• -3%

    BATUKU SEDYAM

    0
    Original price was: ₹330.00.Current price is: ₹320.00.
    Add to cart
  • -5%

    Kaala Padalu

    0
    Original price was: ₹220.00.Current price is: ₹210.00.
    Add to cart
  • Yodhudu Ambedkar

    0
    150.00
    Add to cart
  • Adolfh Hitler

    0
    మొదటి ప్రపంచంలో ఒక సామాన్య పౌరునిగా ఆస్ట్రియాలో జన్మించి జర్మనీ తరపున పోరాడి అందులో జర్మనీ ఓడిపోగా నానాజాతి సమితి ఇతర జర్మన్ వ్యతిరేక ఐరోపాదేశాలూ జర్మనీని నిర్వీర్య చేయగా హిట్లర్ 40 మంది వున్న ‘నాజీ’ పార్టీలో చేరి జర్మన్ లలోని అసంతృప్తిని తనకనుకూలంగా మలచుకొని జర్మనీని చాన్సలర్ తర్వాత అధ్యక్షుడు; సర్వసేనాధిపతి అయి రెండవ ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువై అటు పశ్చిమ ఐరోపాలో బ్రిటన్ వరకూ తూర్పున రష్యావరకూ జర్మన్ సామ్రాజ్యాన్ని విస్తరించి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
              కాని యుద్ధపుచివరి దశలో ప్రపంచాన్నే జయించాదలచి తప్పుడు ఎత్తుగడలతో రష్యాలో ఓటమిచెంది అటునుండి బ్రిటన్ కు అమెరికా సహాయపడగా తను జయించిన రాజ్యాలు పోగొట్టుకోవడమేకాక జర్మనీని కూడా సర్వనాశనం వైపు నడిపి చివరికి పరాభావంతో ఆత్మాహత్య చేసుకున్న మొండివాడేకాక ఆర్యతెగ అందునా జర్మన్ లే అధికులని చాటదలచి యుద్దాలతో జర్మనీని, ప్రపంచాన్ని సర్వనాశనం చేసిన అహంకారి. మేధావి క్రూరుడైతే ఏమి జరుగుతుందో హిట్లర్ జీవిత చరిత్ర తెలియజేస్తుంది. అది తెలుసుకోవడానికాక రెండవ ప్రపంచ యుద్ధ కారణాలు, యుద్ధ ప్రభావాలు తెలుసుకోవడానికి ఈ రచన చదవండి.
                                                                                                     – స్వర్ణ
    175.00
    Add to cart
  • Ajnatha Yodhudu

    0
    అజ్ఞాత యోధుడు
    నాకు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చెవులు బ్రద్దలయ్యేలాంటి విస్ఫోటనం వల్ల ఇల్లు ముక్కలు చెక్కలు అవుతుందని అనిపించింది. సూర్యోదయకాలపు గుచ్చుకునే వెలుతురుకు నా కళ్ళు సంకోచించాయి. జనాల కేకలు, ప్రేల్చుతున్న తూటాల శబ్దాలతో నా చెవులు నిండిపోయాయి. నేను చాలా ఆలస్యంగా, తెల్లవారటానికి మునుపు పడుకున్నాను. బాగా అలసిపోయాను. ఆ కారణంగా నిద్ర నుంచి లేవటానికి నాకు చాలా కష్టమైంది.
    ఆస్ట్రోవికా కొండ నుంచి దూరపు ప్రయాణాన్ని ముగించి నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. అక్కడ దాయాదులకు సంబంధించిన ఒక పొట్లాటనో, అపరాధమో జరగబోతోంది. ఇరువైపులవారిని రాజీ చేయటానికి మా పార్టీ,…………….
    200.00
    Add to cart
  • Akbar- The Great

