• The Fire

    0

    జీవిత దశలను కాదు నీ జీవిత దిశని మార్చుకుని ఆపై ఇతరుల జీవితాలను మార్చే దిశగా మారటానికి తోడ్పడేది. ఈ “ది ఫైర్”. నీ నిరర్ధక ఆలోచనలకు మంటను పెడుతుందీ ఫైర్. అందకారమనే అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞానమనే వెలుతురు వైపు దారి చూపే కాగడా ఈ పుస్తకం. మనిషి బ్రతుకు బాటలో చీకటిని రూపుమాపుతూ దారి చూపాలని ఈ రచయిత చేసిన ప్రయత్నం ఎంతో వెలుగు ప్రదాయకం.

     

    ప్రకృతిలో రాత్రి అనే చీకటి, పగలు అనే వెలుగు ఉంటాయి. రెండిటిని మనిషి అస్వాదిస్తాడు. కానీ అదే జీవితంలో చీకటి(భాద) కన్నా వెలుగు (ఆనందం) వైపే పయనించాలని ఈ రచయిత చెప్పిన తీరు అమోఘం. జీవితాన్ని మీరు మీకు కావలసిన రీతిలో రూపు దిద్దుకోండి. ఆస్వాదించండి, ఆనందించండి అని చెప్పటం కాదు. మనతో చేయిస్తుందీ పుస్తకం. అంతగా రగల్చగలిగే శక్తీ ఉంది కనుకనే ఈ పుస్తకం పేరు “ది ఫైర్”.

    -యండమూరి వీరేంద్రనాద్

    250.00
    Add to cart
  • Bhumi Nunchi Pluto Daka. . .

    0
      “భూమి నుంచి ప్లూటో దాకా” అనే ఈ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన సైన్స్ ఫిక్షన్. స్పేస్ ఓ పేరా నవలలత్రయంలో  మూడవది. ఆఖరిది, స్పేస్ ఒపేరా అంటే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యంలోని ఒక ఉపవిభాగం. భవిష్యత్తులో సాగె కథనం . రాబోయే వైజ్ఞానిక ప్రగతి , రెండు సామ్రాజ్యాలు అధిపత్యంకోసం  చేసే యుద్దాలు, కొంత రొమాన్స్, అతింద్రియ  శక్తులు కలగలుపుతూ వుండే కథనం . ఇవి సాధారణంగా స్పేస్  ఓపెరా లక్షణాలు. చిత్తుర్వు మధు మొదటగా ఆంగ్లంలో ఈ నవలలత్రాయం  రాశారు . War for Mars: A story of the Fourth Millennium. Blue Green: Return To Earth, Dark Outposts: Final revenge అనే ఈ నవలలు, అమెజాన్ ద్వారా, సంపర్క్ పబ్లిషర్స్ కలకత్తా వారిద్వారా ఇంగ్లీషులోకి నవలలుగా  ప్రచురించబడ్డాయి.
    175.00
    Add to cart
  • Neeli Akupaccha

    0

    డాక్టర్ చిత్తర్వు మధు వృత్తిరీత్యా వైద్యులు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాదులో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. అప్పటి నుంచి కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు ఐసిసియు, బై బై పొలోనియా, ఎపిడెమిక్ నవలలు ఒక నవలాత్రయంగా రాశారు. స్పేస్ ఓపెరా అనబడే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో ‘కుజుడి కోసం’ అనే నవల రచన మాసపత్రికలో సీరియల్ గా ప్రచురితం అయింది. దానికి కొనసాగింపు ‘నీలి ఆకుపచ్చ’ కనిగె జాలపత్రికలో సీరియల్ గా వచ్చింది.

