• Jai Bhim

    0
    799.00
    Add to cart
  • Jathiyodyamamlo Dr. B. R Ambedkar

    0
       కరుడుకట్టిన బ్రాహ్మణీయ కులాధిపత్య క్రౌర్యానికి వ్యతిరేకంగా హేతువాద శ్రామిక సమతా భావనలను ఈ దేశీయ సాంస్కృతిక వారసత్వాల నుండి, సామాజిక మార్పు కొరకు జరిపిన ఈ దేశ మూలవాసుల పోరాటాల నుండి, విముక్తి సిద్దాంతాల నుండి సంగ్రహించి అభివృద్ధి చేసిన గ్రంధమే డి.ఆర్. జాతవ జాతీయోద్యమంలో
    డా॥బి.ఆర్.అంబేడ్కర్.
                                  డి.ఆర్. జాతవ తత్వశాస్త్ర అధ్యాపకులుగా పదవీ విరమణ పొందారు. వీరు అంబేడ్కర్ మరియు అంబేడ్కరీయ తత్త్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఈ దేశ పరిస్థితులను విశ్లేషించి అనేక గ్రంథాలను రచించారు. తద్వారా అంబేడ్క రీయ భావజాలానికి సాధికారతను సాధించి పెట్టారు. . ,
    200.00
    Add to cart
  • Dr. B. R. Ambedkar Kulanirmulana

    0
       వొకవైపు హిందూ అగ్రవర్ణాలు మతరూపంలో మరింత బలపడుతూ వుండగ వీరి తరతరాల పీడన / దోపిడీ దౌష్ట్యాల నుంచి మనల్ని మన సమూహాల్ని కాపాడుకోవాల్సిన అభ్యుదయకర శక్తులన్నీ అనేక శిబిరాలు | గుంపులు | పార్టీలు| ఫేస్ బుక్ / వాట్సప్ గ్రూపులుగా విడిపోయి సృజనద్వేషంతో పొంగి కునారిల్లుతూ పరోక్షంగా మతానికి పెద్దమనసుతో సహకరిస్తూ దాసోహం అంటూ వూడిగం చేస్తున్నాయి. అంబేద్కర్ కాలంనాటి సంస్కరణావాదలకు నేటి అభ్యుదయ శక్తులకు ఏమాత్రం తేడా లేకపోవడం మనకాలపు విషాదం. అందుకే మనలోని మానసిక రుగ్మతలకి యాంటీ డోట్ ఈ రచన. “ఈ రచనను చదవండి.. చదివించండి… ఇటువంటి రచనలపట్ల ఆసక్తి వున్నవారికి చదవమని చెప్పండి… ఎడ్యుకేట్ చేయండి… ఆర్గనైజ్ చేయండి… అజిటేషన్ కి కావల్సిన పునాదులు నిర్మించండి అదే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.”
                                                                                                                                   – లెనిన్ ధనిశెట్టి
    100.00
    Add to cart
  • Vidvamsam

    0
    550.00
    Add to cart
  • Ivee Mana Moolaalu

    0
    సాహసం, కానీ ఎంతో అవసరం
    కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.
    ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి ‘ఇన్సైడర్’కు ‘లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన ‘మోహన్ దాస్’కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.
    ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ‘ఇవీ మన మూలాలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.
    —-ఇవీ మన మూలాలు 7
    450.00
    Add to cart
  • Madi Vippina Charitra

    0

     ఈ పుస్తకం ఒక ప్రత్యామ్నాయ భారతీయ చరిత్ర పాఠం కాగలదు. నిమ్న వర్గాల దృష్టిలో చరిత్ర రచన అవసరమని సబ్ఆల్టర్న్ థియరి సూచిస్తున్నది. కానీ అటువంటి రచన చేసేందుకు ఆ వర్గాలకు చెందినవారు ఎప్పుడు ప్రయత్నించలేదు.

                                                         – గెయిల్ ఓంవేట్

           ఇది సామాన్యమైన రీతిలో విషయాలను బాగా చర్చించిన రచన. ప్రస్తుత దృక్పథంతో పూర్తిగా విభేదించే వర్గాల దృక్పథాన్ని ఆవేదనతో ఆర్ద్రతతో లోతుగా చర్చిస్తుంది. అదే సమయంలో అది సరైన దృక్పథమని మనలను ఒప్పిస్తుంది.

                                                         – ఉమా చక్రవర్తి

           ఈ రచన అనువాదం అనేక భారతీయ బాషలలో వెలువడవలసిన అవసరం ఉంది. వెలువడగలదని భావిస్తున్నాము. ఒక కొత్త సమాజ నిర్మాణానికి తగిన ఆలోచనల కోసం అన్వేషిస్తున్న పోరాట ప్రజలకు ఇది గొప్పగా ఉపయోగపడుతుంది.

                                                         – మెయిన్ స్ట్రీమ్ పత్రిక

    300.00
    Add to cart
  • The God Father

    0

    ది గాడ్ ఫాదర్

    న్యూ యార్క్ మహానగరం.

    మూడో నెంబర్ క్రిమినల్ కోర్ట్ ఆవరణ.

    ఆవరణలో చాలా మంది మనుష్యులు వేచి ఉన్నారు. న్యాయమూర్తి రాక కొరకు వాళ్లు పడిగాపులు పడుతున్నారు. వారిలో అమెరిగో బోనసేరా ఒకడు.

    అతడు పగతో రగిలిపోతున్నాడు.

    అతడి కూతురును కౄరంగా గాయపరిచారు. ఆ బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అతడి కూతురు మర్యాదను మట్టిపాలు చేయాలని ప్రయత్నించారు.

