• Bhumi Nunchi Pluto Daka. . .

    0
      “భూమి నుంచి ప్లూటో దాకా” అనే ఈ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన సైన్స్ ఫిక్షన్. స్పేస్ ఓ పేరా నవలలత్రయంలో  మూడవది. ఆఖరిది, స్పేస్ ఒపేరా అంటే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యంలోని ఒక ఉపవిభాగం. భవిష్యత్తులో సాగె కథనం . రాబోయే వైజ్ఞానిక ప్రగతి , రెండు సామ్రాజ్యాలు అధిపత్యంకోసం  చేసే యుద్దాలు, కొంత రొమాన్స్, అతింద్రియ  శక్తులు కలగలుపుతూ వుండే కథనం . ఇవి సాధారణంగా స్పేస్  ఓపెరా లక్షణాలు. చిత్తుర్వు మధు మొదటగా ఆంగ్లంలో ఈ నవలలత్రాయం  రాశారు . War for Mars: A story of the Fourth Millennium. Blue Green: Return To Earth, Dark Outposts: Final revenge అనే ఈ నవలలు, అమెజాన్ ద్వారా, సంపర్క్ పబ్లిషర్స్ కలకత్తా వారిద్వారా ఇంగ్లీషులోకి నవలలుగా  ప్రచురించబడ్డాయి.
    175.00
    Add to cart
  • Neeli Akupaccha

    0

    డాక్టర్ చిత్తర్వు మధు వృత్తిరీత్యా వైద్యులు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాదులో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. అప్పటి నుంచి కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు ఐసిసియు, బై బై పొలోనియా, ఎపిడెమిక్ నవలలు ఒక నవలాత్రయంగా రాశారు. స్పేస్ ఓపెరా అనబడే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో ‘కుజుడి కోసం’ అనే నవల రచన మాసపత్రికలో సీరియల్ గా ప్రచురితం అయింది. దానికి కొనసాగింపు ‘నీలి ఆకుపచ్చ’ కనిగె జాలపత్రికలో సీరియల్ గా వచ్చింది.

    గ్రహాంతర ప్రయాణాలు, సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు, ప్రేమలు భవిష్యత్ లో జరిగినట్లు కథనం స్పేస్ ఒపేరా లక్షణాలు. ఈ రెండు నవలలు ఆంగ్లంలో మొదటగా ప్రచురించబడ్డాయి. వీటిని రచయిత స్వంతంగా తెలుగులోకి అనువాదం చేశారు. భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో సాగే కథనం జరగబోయే శాస్త్రీయ పురోగతిని వివరిస్తూ హనీ ఆమ్రపాలి అనే హీరో భూమికి కుజుడి నుంచి తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. కుజుడి వర్ణం అరుణం అయితే ప్రాణవాయువు పాత్రహరితం చూస్తే కన్పించే రంగులు అవే. ఉత్కంఠ కలిగించే ఈ నవల మిమ్మల్ని మరో భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది.

    140.00
    Add to cart