• Vaktha (Telugu Edition)

    0

    మీరూ కావచ్చు ‘వక్త’
    వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్‌ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.

    200.00
    Add to cart
  • Purushulu Kujagrahavasulu, Sthreelu Sukragrahavasulu

    0

    అత్యంత ప్రసిద్దమైన అనుబంధాల కరదీపిక. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు సుక్రగ్రహవాసులు అనే జాన్ గ్రే రచన కోట్లాది దంపతులకు తమ సంబంధాన్ని మరింత గాడతరం చేసుకోవడానికి ఉపకరించింది. దీనిని ఒక ఆధునిక శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు తమ నిజ వ్యక్తిత్వాలు, ప్రత్యేకతల గురించి తెలియజెప్పడమే కాక, ఇద్దరి మధ్య వైరుధ్యాలు తలెత్తకుండా తమతమ అవసరాల్ని నెరవేర్చుకోవడం ఎలాగో ఈ పుస్తకం నేర్పింది. స్త్రీ పురుష మధ్య గాడానురాగం వృద్ధి చెందడానికి సంబంధించిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ పుస్తకం చెబుతుంది.

    ఈ పుస్తకం కింద పేర్కొన్న విషయాల్లో సహాయపడుతుంది.

    – ప్రేమాస్పదమైన, శాశ్వతమైన స్త్రీ, పురుష సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం.

    – ఎదుటివారి మనోభావనల్ని గ్రహించడం, తదనుగుణంగా ప్రతిస్పందిoచడాన్ని నేర్చుకోవడం.

    – ఎలాంటి కపట్యo, విసిగించడం వంటివి లేకుండా మీ అవసరాల్ని తీర్చుకోవడం.

    – సంక్లిష్టమైన అనుభూతుల్ని ఎదుటివారికి వ్యక్తం చేయడం.

    – వాగ్వివాదాల వల్ల కలిగే బాధను నిరోధించడం.

    – మీ జీవిత భాగస్వామిని, ఉద్యోగ వ్యాపార సహచరుల్ని లేదా స్నేహితుల్ని ఇదివరకటికంటే సమర్థవంతంగా అర్థం చేసుకోవడం.

    – పసుపులేటి గీత

    350.00
    Add to cart