    0
    ఇంతకముందు పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తించే మహాసామ్రాజ్య స్థాపకులైన అలెగ్జాండర్, జూలియస్ సీజర్, చెంఘిజ్ ఖాన్, ఏకవ్యక్తి పాలకులైన నెపోలియన్, హిట్లర్ జీవిత చరిత్రలు; వారి బలాలు బలహీనతలు గురించి సంగ్రహంగా రాశాను. అయితే భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులలో అంతటి గొప్పవారు లేరా అంటే అశోకుడు ఒకడు కాగా మధ్య యుగాలలో ఆసియావాసి అక్బర్ గొప్ప పాలకుల్లో మరొకడు.ఇతడు చెంఘిజ్ ఖాన్ వారసుడైన బాబర్ మనుమడు. ఎందరో విదేశీయులు భారతదేశాన్ని దోచుకుని వెళ్ళిపోగా బాబర్ మాత్రం భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించగా అతడి మనుమడు, హుమాయూన్ కుమారుడైన అక్బర్ దక్షిణ భారతంలోని దక్కను ప్రాంతం వరకూ జయించి మొగల సామ్రాజ్యాన్ని సుస్థిరపరచాడు. 
                 ఇస్లాం మతంలో జన్మించిన ఈ చదువురాని పండితుడు అన్ని మత నాయకుల సమావేశాలు జరిపి తనూ ఆ చర్చల్లో పాల్గొని ప్రతి మతంలో మంచి – చెడు ఉన్నాయని; ఏది హేతుబద్ధమో అదే మంచి అని దీన్ – ఇల్లాహీ మతాన్ని ప్రతిపాదించాడు. కాని దాన్ని తన కొలువుకే పరిమితం చేశాడు. బలవంతపు మత మార్పిడులను నిరసించి మతసహనంతో కూడిన పాలన చేశాడు. తన కొలువులో ఎందరో హిందువులకు ప్రాధాన్యత నిచ్చి భారతదేశంలో నూతన సంస్కరణలకు పాలనా విధానానికి దోహదపడిన మధ్యయుగాల మహాచక్రవర్తి. అంతేకాక మొగల చక్రవర్తులలో అతి తక్కువ కాలం పాలించి భారతీయ ప్రజల మన్ననలు పొందినవాడు. అతడి జీవిత విశేషాలు, ఆసక్తికర ఘటనల సమాహారం ఈ రచన.
                                        – స్వర్ణ
    90.00
    Add to cart
  • Allam Seshagiri Kathalu

    0
       శ్రీపురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు “నీలి” కథతో దేశంలోనూ శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు “గాలివాన” కథతో ఇతర దేశాల్లోనూ తెలుగు కథకి మంచి పేరు సంపాదించిన తరవాత తెలుగు సాహిత్యంలో కథానిక ముందడుగు వేసిందని నేను తలుస్తున్నాను. కొత్త కొత్త రచయితలు కొత్త కొత్త దార్లంట వెళ్ళి, కొత్త సంగతులు కనుక్కున్నారు. అంతే కాదు చాలా మందికి తెలియని పాత సంగతుల్ని కూడా బైటికి తీసుకు వచ్పేరు. తెలుగు కథ విస్తరించింది. మధ్య తరగతి వారి గురించి కథలు వస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారి గురించి కూడా కథలు వస్తూనే వున్నాయి. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి తెలుగు కథ ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే, జీవితంలో ముఖ్యమైన అధర్మం ఒకటుంది. అదేమిటంటే ఒక జీవిని మరొక జీవి చంపుకు తినడం. చంపి తినడం అనేది జీవితంలో ముఖ్య విశేషం. ఈ లోకాన్ని భగవంతుడలా సృష్టించేడు కాబట్టి, ఒకరు మరొకర్ని చంపుకు తినడంలో తప్పు లేదని వాదించేవారిని కదిలించి చూస్తే చాలా మంది ఉంటారు. –
                                    ఇతర ప్రాణుల్ని పూర్వపు మానవులు వేటాడి చంపి తినే వారు. ఇప్పుడు వాటిని పెంచి చంపి తింటున్నాం . తేడా పెద్దగా ఏమీ లేదు. అయితే ఇతర ప్రాణుల్ని మనం చంపి తింటున్నప్పటికీ కూడా మనల్ని మనం చంపుకోకూడదు తినుకోకూడదు అనే ఆలోచనలోకి మానవులం కొంత వరకూ వచ్చేమని చెప్పుకోవచ్చును. కాని అందులో కూడా నిజాయితీ లేదు. బలహీనుల్ని బలవంతులు చంపుతూనే ఉన్నారు. చంపకపోతే, దోచుకుంటూనే ఉన్నారు.
    275.00
    Add to cart
  • Dakkali Jaambapuraanam – Jayadeer ThirumalaRao – (Telugu)

    0
    భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ వారి మధ్య నెలకొన్న సాంస్కృతిక అగాథాల్ని పూడ్చి ఐక్యత సాధించడానికీ మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
    280.00
    Add to cart