    గ్రహాంతర ప్రయాణాలు, సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు, ప్రేమలు భవిష్యత్ లో జరిగినట్లు కథనం స్పేస్ ఒపేరా లక్షణాలు. ఈ రెండు నవలలు ఆంగ్లంలో మొదటగా ప్రచురించబడ్డాయి. వీటిని రచయిత స్వంతంగా తెలుగులోకి అనువాదం చేశారు. భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో సాగే కథనం జరగబోయే శాస్త్రీయ పురోగతిని వివరిస్తూ హనీ ఆమ్రపాలి అనే హీరో భూమికి కుజుడి నుంచి తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. కుజుడి వర్ణం అరుణం అయితే ప్రాణవాయువు పాత్రహరితం చూస్తే కన్పించే రంగులు అవే. ఉత్కంఠ కలిగించే ఈ నవల మిమ్మల్ని మరో భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది.

    140.00
    Add to cart
  • Vaktha (Telugu Edition)

    0

    మీరూ కావచ్చు ‘వక్త’
    వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్‌ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.

    200.00
    Add to cart
  • Manasikamgaa Balavanthulu Cheyani 13 Panulu

    0
     నా ఇరవై మూడవ యేట, మా తల్లి మెదడువాపుతో హఠాత్తుగా మరణించింది. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా పనిచేసుకుంటూ, ఈ భూమి మీదా చివరి నిమిషం వరకు జీవితాన్ని ప్రేమించిన మహిళా. నిజానికి, మరణించిన ముందురోజు రాత్రి కూడా ఆమెను చూశాను. హైస్కూల్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను చూడడానికి వెళ్ళిన ఆడిటోరియంలో కలుసుకున్నాం. ఆమె ఎప్పటిలాగే నవ్వుతు, మాట్లాడుతూ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ కనిపించింది. అయితే, మరో ఇరవై నాలుగుగంటల్లో వెళ్ళిపోయింది. మా తల్లిని కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఆమె సలహాలు, నవ్వులు, ప్రేమ లేకుండా మిగిలిన జీవితమంతా నెట్ట్టుకు రావాలని ఊహించలేక పోయాను. ఆ సమయంలో నేను ఒక కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సెంటర్లో థెరపిస్టుగా పనిచేస్తున్నాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
                                                                                            -ఏమి మౌరీన్.
                                                                                            -ఏ.ఆర్.బాలసుబ్రహ్మణ్యం.
    225.00
    Add to cart
  • Manasu Gathine Marchina ‘Freud’

    0
       మానవుల శరీరాలకే కాక ఆత్మలకూ రోగాలు వస్తాయి. శారీరక రోగ లక్షణాలకు చికిత్స చేసే వైద్యుడు శరీరంలోని ఒక భాగానికే వైద్యం చేస్తున్నాడు. మానవుడంటే శరీరం ఒక్కటే కాదు, సహజాతాల, అంతరాత్మల రణరంగం. ప్రచోదనలను అణచివేసే యుద్ధ భూమి. యుద్ధం అనివార్యం. బాహ్య ప్రపంచంలోని సంఘధర్మాలకు, స్వీయ అంతరంగ ప్రపంచంలోని ఇచ్చ, సంవేదనలకు మధ్య మానవుడు సాహసోపేతమైన సేనాని కావాలి, ధీరుడైన న్యాయ నిర్ణేత కావాలి. అలా కాక భీరువై పలాయనం చిత్తగిస్తే రుగ్మతకు గురవుతాడు.
                 ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా పాఠకుడు, శైశవం, బాల్యంలో, తన మనోవల్మీకంలోకి ప్రవేశించిన విష సర్పాల జాడలను, తన మస్తిష్కంలోని ముళ్ళకంపలను తెలుసుకోగలుగుతాడు. ఇప్పటి తన వైయక్తిక వక్రతలు, లైంగిక అవసవ్యతలను అంచనా వేసుకోగలుగుతాడు.
    175.00
    Add to cart
  • Okkadu- ఒక్కడు By Dr B V Pattabhiram

