• MeToo [Telugu]

    0

    మీటూ మీటూ అంటూ గొంతెత్తింది అర్బన్ లివింగ్ పీపుల్ అయినా మీటూని ప్రతిఘటించింది, దారి చూపింది, పరిష్కారాలు చెప్పింది మాత్రం విశాల గ్రామీణ మహిళ. మీటూ అంటూ యెలుగెత్తడమే కాక పరిష్కారాలు చూపుతున్నారు. ఆదివాసీ మహిళలు. కొత్త చరిత్ర రాస్తున్నారు. అర్బన్ లైంగిక వేధింపుల సమస్యల్లో వర్గ వివక్ష వుండదు. భరించడమే తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో యెలుగెత్తడమే తప్ప ప్రతిఘటన, పరిష్కారాల అన్వేషణ వుండదు. ప్రధానంగా కెరీర్ కోసం లొంగుబాటే యెక్కువగా వుంటుంది. అదే గ్రామీణ వ్యవస్థలో వర్గ వివక్ష వుంటుంది, కుల వివక్ష వుంటుంది, జెండర్ వివక్ష వుంటుంది. వర్గనిర్మూలన అనేది వో పరిష్కార దిక్చూచిగా ముందుకొస్తుంది. మనం ప్రపంచం కోసం మాట్లాడితే ప్రపంచం మనకోసం మాట్లాడుతుంది.

    165.00
    Add to cart
  • Zen

    0
      వివిధ సాహిత్య ఉద్యమాలు తెలుగుదేశాన్ని ఎంతో కొంతకాలంపాటు ప్రభావితం చేసి చివరకు ప్రధాన సాహితం స్రవంతిలో కలసి పోతూ వుంటాయి. ఈ ఉద్యమాలతో సంబంధం లేకనో వాటితో విభేదించకుండానో కేవలం జీవితాన్ని మాత్రమే పట్టుకుని ప్రయాణించే సాహిత్యం ఎప్పుడూ వుంటుంది. పతంజలి శాస్త్రిగారిది అలాంటి సాహిత్యం . చేదైన జీవితమూ, తేనైన హృదయమూ ఆయన సాహిత్యంలో ప్రధాన లక్షణంగా వుంటాయి. ఇందులోని ప్రతి కథ మూలాల్లోనూ అదే కనిపిస్తుంది. –
                     రచయిత, సమాజమూ, రచనా కలిసి ఒక త్రిభుజాకార కటకం అవుతుంది. అప్పుడందులోంచి అసలు రంగులు ఏడూ కంటికి కనిపిస్తాయి.
                     ఆయన నా వలె బండవాడు కాదు, నా కంటే పెద్ద పతంజలికి మొహమాటం, వినయం, ఓర్పు, సహనం చాలా ఎక్కువ. నాలోని దుర్లక్షణాలు అంతగా లేక, నాలోని లేశమాత్రపు మంచి లక్షణాలు పుష్కలంగా వున్నందువల్ల కూడా ఆయన పెద్ద పతంజలి. పెద్దవారికి చిన్నవారు నమస్కరించాలి కాబట్టి ఆ పని చేస్తున్నాను.
                                                                                                                                        చిన్న పతంజలి                                                                                                                                              కె.ఎన్.వై. పతంజలి
    300.00
    Add to cart
  • Sahitya Parisodhana Sutralu

