• Mee Jeevitanni Marchukovadaniki Okka Nimisham Chalu

    0
    ఒక్క నిమిషం కేటాయించి మీ జీవితాన్ని మార్చుకోండి 
    మీ జీవితాన్ని మార్చుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికి సిద్దపడండి. ప్రేరణ శిక్షకుడు విలీ జాలీ, విజయానికి తాళం చెవులూ, మీరు కలలో మాత్రమే చూసిన జీవితంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి పరికరాలు, మీకు అందిస్తున్నాడు.
    ఒక్క నిమిషం మాత్రమే ఎందుకు?
    ఎందుకు? ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది. మీ కలల వెంట నడవాలని మీరు నిర్ణయించుకున్న నిమిషం, మీరు మీ జీవితాన్ని మార్చుకునే నిమిషం. విలువైన కాలాన్ని సద్వినియోగం చెయ్యగల సామర్ధ్యం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఒక రోజులో 1440 నిముషాలు ఇవ్వబడ్డాయి. కీలకమేమిటంటే ఆ నిమిషాలతో నువ్వు ఏం చేస్తావు అనేది. విలీ జాలీ మీకు విజయసాధనకు ఇంధనాన్ని, ఆహారాన్ని అందివ్వనివ్వండి.
    విజయం….
    “అపురూపమైనది సాధించాలనుకుంటే, అసాధ్యమైనది నువ్వు కలగనాలి. విజయానికి కీలకం గొప్ప కలలు కనడం, ఆ తర్వాత, కల పెద్దదయితే సమస్యలు ప్రతిబంధకం కాదు అని గుర్తించి, నీ శక్తీయుక్తులన్నీ కేంద్రీకరించి ఆ కలల వెంటపడడం!”
    ఛాయిస్ లు….
    “నీకు ఏం సంభవిస్తోంది అన్నది అంత ముఖ్యం కాదు. నీలో ఏం సంభవిస్తోంది అన్నదే ముఖ్యం. జీవితంలో నీకు ఒక ఛాయిస్ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ధనికుడిగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు. విజయం అన్నది ఒక ఛాయిస్, చాన్సు కాదు!”
    మొండిపట్టు….
    “జీవితం వద్దు అంటుంది. జనం వద్దు అంటారు. కాని నువ్వు మొండిపట్టుతో ఉన్నట్లయితే, చివరకు జీవితం అవును అనక తప్పాదు. మొండిపట్టు, ప్రతిఘటనను ముక్కలు చేస్తుంది. ఓడిపోతే కధ ముగియదు. ప్రయత్నం విరమించినప్పుడే ముగుస్తుంది. అందువలన ఎప్పుడూ ప్రయత్నం విరమించకు. మొండిపట్టుతో ఉండు. నీ కలలు సాకారం కావడం చూడు.”
    ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఇప్పుడు నిమిష నిమిషానికీ మార్చుకోగలరు. మీరు ఉన్నతులు కాగలరు. ఎక్కువ పనిచేయ్యగలరు. ఎక్కువ సంపాదించగలరు. ఎక్కువ ప్రేమించగలరు. ఎక్కువ నవ్వగలరు.’                                 – మార్క్ విక్టర్ హేన్సన్, చికెన్ సూప్ ఫర్ ది సోల్ సహా రచయిత.
    195.00
    Add to cart
  • Meeku Merem Cheppukovali

    0
    మీ కలలను సాకారం చేసుకునే శక్తీ మీరు సృష్టించుకోగలరు.
    ఈ రహస్యాలు తెలుసుకుని ….
    మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు,
    మీకు మీరేం చెప్పుకోవాలి.
             మీ దృక్పధాన్ని వీలైనంత మెరుగుపరుచుకుని, మీ ప్రణాళికల మీద దృష్టి కేంద్రీకరించుకోవాలంటే మీరు స్వయం ఆధారితంగా వుండాలి. ఈ సరళమైన స్వయంభాషణ నైపుణ్యాలను ఉపయోగిస్తూ ఈ క్రింద ఇచ్చిన వాక్యాల శక్తిని అర్ధం చేసుకుని కృషి చేస్తే మీరు సాధించలేనిదేమీ వుండదు.
    * నా నిర్ణయాలు నేనే ఎంపిక చేసుకుంటాను. నా అనుమతి లేనిదే ఏ ఆలోచనా నా మనసులోకి ప్రవేశించదు.
    * నాలో ప్రతిభ, సామర్ద్యం, నైపుణ్యం అన్ని వున్నాయి. నాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రావీణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ వుంటాను.
    * ఇతరులు చెప్పేది వినడానికి సమయం తీసుకుంటాను. ఇతరులను ఓపికగా అర్ధం చేసుకుంటాను.
    * నేను అదుపు చేయగల విషయాలపైనే దృష్టి పెడతాను. నాకు సాధ్యం కాని విషయాలను అంగీకరిస్తాను.
    * నన్ను గురించి నేను నమ్మిన గుణాల ప్రకారమే నా వ్యక్తిత్వం వుంటుంది. కనుక నాలో వుండే ఉత్తమ విలువలనే నేను నమ్ముతాను.
    165.00
    Add to cart
  • Naa Godava

