• Ayn Rand Philosophy

    0
    ఫిలాసఫీ; ఎవరికి అవసరం?
    (మార్చి 6, 1974 నాడు వెస్ట్ పాయింట్లో యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడెమీ వాళ్ళ గ్రాడ్యుయేటింగ్ క్లాసులో చేసిన ప్రసంగం)
    నేను ఫిక్షన్ రచయిత్రిని కాబట్టి ఒక చిన్న కథతో మొదలు పెడతాను. మీరొక అంతరిక్ష యాత్రికుడని అనుకోండి. మీరు ప్రయాణిస్తున్న అంతరిక్షనౌక అదుపు తప్పి వివరం తెలియని ఒకానొక గ్రహంమీద కూలిపోయిందనుకుందాం. తెలివి వచ్చాక, అంతగా దెబ్బలు తగల్లేదని గ్రహించారు మీరు. అప్పుడు మీ మనస్సులో మెదిలే మొదటి మూడు ప్రశ్నలు ఏమై ఉంటాయంటే, 1. నేనెక్కడున్నాను? 2. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? 3. నేను ఏం చెయ్యాలి?
    మీరు ఎరగని చెట్టూ చేమలూ ఉన్నాయక్కడ. పీల్చుకునేందుకు గాలి ఉంది. ఎండ, మీరెరిగిన ఎండకన్న లేతగానూ, చల్లగానూ ఉంది. ఆకాశం కేసి చూడబోయి ఆగిపోయారు. ఉన్నట్టుండి మీకొక ఆలోచన వచ్చింది. మనం చూడడం మానేస్తే 6 ‘భూమినుంచి చాలా దూరంలో ఉన్నాం, తిరిగి వెళ్ళడం అసాధ్యం’ అని తెలుసు కోవాల్సిన అవసరం ఉండదనుకుంటారు. తెలియనంత సేపూ ఇష్టం వచ్చినట్టు ఊహించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా అని. అప్పుడు మీకు మసకమసకగా, సంతోషదాయకంగా, కానీ ఒకరకమైన అపరాధభావనతో కూడిన, ఒక ఆశ కలుగుతుంది.
    మీ పనిముట్లను చూసుకుంటారు. అవి పాడయిపోయి ఉండొచ్చు. ఎంత చెడిపోయాయి అన్నది మీకు తెలియదు. ఆగిపోతారు. ఉన్నట్టుండి భయమేస్తుంది. ఈ పనిముట్లను ఏ మేరకు నమ్ముకోవచ్చు? ఇవి తప్పుదారి పట్టించవని నమ్మక మేమిటి? మరో ప్రపంచంలో ఇవి పనిచేస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? పనిముట్లు వదిలేస్తారు.
    ‘అవునూ! ఏమీ చెయ్యాలనిపించడం లేదేమిటి?’ అని ఆశ్చర్యపడతారు. ఎలాగో ఏదో జరిగితే బావుండునని ఎదురుచూడడం ఎంతో క్షేమం అనిపిస్తుంది. ఆ నౌకను కుదపకపోవడమే మేలనిపిస్తుంది. దూరంగా ఒకరకం జీవులేవో మీకేసి వస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు మనుషులవునో కాదో మీకు తెలియదు. కానీ వాళ్లు రెండు కాళ్ళజీవులే. ‘నేనేం చెయ్యాలో వాళ్లు చెబుతార్లే’ అని నిర్ధారించుకుంటారు………………
    250.00
    Add to cart
  • Okka Toota Chalu

    0
    150.00
    Add to cart
  • Chempadebba Philosophy- Naa Istam- 2.0

    0

      ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి” అని కార్ల్ మర్క్స్ చెప్పినట్టు… అయాన్ రాండ్ … ఫ్రెడరిక్ నిషే, ఆర్ధర్ షోపెన్ హోవర్ , నా విజయవాడ ఫ్రెండ్ , జేమ్స్ హాడ్లి ఛేజ్, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు , సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పిల్ బర్గ్, కె.బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైనా ప్రతివ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి,నేను తీసుకుని   , నావి చేసుకున్నవి నాలో ఒక భాగం. అయితే ఇంకోభాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం, ఐదేళ్ళు విజయవాడ  విధుల్లో వీరంగం చేయడం , నన్ను ఒక  సినిమా ఉన్మాది  చేసిన ప్రసాద్ మామయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా “నేను” నేనయ్యాను. నేను “నా” ల మిగిలాను.”నా ఇష్టం” వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను , బ్రతకబోతున్నాను.