    0
    1. సాహిత్య పరిశోధన
    1.01. పరిశోధన – శబ్దచర్చ, నిర్వచనం :
    ‘రీసెర్చ్’ అనే ఇంగ్లీషు మాట ‘రిసెర్చ్’ అని కూడా వ్యవహారంలో వుంది. మొదటిరకం వ్యవహారానికి పునః పరిశోధన పునరన్వేషణ అని అర్థం. ఇది ప్రాచీనాంగ్లంలో వ్యవ హారంలో ఉండేది. రెండోరకం వ్యవహారానికి జాగ్రత్తగా వెతకటం, లోతుగా అన్వేషించడం అని అర్థం. ఇది వర్తమానాంగ్లంలో వ్యవహరించబడుతున్నది. “నిర్దిష్టమైన విషయం గురించి కాని వ్యక్తి కోసంగాని దగ్గరగా, జాగ్రత్తగా) శోధించడం పరిశోధన,” “కొత్త సత్యాలను కనుగొనడానికి గాని, మరింత సమాచారాన్ని పొందడానికి గాని చేసే అన్వేషణే పరిశోధన” అని నిఘంటువులు చెబుతున్నాయి. ఈ రెండర్థాలూ కలిసి పరిశోధన అంటే ఏమిటో కొంతవరకు వివరించగలుగుతున్నాయి. ఏమీ తెలియని దానిని గురించి కొత్తగా చెప్పడం, ఇదివరకే కొంత తెలిసిన దానిని గురించి మరికొంత చెప్పడం, అలా చెప్పడానికి ఎన్నుకున్న అంశాన్ని లోతుగా పరిశీలించడం పరిశోధన అవుతుందని పైన పేర్కొన్న రెండర్థాలూ కలిసి స్పష్టం చేస్తున్నాయి. మన ప్రాచీన కావ్యాల్లోనూ, సంస్కృత గ్రంథాల్లోనూ శోధన, విశోధన అనే పదాలు వెతకడం, సరిచూసుకోవడం అనే అర్థాల్లో ప్రయోగింప బడినాయి. 3.
    “నూతన సిద్ధాంతాన్ని నిర్మించేది లేక కళాసృష్టికి దోహదపడేది అయిన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సరిదిద్దుకోడానికి, నిగ్గు తేల్చుకోడానికి, సాధారణీకరించడానికి, దొరికిన అంశాలను, భావనలను, సంకేతాలను వినియోగించుకోవడమే పరిశోధన” అని సామాజిక శాస్త్రాల విజ్ఞాన సర్వస్వం పేర్కొంది.. “జ్ఞానాన్వేషణకు, జ్ఞానాభివృద్ధికి, జ్ఞాన పరిశీలనకు చేసే ప్రయత్నం పరిశోధన.” ఇది “నిరంతరం సత్యాన్వేషణ చేస్తూ……………
    100.00
    Add to cart
  • Soonyam

    0

    పంజరంలో చువ్వమీద కూర్చుని, నింపాదిగా ధాన్యం ముక్కన కరుచుకుంటున్న పక్షితో “ఎగిరిపో! నీకు స్వేచ్ఛనిస్తున్నాను” అన్నాడట ఒక యువకుడు. “ఎగిరిపోవాలనే ఉంది. ఆకాశంలో పట్టుకోవడానికి చువ్వలుంటాయా?” అని అడిగిందట పక్షి. 83లో అదీ పరిస్థితి. ఆకలికన్నా పెద్ద భయం. రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లతో సహా, ఉస్మాన్ గంజ్ లో బస్తాలెత్తే కూలీలతో సహా జేబుదొంగలు, ఇతర పెట్టి క్రిమినల్స్ సహా అందరూ నా ప్రతిరూపాలే. – ముక్తవరం పార్థసారథి తనకు విలువలున్నాయంటే అది ధిక్కారంలాగా కనిపిస్తుంది. తనకూ వాళ్ళకూ మధ్య యింత ఎడం ఎందుకు? ఈ నిత్య జీవితపు రొచ్చులో ఎవరూ తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోయినా రాసేటప్పటి తన నిజాయితీనయినా నమ్ముతారా? ఈ వూహలూ, ఈ అనుభవం మరపుతెరల మరుగున మాయం కాకముందే – రొటీన్ జీవితపు అడుగున పడిపోకముందే అక్షరరూపంలో వ్యక్తమయ్యే నిజాయితీయే సాహిత్యం. అటువంటి సాహిత్యం అది శూన్యంకాదు – జీవితం. అర్థవంతమైన జీవితం. – – వరవరరావు