    న్యాయమూర్తి దిగబడ్డాడు. ఆయన భారీకాయుడు. న్యాయమూర్తి నల్లటివీ, పొడవు పాటివీ దుస్తులు ధరించాడు. తన ఎదుట నిలబడిన ఇద్దరు యువకులను పవిత్రీకరించే ఉద్దేశ్యంతోనే ఆయన తన ఆసనంలో కూర్చున్నట్టు తోస్తోంది.

    న్యాయమూర్తి మొహంలో ఎటువంటి భావాలూ లేవు. న్యాయమూర్తిగా సంతృప్తి చెందుతున్నట్టు ఉంది ఆయన మొహం. తన కూతురు విషయంలో ఆయన న్యాయసమ్మతమైన తీర్పును ఇవ్వడేమో అని అమెరిగో బోనసేరాకు తోస్తోంది. తన మనస్సు ఎందుకలా భావిస్తోందో అతడికే కావడంలేదు. అ

    న్యాయమూర్తి ఎదుట ఉన్న ఇద్దరు యువకులూ గుడ్లప్పగించి న్యాయమూర్తినే చూస్తున్నారు.

    వాళ్లను పరిశీలనగా చూస్తూ, “మీరు అసలు మనుష్యులేనా? మీ ప్రవర్తనకు మీకు సిగ్గనిపించడంలేదా?” అంటూ, న్యాయమూర్తి కోపం వ్యక్తం చేశాడు. యువకులు భిన్నులైపోయారు. పశ్చాత్తాపంతో కాబోలు తలలు దించుకున్నారు. మాట పడిపోయినవారి మాదిరిగా వారు కిక్కురుమనడంలేదు.

    “ఆమాత్రం చాలు. మీలో కొంత మార్పు వచ్చింది. మిమ్మల్ని పశ్చాత్తాపం దహిస్తోంది. ఆమెను లైంగికంగా వేధించలేదు కాబట్టి సరిపోయింది. తీవ్రంగా గాయపరచిన విషయం అలా ఉంచుతాను. మీరు ఇరవై సంవత్సరాల జైలు జీవితం గడపబోయేవారు. అయినప్పటికీ మీ ఇద్దరి మీదా పాత నేరాలు ఎటువంటివీ మోపబడి లేవు. అందువల్లనే మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. నిర్దోషులుగా విడుదల చేస్తున్నాను” అన్నాడు న్యాయమూర్తి………….

    300.00
    Add to cart
  • Rugvedha Aryulu

    0

    మనం – మన పూర్వీకులు

    నేడు మనదేశంలో మానవుని చూస్తున్నాం. అతని సాంఘిక, రాజకీయ, మున జీవితాన్ని ఎరుగుదుం, అతని ఆహారం, వేషభాషలు, నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు. “మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ వుంది. ఈ సంగతిని ఎవరూ కాదనలేరు. కాని ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకొనుట కషం. ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని, అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వమున్న కాలాన్ని, సాంఘిక, ఆర్థిక, మతదృష్టితో పరిశీలిస్తే, మార్పు నమ్మకంగా తెలుస్తుంది. మనం క్రీ|| శ|| 1956 నుండి కాకుండా క్రీ॥ ఈ 1950 నుండి వెనక్కు పయనించుదాము. ఇక్కడ 1857 ను గురించి ఒకమాట చెప్పాలి.. 1857 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయులైనందున మనదేశంలో ఆంగ్లరాజ్య స్థాపన జరిగింది. కాబట్టి చాలామంది మేధావులు •57ను చాలా చెడుగా భావిస్తారు. కాని 1657, 1557, 1457 మొదలైన సంవత్సరాల్లో అటువంటి అనిష్టాలు మనదేశంలో ఏమీ కానరావు. | క్రీశ 1950 1ఇప్పుడు మనం రాతియుగం, రాగియుగం, యినుపయుగం. తుపాకిమందు.

    ఆవిరి యుగాలను దాటి పరమాణుయుగంలో ఉన్నాం. 2 వాయు మండలంపై మనకు అధికారముంది. గంటకు 500 మైళు వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. ఇక రైళ్ళు, మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది?

    మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. 4మన గణరాజ్యానికి రాష్ట్రపతి డా|| రాజేంద్రప్రసాదు. ఆయన మనదేశ రాజధాని

    ఢిల్లీలో వుంటారు. మనకు ముఖ్యమైన సమన్వయ భాష హింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ

    మొదలైన సాహిత్య భాషలున్నాయి. ఇవే కాకుండా మైథిలీ, మాగధీ, భోజపురి, ప్రజ, మాళవీ, రాజస్థానీ, కౌరవీ, పహాడీ మొదలైనవి కూడా సాహిత్య భాషలే.

    (అవికూడా సాహిత్య భాషలవుతున్నాయి.) 6. మనం పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో వున్నాం. 7. మనచేతిలో రాజ్యాధికారాన్ని అట్టి పెట్టుకొనుటకు యుద్ధ విమానాలు, అణు

    బాంబులు పరమాస్త్రాలుగా వున్నాయి. భీషణ ఫిరంగులు, మెషినుగన్నుల సంగతి

    చెప్పనవసరం లేదు. 8. మనదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం ముఖ్య మతాలు. కాని

    విద్యావంతులకు ఆ మతాలపై పూర్వంవలె విశ్వాసం లేదు. 9. చదువుకొన్నవారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు. వివాహాదుల్లో

    కూడా కులగోత్రాలు కూలుతున్నాయి. 10. సాహిత్యాకాశంలో రవీంద్రుడు,

    జయశంకరప్రసాదు అస్తమించారు. హిందీలో నిరాలా, సుమిత్రానంద పంతు యిప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు.

    180.00
    Add to cart