    250.00
    Add to cart
  • Peka Mukkalu – పేక ముక్కలు

    0

    సృజనాత్మక సాహితీ సేచనతో భారతదేశ సాహితీ క్షేత్రాన్ని సంపద్వంతం చేసిన సాహితీవేత్తగా కిషన్‌చందర్‌ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. తెలుగులో వెలువడిన ఆయన రచనలు అనేకం పాఠకుల అశేష ఆదరాభిమానాల్ని చూరగొన్నాయి.

    కిషన్‌ చందర్‌ 1914 నవంబర్‌ 23న పంజాబ్‌లో జన్మించారు. ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి. పట్టా పుచ్చుకున్నారు. ప్రధానంగా ఆయన నవలా రచయిత. ఆయన నవలలు అనేకం భారతీయ భాషలతోపాటు ఇంగ్లీష్‌, రష్యన్‌, డేనిష్‌, పోలిష్‌, జర్మన్‌, హంగేరియన్‌, చైనా భాషలలోకి అనువదించబడ్డాయి.

    ఆయన రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలి, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికి మాటలతో రూపమివ్వటం – కిషన్‌ చందర్‌ ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. ”గాలిబ్‌ వారసుడు”గా సాహితీ లోక సమాదరణ పొందిన కిషన్‌ చందర్‌ 1977 మార్చి 8న కీర్తిశేషులయ్యారు.

    ఈ నవలకు పెట్టిన ”పేకముక్కలు” అన్న పేరు చాలా విధాలా సార్థకనామం. ఇందులో ఉన్న పాత్రలు పేకముక్కలు. ఇందులో రాజులూ, రాణీలూ, జాకీలూ, జోకర్లూ, పొడిముక్కలూ అందరూ ఉన్నారు. సినిమా ఒక కళా కాదు, ఒక వ్యాపారమూ కాదు – పేకాట, జూదం! కాని అది కొద్దిమందికే జూదం. మిగిలినవారిలో సుఖజీవనం కోసం వచ్చినవాళ్ళుంటారు. తమ ఆదర్శాలు సఫలం చేసుకోవటానికి వచ్చినవారుంటారు. బ్రతుకు తెరువులలో ఇది ఒకటనుకుని, పెద్ద ఆశలేమీ లేకుండా వచ్చినవారుంటారు. ఈ రకాలన్నీ ఈ నవలలో ఉన్నాయి.

    సినిమా జీవితం ఒక విలక్షణమైన జీవితం. మామూలు జీవితపు విలువలకిక్కడ చలామణీ లేదు. ఈ సంగతి తెలియగానే మామూలు జీవితపు విలువలను సునాయాసంగా విసర్జించేస్తారు కొందరు. మరి కొందరు వాటిని గాఢంగా అంటిపెట్టుకుంటారు. ఆ కారణంగా నలిగి హూనమైపోతారు. అంతులేని ఆశనూ, అగాధమైన నైరాశ్యాన్నీ రేకెత్తించగల విచిత్ర జీవితం సినిమా జీవితం.

    జీవితాన్ని వాస్తవంగా చిత్రించటమే ఒక విశేషం కాదు. డిటెక్కివు నవలల్లో కూడా వాస్తవ జీవితమే ఉన్నది. ఈ నవలలో సినిమాకారుల జీవితాన్ని ఉన్నదున్నట్టు చిత్రించటంలో సరిపుచ్చుకోక, రచయిత ఆ జీవితంలోని సత్యాలన్నిటినీ నగ్నంగా ప్రదర్శించారు. ఆ కారణంచేత ఇది ఉత్తమ రచన అనిపించుకుంటుంది. ఎప్పటికైనా సినిమా కళ ఉన్నతికి రావాలంటే, అందుకు జరగదగిన కృషిలో ఈ నవల ఒక భాగమవుతుందా అంటే, అవుతుందని నేను నమ్మకంగా చెప్పగలను. – కొడవటిగంటి కుటుంబరావు

