….

    120.00
    Add to cart