    275.00
    Add to cart
  • Unnava Lakshminarayanagari Malapalli Oka Paramarsha

    0

    ప్రవేశిక

    బహుముఖమైన మానవ జీవిత చిత్రణకు అనువైన ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ ‘నవల’. జీవితాన్ని సహజంగా చిత్రించి, వ్యాఖ్యానించటమేగాక, అందలి సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని గూడా నవల చూపగలుగుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సమాజంలోనూ వస్తున్న పరిణామాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ, కొత్త కొత్త శిల్ప ధోరణుల్ని సంతరించుకుంటూ, ‘నవల’ నానాటికీ ఎదుగుతోంది. ఇట్లా ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నది కాబట్టే ‘నవల’ ఇతర సాహిత్య ప్రక్రియల కంటే అధికంగా ఆదరింపబడుతోంది.

    తెలుగు నవలకు నూరేళ్లు దాటాయి. ఈ నూరేళ్ల పైచిలుకు కాలంలో వేల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. వీటిలో “యివీ మా తెలుగు నవలలు” అని తెలుగు జాతి చెప్పుకోదగ్గ స్థాయిలో గల ఉత్తమ నవలలు కొన్ని ఉన్నాయి. దీనిలో “మాలపల్లి, ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు..

    తెలుగు నవలా సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించుకొన్న ‘మాలపల్లి” పరామర్శకు “మాలపల్లి” రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి జీవిత విశేషాలు, ఆనాటి మాలపల్లి ప్రచురణ, ఆదరణలకు సంబంధించిన విశేషాలు తెలిసి కోవడం అవసరం.

    ఉన్నవ జీవిత విశేషాలు :

    ‘మాలపల్లి’ నవలా రచయిత, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యధులు, ఆంద్రోద్యమ సూత్రధారుల్లో ఒకరూ, శారదానికేతన సంస్థాపకులూ అయిన ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు గుంటూరు జిల్లా వేములూరు పాడులో 1877 డిసెంబరు 4న జన్మించారు. (ఈశ్వర నామ సంవత్సర కార్తీక బహుళ 30, ప్రక్క గ్రామమైన ‘అమినాబాదు’లో ప్రాథమిక విద్య అభ్యసించిన అనంతరం, గుంటూరు ఎ.ఇ.యల్.యమ్. కళాశాలలో యఫ్.ఎ. వరకు చదువుకొన్నారు. ఉపాధ్యాయుడుగా,…………..

    200.00
    Add to cart
  • కరుణశ్రీ సాహిత్యం 5

    0

    ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.

    200.00
    Add to cart
  • కరుణశ్రీ సాహిత్యం 2

    0

    ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.

    225.00
    Add to cart
  • కరుణశ్రీ సాహిత్యం 1

    0

    ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.

    225.00
    Add to cart
  • Mahaa Prasthanam

    0
    100.00
    Add to cart
  • Nuvvellipoyaka

    0

    “బ్రేకప్ ఒక కెథార్సిస్. ఇది నిలిచే బంధం కాదేమో అన్న ఆలోచనతో మొదలై, మేము విడిపోయాము అన్న ప్రకటన దాకా పూర్తి స్పృహతోతీసుకోవాల్సిన నిర్ణయాలు వుంటాయి. వాటికి నిందలు, కొట్లాటలు, బాధలు, ఏడుపులు,

    జ్ఞాపకాలు ఇవన్నీ అడ్డం పడతాయి. ఒకరు తోడుగా వుంటారన్న నమ్మకం నుంచి నాకు నేనే తోడు అన్న ధైర్యం దాకా సాగే ప్రయాణం ఇది.ఇదంతా ఒక మనిషిని ప్రక్షాళన చేస్తుంది.ఫీనిక్స్ పక్షిలా మళ్లీ బతికిస్తుంది.” |

                                                               this is how it ends

    ఝాన్సీ పాపుదేశి • నాగేంద్ర కాశి .వి. మల్లికార్జున్ • ఉషాజ్యోతి బంధం – కడలి సత్యనారము మూడి • వెంకట్ ఇద్దారెడ్డి • మానస ఎండ్లూరి – రిషి శ్రీనివాస • అరుణ పప్పు • మహి బెజవ