    పేజీలు : 264

    220.00
    Add to cart
  • Vaaduka Telugu Padakosam

    0

    తెలుగు భాషా పద నిఘంటువులు చాలా వచ్చాయి. వాటిలో కావ్యభాషకు పదజాలమే ఎక్కువగా లభిస్తుంది. ప్రత్యేక నిఘంటువులద్వారా, పదకోశాలద్వారా – పరిభాషా పదాలకూ, ప్రత్యేక పదాలకూ, వృత్తి పదాలకూ, పదబంధాలకూ అర్థాలు కూడా లభిస్తాయి. ఇలాంటి వాటిలో నానార్థ పదకోశాలు, పర్యాయపద పదకోశాలు, మాండలిక నిఘంటువులు, మాండలిక వృత్తి పదకోశాలు, పత్రికాభాషా పదకోశాలు చేరతాయి. ఈ పదకోశం ఆధునిక ప్రమాణ రూపాలను మాత్రమే గ్రహించింది. అంతేకాదు ఇతర నిఘంటువులలో సులభంగా లభ్యంకాని పర్షో అరబిక్ పదాలు, ఆంగ్ల పదాలు కొన్ని ఇందులో లభిస్తాయి. సమాచార రంగంలో వ్యాప్తిలో వున్న మరికొన్ని పదాలను కూడా చేర్చాము. ఇది ఒక తొలి ప్రయత్నం మాత్రమే. ఇంకా ప్రసార సాధనాల్లో నలిగిన చాలా అన్య దేశ్యాలనూ, సృజనాత్మక భాషలో కనిపించే మరెన్నో మాండలిక పదాలనూ నిఘంటువులలో మనం చేర్చుకోవలసిన అవసరం ఎంతో వుంది.

              ఈ వాడుకతెలుగు పదకోశంలో దాదాపు 20,000 పదాలు ఉన్నాయి. తెలుగు భాషాభిమానుల సూచనలను అనుసరించి మలి ముద్రణలో ఈనాటి అవసరాలకు తగినట్లుగా మరిన్ని పదాలను ఈ కోశంలో చేర్చడానికి ప్రయత్నిస్తామని సవినయంగా మనవి. మా ఈ తొలి ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ….

    – ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

    200.00
    Add to cart
  • Cancer Code

    0

    కెనడా దేశస్తుడైన డా॥ ఫంగ్ కిడ్ని వైద్య నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్, ఫాస్టింగ్లపై ఆయన రాసిన పుస్తకాల                      ద్వారా సాంప్రదాయ వైద్యంపై

    గొప్ప తిరుగుబాటు చేశారు. జర్మనీకి చెందిన హెన్రిచ్ వార్నర్ (1888-1970) ఒక భౌతిక శాస్త్రవేత. ఆయన కణాలు శక్తిని ఎలా తయారు చేసుకుంటున్నాయన్న అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. జీవశాస్త్రానికి భౌతిక, రసాయన శాస్త్రాలను జోడించాడు. సాధారణ కణాలకు, కాన్సరు కణాలకు జీవక్రియలలో గల తేడాలను గుర్తించాడు.. జీవశాస్త్ర పరిణామ వాద కోణం నుండి ఈ సమస్యను పరిశోధించారు.
    అపుడు కాన్నరు మెట్లు మెట్లుగా ఎదగడం లేదని, పెరుగుదల, చొరబాటు, వ్యాప్తి వంటివి దశలవారీగా జరగడం లేదని అర్థమైంది. శరీరంలో కాన్సరు కొంతకాలం పాటు పెరిగాక మాత్రమే వ్యాప్తి చెందగలదన్న భావన తప్పు అని తేలింది. ఆరంభం నుండే వ్యాప్తి కూడా కాన్సరు లక్షణంగా గుర్తించారు.