    0
    సాఫల్యవైఫల్యాలకు అతీతంగా జీవించగలమనే మనోబలాన్ని మన యువతరం అలవర్చుకోవాలి. సాఫల్యవైఫల్యాలు నాణానికి రెండు ప్రక్కలు మాత్రమే. జీవితం వాటికి అతీతమైంది. జీవితం మనది, మనం నిర్మించుకునేది, మనం తీర్చిదిద్దుకునేది. ఆర్థికపరమైన, సామాజికపరమైన అనేక అడ్డంకులు రావచ్చుగాక, వాటిని అధిగమిస్తూ భవిష్యత్తువైపు దృష్టి సారించగల స్థైర్యం, నైపుణ్యం మనం అలవర్చుకోగలగాలి. ఆ దృక్పథం అందరిలో కలగాలి, అందరికీ కలగాలి. అదీ ఈ పుస్తకం తాలూకు ఉద్దేశం.
    130.00
    Add to cart
  • సజీవంగా ఉండేందుకు కారణాలు- Reasons to Stay Alive in Telugu

    0

    మనం జీవించి వున్నామా.. సజీవంగా ఉన్నామా ?
    మనలో వున్న అనేక భయాలు, ఆందోళనలూ తొలగించుకునే మార్గాలేవిటి?
    భయం మనల్ని నీడలా వెంటాడుతుంటే దాని నుంచి ఎలా తప్పించుకుని ధీరులుగా నిలబడాలి?
    మన చుట్టూ వున్న అనేక విషయాలలో మనల్ని భయపెట్టే అంశాలేమిటి ?
    భయాన్నీ, బిడియాన్నీ, ఆందోళనలనూ వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి ?
    ఇలాంటి విషయాలన్నీ చెబుతూ మనలోని ధైర్యాన్ని పైకి లేపే పుస్తకం.

    299.00
    Add to cart
  • 80/20 Sutram

    0
    80/20 ర్యాప్ సాంగ్
    మీకు తెలుసా? 80/20తో ర్యాప్ సాంగ్ ఉన్న సంగతి. అది అచ్చు వ్యాట్ మో ‘జీ జాక్సన్’ తరహాలో సాగుతుంది. పాప్ సాంగ్ మాదిరిగా మూడు నిముషాల పాటు సాగే ఈ పాటను ఆసక్తిగల వారు www. richardkoch.net లో వినవచ్చు. ఆ పాటలో ఉన్న అంశాన్ని అటూ ఇటూ కొన్ని మార్పులు చేసి ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని దిగువ అందచేస్తున్నాను.
    రిచర్డ్ కోచ్ ఒక వ్యాపారి, అతను ఒక జీవన సత్యాన్ని కనుగొన్నాడు. అది ఒక బృహత్తర ప్రణాళిక.
    దాని గురించి పుస్తకం రాశారు. అది సూపర్ హిట్టయ్యింది.

    అది నిశ్చలమైంది. న్యాయబద్ధమైంది.

    80/20 దాని పేరు
    అది నేర్పే పాఠాలు మీకు ప్రాణశక్తిని అందిస్తాయి.

    ప్రశాంతంగా కూర్చుని ఈ గేయాన్ని వినండి.

    పూర్తయ్యేలోపు మీ ఆలోచనలకు కొత్త వెలుగొస్తుంది.
    80/20 సూత్రం విజయానికి మూలం
    80/20 సూత్రం తక్కువతో ఏదో సాధించటం నేర్పే మార్గం

    80/20 సూత్రం విజయానికి మూలం…………..