    0
    కాళోజి కవితలు చాలా వరకు ఇదివరకే అచ్చయినవి. అచ్చుకానివి కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని వీలయినంత వరకు ఒకే ఒక సంకలనంగా తేవాలన్న ప్రయత్నానికి రూపమే ఈ పుస్తకం. ఈ సంకలనం లోపట కాళోజి డైరీలల్ల, నోటు బుక్కుల్ల, చెల్లాచెదరుగా ఉన్న కాగితాలలో రాసుకున్నాయ్, ఇప్పటిదాకా అచ్చుకాని గేయాలు, గీతాలు ఉన్నాయి. వీటన్నింటిని ఒక్క దగ్గర చేర్చి, సరిజూసి, మంచిగున్నయనుకున్న విషయాన్ని ఎన్నుకుని, పునరుక్తుల్ని మినహాయించేటప్పుడు కవితాహృదయానికి భంగం కలగకుండా వీలయిన జాగ్రత్తల్ని తీసుకున్నాం.
                ఇట్లాంటి సందర్భాల్లో కవి ఉద్దేశించిన అర్థం – భావం చెడకుండా వాక్యాలను, పదాలను, సర్ది రాసి ప్రయత్నం చేశాము. అయితే, కాళోజి కోరిక ప్రకారం ఇప్పటికే ప్రచురించి ఉన్న కవితా సంకలనాల వరుసక్రమం చెడకుండా ఉంచి, మిగిలిన విషయాల్లో మాత్రం కొంత స్వతంత్రంగా వ్యవహరించవలసి వచ్చిందని చెప్పక తప్పదు. ఈ క్రమంలో, కవి యొక్క అభిరుచి, ఆయన సమాజాన్ని పరిశీలించి, ఆయా పరిస్థితులలో స్పందించిన తీరు, బహుముఖమైన కాళోజి వ్యక్తిత్వం పాఠకులు అర్థం చేసుకుంటారనే మా నమ్మకం.
    500.00
    Add to cart
  • Kopparapu Kavula Daiva Sankalpam

    0
    కావ్య పరిచయం
    దైవ సంకల్పం వెలుగులు
    – ప్రాచార్య శలాక రఘునాథశర్మ
    ఆశుకవిత్వానికి అలవాటుపడ్డవారికి రసనిర్భర కావ్య నిర్మాణం మీద సాధారణంగా దృష్టి నిలువదు. ఒకవేళ నిలిచినా నిర్మాణం నిరంతరంగా, నిరంతరాయంగా సాగదు. సాగినా విక్షేపాత్మకమైన మనస్సు కలాన్ని కావ్యాంతం దాకా పోనివ్వదు. ఒకవేళ పోనిస్తే ఆ కావ్యం ఒక అద్భుత సందర్భాల, ఆహ్లాదకర సంఘటనలు, రమణీయ వాగ్విన్యాసాల విశాల విహారశాలగా రూపొందుతుంది. దీనికి సజీవమైన ఉదాహరణ కొప్పరపు సోదరుల కలం వెలువరించిన కమనీయ కావ్యం ‘దైవ సంకల్పం’,
    కొప్పరపు కవులు ఆ మాట అనలేదు కానీ విశ్వనాథవారి వాక్కును అన్వయిస్తే వారి చేతలు దీపితాలాతమువోలె ఆలాతాన్ని క్షణ విలంబలనం కూడా లేకుండా అతి తీవ్రంగా త్రిప్పుతూ ఉండాలి. త్రిప్పేవాడు ఏ కొంచెం అలసత్వం వహించినా చక్రం ఉండదు. చేతిలో కొరివి మాత్రమే ఉంటుంది. కొరివి ఉద్వేజకం. చక్రం ఆహ్లాదకరం. ఆ తాత్పర్యంతోనే విశ్వనాథవారు ఆ మాట అన్నారు. కొప్పరపు కవులు దానికి చక్కని ఉదాహరణగా నిలిచారు. పద్యం చెప్పటానికి, పెద్ద శక్తిమంతుడు కానక్కరలేదు. హృద్యం కావాలంటే, దానికి నిరవద్యతతో విరాజిల్లే నేతృత్వం కలగాలంటే అతడు తప్పనిసరిగా ప్రతిభలో మహాప్రాంశువు అయి ఉండాలి. ఈ సోదర కవులు ఎంతటి త్రివిక్రమ క్రమ పరిపాకం కలవారో నిరూపించటానికి నేనున్నానని నిరాఘాటంగా నిలుస్తున్న నిస్తుల కావ్యం ‘దైవసంకల్పం’..
    కవిత్వానికి ఆవేశం కావాలంటారు కొందరు. నిజమే కానీ అది ‘భవ్యకవితావేశం’ అయితే తప్ప కవిత్వం చప్పచప్పగా తప్పితాలుగా అయిపోతుందని కవి బ్రహ్మలాంటి వారి అభిప్రాయం. ఆవేశం 14. భవ్యం కావటమంటే అది సంయమన సామ్రాజ్య పట్టాభిషిక్తం కావటమే. అది ఉత్తమ కావ్య సంపదను సమృద్ధిగా సమకూరుస్తుంది. దానికి మంచి ఉదాహరణ ‘దైవసంకల్పం’.
    కొన్ని సందర్భాలలో ఇతివృత్తం కవికి కొండంత అండగా నిలుస్తుంది. మరికొన్ని సందర్భాలలో కవి ప్రతిభ ఇతివృత్తానికి హితరమణీయ దీప్తిని కలిగిస్తుంది. అప్పుడు కావ్యం హిరణ్యాత్మకమై కవిని హిరణ్యగర్భ సదృశుని చేస్తుంది. ఈ రెండవ విధానానికి దృష్టాంతంగా నిలువగల సత్తా నాకున్నదని సగర్వంగా చాటుతున్న కావ్యం ‘దైవసంకల్పం’.
    “కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు ఆర్యసత్కథలు పుట్టురత్నములు. సత్కవి కల్పనామనీషావహ పూర్వవృత్తములు సానలు దీరిన జాతిరత్నములు” అని వక్కాణించాడొక గొప్ప భావకుడు. నిజజీవితంలో తారసిల్లిన ఒక చిన్న సంఘటన నుండి కూడా జాతిరత్నస్థాయి సత్కావ్యాన్ని కాక సమర్థుడు సంతరింపగలడని నిరూపించే మహాకృతి ‘దైవసంకల్పం’…………….
    200.00
    Add to cart
  • Amrutham Kurisina Ratri