    దశలవారీగా పెరుగుదల వుండి వుంటే కాన్సరుకు చికిత్స సులువయి ఉండేది. కాన్సరు వచ్చిన భాగాన్ని సర్జరీ చేసి తొలగిస్తే అది అక్కడికి నిలిచి ఉండాలి. కానీ కాన్సరు వచ్చినట్లు గుర్తించేనాటికే ఆ కణాలు ఇతర శరీర భాగాల్లోకి చేరుతున్నట్లు బయటపడింది.

    మమ్మోగ్రఫి పరీక్ష చేసే 10 మందిలో ఒకరికి మాత్రమే కాన్సరు పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. అలా పాజిటివ్ గా తేలిన వాళ్ళలో నూటికి 5 మందికే కాన్సరు వుంది. 95 మందిలో అవసరం లేకున్నా ఆ పరీక్షకు కొనసాగింపుగా మళ్ళీ బయాప్సీ పరీక్షలు, గడ్డల సర్జరీ, కొందరికి కీమోథెరపీలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మందిలో రొమ్మును మొత్తంగా తొలగించడం (Mastectomy), రేడియేషన్ ఇస్తున్నారు. అమెరికాలో తీసిన లెక్కలలో పాజిటివ్ ఫలితం వచ్చిన వాటిలో 30 నుండి 50 శాతం తప్పు రిపోర్టులని తేలింది. దీనితో పాటు మమ్మోగ్రఫీ అయ్యాక పెరిగే మానసిక, శారీరక వ్యధలవల్ల జీవితపు నాణ్యత తగ్గిపోతుంది.

    35 శాతం కాన్సర్లు పోషకాహారంతో ముడిపడి ఉంటాయి. కాన్సరుకు పొగాకు తర్వాత రెండో కారణం ఆహార లభ్యతే. అదనపు బరువు కాన్సరును తెచ్చిపెట్టే అంశం అని చెప్పుకున్నాం. అనేక రకాల కాన్సర్లు తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ఊబకాయ సంబంధ కాన్సర్లు సోకడం పెరుగుతోంది. అందువల్ల వాటి నివారణ కోసం ఆహారపరమైన వ్యూహాలు రూపొందించుకోవలసిందేనంటాడు జాసన్ఫంగ్.

    కాన్సరు రాకుండా అద్భుతాలు సృష్టించగల ఆహారాలేమీ లేవు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ అధికం కావడం వల్ల వస్తున్న ఊబకాయం, మధుమేహం-2లను నివారించగల వ్యూహమే కాన్సరుకూ పనికి వస్తుంది.

    150.00
    Add to cart
  • Upavasam – ఉపవాసం

    0

    చరిత్ర పొడవునా ఇతర మేధావులు కూడా ఉపవాసపు ప్రాధాన్యత గుర్తిస్తూనే వచ్చారు. ”మోతాదు మించితే విషమవుతుంది” అని చెప్పిన వైద్యుడు పాగా సెల్సస్‌ కూడా దీన్ని గుర్తించాడు. ”ఉపవాసం అతి పెద్ద చికిత్సా మార్గమని – అదే వైద్యుడనీ” రాశాడాయన. అమెరికా నిర్మాతలలో ఒకరైన బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ ”మందులన్నింటిలోకి మెరుగైనవి విశ్రాంతి, ఉపవాసమూ” అని అన్నాడు. ప్రఖ్యాత అమెరికన్‌ రచయిత, తత్వవేత్త అయిన మార్క్‌ ట్వెయిన్‌ కూడా ”మంచి మందులు, మంచి డాక్టర్ల కన్నా సగటు రోగికి ఎక్కువగా మేలు కలిగించేది ఉపవాసమే” నని రాశాడు. మన భారతీయ ఆయుర్వేదవైద్యులు ”లంఖణం పరమౌషదం” అని ఏనాడో చెప్పారు.

    ఉపవాసంలో జరిగే ”ఆటోఫగీ” ప్రక్రియను కనుగొన్నందుకు జపాన్‌ శాస్త్రవేత్త అయిన యోషినోరి ఓసుమికి 2016 నోబెల్‌ బహుమతి లభించింది.

    పేజీలు : 168

    100.00
    Add to cart