    399.00
    Add to cart
  • Ninnu Neevu Chakka Didhuko

    0
    పసిఫిక్ సముద్రానికి ఓ వంద గజాల దూరంలో కాలిఫోర్నియాలోని కారానా బీచ్ కి దగ్గర్లో నీల్ ప్రత్యేక శిక్షణా తరగతులు నేర్పే సైనిక శిబిరాలున్నాయి. ఓ మూడంతస్తుల భవనం. ఊరూ పేరు లేని భవనం అది. ఆ భవనంలో ఎయిర్ కండిషన్ సదుపాయం లేదు; రాత్రి పూట, కిటికీలు తెరుచుకుని చూస్తుంటే అలల సవ్వడి విన్పిస్తూ ఉంటుంది. కెరటాలు వచ్చి ఇసుకను తాకిన చప్పుడు కూడా అలవోకగా చెవులకు సోకుతూ ఉంటుంది.
    ఆ సైనిక శిబిరంలోని గదులన్నీ మామూలుగా ఉండేవి. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేని ప్రదేశం అది. ఆఫీసర్ గదులు కూడా అవే. నేను మరో ముగ్గురు అధికారులతో కలిసి ఉండేవాణ్ణి. నాలుగు పడకలుండేవి. యూనిఫాంలు వేళ్లాడదీయటానికి ఓ చిలక్కొయ్య ఉండేది. ఇంకేం లేవు. ఆ రోజుల్లో ఉదయాన్నే నేను నా నేవీ రాక్ లోంచి బయటకొచ్చి నా పక్క సరిచేసుకునే ప్రయత్నంలో పడేవాణ్ణి. రోజు ప్రారంభించటానికి అదే నా మొదటి పని. నా దిన చర్య దానితోనే మొదలు అయ్యేది. రోజంతా. యూనిఫామ్ తనిఖీ చేయటం, ఎక్కువ సేపు ఈత ఈదటంలో గడపటం, పరుగులు తియ్యటం, కొన్ని కొన్ని గతి నిరోధాల మీద నుంచి దూకటం, సీల్ శిక్షణాధికారుల దగ్గర్నుంచి ఒకటే వేధింపులు. వీటితో రోజంతా గడిచేది.
    మా తరగతి నాయకుడి స్వరం పెద్దగా వినపడేది. “అందరూ సావధానంగా వినండి..” ఆయన పేరు – లెఫ్టినెంట్ జూనియర్ గ్రేడ్……………
    199.00
    Add to cart
  • Zero 2 Hero

    0
    అసాధారణ మేధస్సు, విభిన్న వ్యక్తిత్వం గల అరుదైన వ్యక్తి తారసపడితే,
    3 ముందుగా అతను చదివే పుస్తకాలు గురించి వాకబు చేయండి.
    – రాల్ఫ్ వాల్డో ఎమర్సన్
    రామనాథన్ శ్రీరామ్
    క్రాస్వర్డ్ బుక్ స్టోర్స్, ప్రథమ్ బుక్స్
    “ఒరే నువ్వు ఇంజనీర్ కావాలన్నది నా కల.. ఆ సాహిత్య పుస్తకాలు పక్కన పడేసి… పాఠ్య పుస్తకాలు చదువు..” అంటూ పదే పదే మందలించేవాడు శ్రీరామ్ తండ్రి. ‘ఇంజనీరింగ్ చేయకపోతే జీవితం వ్యర్థమైనట్లేనా? ఏంటి నాన్నా? పదేపదే చెబుతుంటావు. నా ఇష్టానికి వదిలేయి’ అంటూ ఎదురు ప్రశ్నించేవాడు శ్రీరామ్. తన జీవితాన్ని తనే రూపుదిద్దుకోవాలన్నది అతని ఆలోచన. చిన్నప్పటి నుంచి బ్రిటిష్ లైబ్రరీలో చదివిన పుస్తకాలు, ఆ సాహిత్య అభిరుచే ‘క్రాస్వర్డ్’ బుక్ర్ నెలకొల్పేందుకు ప్రేరణ ఇచ్చింది. తను చదవడమే కాదు… ఇతరులతో చదివించడమూ శ్రీరామ్ చేసిన గొప్ప వ్యాపారం…’ అక్షరం వీరికి వ్యాపారం మాత్రమే కాదు… ఆత్మసంతృప్తి……….
    276.00
    Add to cart