    0
    200.00
    Add to cart
  • Nikasham

    0

    ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు

    నిన్నటి ప్రత్యూషం నేడు లేదు

    ఈ రోజుటి ప్రదోషసంధ్య, రేపటికి పాతది….మాసినది…..

    ఓ గంట క్రితం చుట్టేసిన దు:ఖం యిప్పుడు శూన్యం

    ఈ చిటికెడు విషాదాలు

    క్షణకాలప్పాటు మెరిసే ఆనందాలు….. సుఖాలు……

    వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు….

    అన్నీ… అందరూ కల్సి ఎక్కడికి?

    ఎటువేపుకి ప్రస్థానం?

    ఒక అనుభూతి నింకో అనుభూతిని కబళిస్తూ….

    అంతం లేని దారిలో

    అక్కడక్కడా ఆగిపోతూ……చివరికి?

    అంతా…..అన్నీ……అందరూ…. ఒకే గాహ్వారంలోకి ……

    కాంతిని కూడా స్వాహా చేసే మహా బిలంలోకి….

    భావాతిత……అనుభూతి రాహిత్య

    మహా శూ……..న్యం………లో……కి

    70.00
    Add to cart
  • Mee Rajyam Meerelandi

    0

    బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప
    హిందువు కాడంటే

                                నేను హిందువును కాను

    నాస్తికుడైతే తప్ప

    కమ్యూనిస్టు కానేరడు అంటే

                         నేను కమ్యూనిస్టును కాను

    అవినీతిని తాత్వికరించుకున్న దొంగలరాజ్యమ్ లో

    ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారమ్ కోసమే

    తమ దళిత రాజకీయాలూ ఉన్నాయంటే

                       నేను దళితవాదిని కాను.

    భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని

    గుర్తించి ఆమోదిస్తే తప్ప

                     నేను ప్రతియా తాత్వికుణ్ణి కాలేను.

    200.00
    Add to cart
  • Naku Nenu Rasukunna Premalekha

    0

    సొంత అజ్ఞానం

    కొంత ఆత్మజ్ఞానం

    సొంత పైత్యం

    కొంత సాహిత్యం

    సొంత ఆరోహణ

    కొంత అవరోహణ

    సొంత దుర్గంధం

    కొంత సుగంధం

    వెరసి

    ఇది స్వగ్రంథం

    Features

    100.00
    Add to cart
  • Ciprali

    5

    తలకాయలు తమ తమ జే

    బుల లోపల దాచుకొనుచు పోలింగ్ కు  పో

    వలసిన రోజు వస్తే

    సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా

     

    పోలీసుల రాజ్యమిది

    పోలింగోక భూటకం

    ఫాసిజమై మారుతోంది

    ప్రజాస్వామ్య నాటకం

     

    విచిత్ర వీరులు నక్సలైట్లు

    అన్యాయాలకి డైనమైట్లు

    అంధకారంలో టార్చిలైట్లు

    నవయువ జీవన కాస్మోనాట్లు

    వాళ్ళంటే హడలిపోతారు నిక్సనైట్లు

     

    విప్లవకారుల విధ్వంస

    భీభత్సకాండకు నా ప్రశంస

    అదేన్నడూ కానేరదు హింస

    అది నూతన చేతనారిరంస

    మానవ మానస మానససరోవర హంస

    120.00
    Add to cart