    250.00
    Add to cart
  • Untitled

    0

    ఒక రచయితగా సాటి రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా చూస్తుంటాను. ఒక పబ్లిషర్‌గా కొత్త రచయితలు ఎవరున్నారా అని అన్వేషిస్తూనే ఉంటాను. రచయితగా స్వరూప్ వాక్యం చదివి ఈర్ష్య కలిగింది. తెలుగులో కన్సిస్టెంట్ గా ఇంతమంచి వాక్యం రాసే రచయితను నేనైతే ఇంతవరకూ చూడలేదు. ఒక పబ్లిషర్‌గా స్వరూప్ అనే రచయితను కనుక్కోవడం ఒక యురేకా మొమెంట్. స్వరూప్ ఫేస్ బుక్ లో రాసిన మ్యూజింగ్స్ ని పబ్లిష్ చేయడం ఆన్వీక్షికి ప్రచురణాలయానికి ఒక గర్వకారణం. స్వరూప్ రాతలు చదువుతుంటే అతను ఏమేం పుస్తకాలు చదువుతుంటాడో అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్ట్ రాసే ముందు అతనేం తింటాడో, తాగుతాడో అని క్యూరియస్ గా ఉంటుంది. అసలు అతను జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే కళ్ళని కొన్ని రోజులు అద్దెకు తీసుకోవాలనిపిస్తుంది. స్వరూప్ మ్యూజింగ్స్ చదవడమంటే తెలుగు భాషను కొత్తగా డిస్కవర్ చేసినట్టుంటుంది. ఎప్పుడైనా కథలో ఎక్కడో ఒక చోట ఒక మంచి అబ్జర్వేషన్ ని రాసి శభాష్ అని భుజం తట్టుకుంటుంటాం. కానీ స్వరూప్ ప్రతీవాక్యం ఒక వండరలా తోస్తుంది.

    వెంకట్ శిద్దారెడ్డి                                                                                                                                       రచయిత, సినీ దర్శకులు

    185.00
    Add to cart
  • Olga Nunchi Gangaku

    0

    మనిషి నేడు ఉన్న స్థితిలో ప్రారంభం నుంచీ లేడు. ఈ స్థితికి రావడానికి ఎన్నో గట్టి పోరాటాలు చెయ్యవలసి వచ్చింది. “మానవ సమాజం” అన్న పుస్తకంలో నేను మానవ సమాజ వికాసాన్ని గురించి సిద్ధాంతపరమైన వివేచన చేశాను. దాన్నే సరళంగా చెప్పొచ్చు. ఆ సరళ చిత్రణ వల్ల మానవ సమాజం ఎలా వికాసం చెందిందో అర్థం చేసుకోవడం తేలిక అవుతుందన్న అభిప్రాయం కలిగింది. దాంతో “వోల్గా నుంచి గంగకు” రాశాను. ఇందులో నేను మనదేశపు పాఠకుల సౌలభ్యం కోసం ఇండోయూరోపియన్ జాతిని తీసుకున్నాను.

                      వికాస దృష్ట్యా ఈజిప్టు, సురియానీ లేదా సింధు జాతులు ఇండోయూరోపియను జాతి కన్నా వేల  సంవత్సరాలు ముందు ఉన్నాయి. కాని వాటిని తీసుకున్నట్లయితే రచయితకీ, పాఠకులకి కూడా ఇబ్బందులు ఎక్కువవుతాయి. ప్రతి కాలంలోని సమాజాన్నీ నేను ప్రామాణికంగా చిత్రించడానికి ప్రయత్నించాను. కాని మొదటి ప్రయత్నంలో తప్పులు దొర్లడం సహజం. ఇంకా ప్రామాణికంగా శుద్ధంగా చిత్రించడానికి ముందు ముందు రాబోయే రచయితలకి నా ప్రయత్నం దోహదపడతాయి అనుకుంటాను.

                                                             – రాహుల్ సాంకృత్యాయన్

    300.00
    Add to cart