• Savitri Classics

    0

    ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకం ఒక్కోపేజీ తిప్పుతూ చదువుతూ వెళుతుంటే అప్పటి రోజులు, ఆ చిత్రాలు, ఆనాటి కళాకారులు.. అన్నీ కళ్ళముందు రీల్లా తిరిగాయి. అప్పటి కాలానికి వెళ్లిపోయాను. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల రోజుల్ని ఎందుకు స్వర్ణయుగం అంటామో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. సావిత్రిగారు నటించిన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు వేరు వేరు అధ్యాయాలుగా విభజించి వివరించడం బాగుంది. మరీ ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఎంత చెప్పాలో అంతే చెబుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా సులభంగా అర్థమయ్యేలా సాగిన సంజయ్ కిషోర్ రచనాశైలి బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనీ, మళ్లీ మళ్లీ చదవాలనీ అనిపిస్తుంది ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సావిత్రి గారంత అందంగా ఉందీ పుస్తకం. ముఖ్యంగా సావిత్రిగారి అభిమానులకు ఈ పుస్తకం ఓ పండగేనని చెప్పాలి.

    ‘పద్మభూషణ్’ శ్రీమతి పి. సుశీల
    ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని

    సంజయ్కిషోర్ వ్రాసి రూపొందించిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకం చేతిలోకి తీసుకొని ముఖచిత్రాన్ని అలా చూస్తుండిపోయాను. పేజీ తిప్పాలన్న అలోచన కూడా కలగలేదు. పుస్తకం లోపల ఏముంటుందో మొత్తం ఆ ముఖచిత్రమే చెప్పేసింది. అంత అందంగా ఉంది. భక్తులు రామాయణం, మహాభారత గ్రంథాలను ఎలా దాచుకుంటారో.. సినీప్రేమికులు సంజయ్కిషోర్ వ్రాసే పుస్తకాలను అలా దాచుకోవాలి.

    శ్రీ మురళీమోహన్

    ప్రముఖ నటులు, నిర్మా

    750.00
    Add to cart
  • Thelika Telugu Vachakam

    0
    100.00
    Add to cart
  • The Fire

    0

    జీవిత దశలను కాదు నీ జీవిత దిశని మార్చుకుని ఆపై ఇతరుల జీవితాలను మార్చే దిశగా మారటానికి తోడ్పడేది. ఈ “ది ఫైర్”. నీ నిరర్ధక ఆలోచనలకు మంటను పెడుతుందీ ఫైర్. అందకారమనే అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞానమనే వెలుతురు వైపు దారి చూపే కాగడా ఈ పుస్తకం. మనిషి బ్రతుకు బాటలో చీకటిని రూపుమాపుతూ దారి చూపాలని ఈ రచయిత చేసిన ప్రయత్నం ఎంతో వెలుగు ప్రదాయకం.

     

    ప్రకృతిలో రాత్రి అనే చీకటి, పగలు అనే వెలుగు ఉంటాయి. రెండిటిని మనిషి అస్వాదిస్తాడు. కానీ అదే జీవితంలో చీకటి(భాద) కన్నా వెలుగు (ఆనందం) వైపే పయనించాలని ఈ రచయిత చెప్పిన తీరు అమోఘం. జీవితాన్ని మీరు మీకు కావలసిన రీతిలో రూపు దిద్దుకోండి. ఆస్వాదించండి, ఆనందించండి అని చెప్పటం కాదు. మనతో చేయిస్తుందీ పుస్తకం. అంతగా రగల్చగలిగే శక్తీ ఉంది కనుకనే ఈ పుస్తకం పేరు “ది ఫైర్”.

    -యండమూరి వీరేంద్రనాద్

    250.00
    Add to cart
  • Bhumi Nunchi Pluto Daka. . .

    0
      “భూమి నుంచి ప్లూటో దాకా” అనే ఈ నవల డాక్టర్ చిత్తర్వు మధు రాసిన సైన్స్ ఫిక్షన్. స్పేస్ ఓ పేరా నవలలత్రయంలో  మూడవది. ఆఖరిది, స్పేస్ ఒపేరా అంటే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యంలోని ఒక ఉపవిభాగం. భవిష్యత్తులో సాగె కథనం . రాబోయే వైజ్ఞానిక ప్రగతి , రెండు సామ్రాజ్యాలు అధిపత్యంకోసం  చేసే యుద్దాలు, కొంత రొమాన్స్, అతింద్రియ  శక్తులు కలగలుపుతూ వుండే కథనం . ఇవి సాధారణంగా స్పేస్  ఓపెరా లక్షణాలు. చిత్తుర్వు మధు మొదటగా ఆంగ్లంలో ఈ నవలలత్రాయం  రాశారు . War for Mars: A story of the Fourth Millennium. Blue Green: Return To Earth, Dark Outposts: Final revenge అనే ఈ నవలలు, అమెజాన్ ద్వారా, సంపర్క్ పబ్లిషర్స్ కలకత్తా వారిద్వారా ఇంగ్లీషులోకి నవలలుగా  ప్రచురించబడ్డాయి.
    175.00
    Add to cart
  • Neeli Akupaccha

    0

    డాక్టర్ చిత్తర్వు మధు వృత్తిరీత్యా వైద్యులు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాదులో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. అప్పటి నుంచి కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు ఐసిసియు, బై బై పొలోనియా, ఎపిడెమిక్ నవలలు ఒక నవలాత్రయంగా రాశారు. స్పేస్ ఓపెరా అనబడే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో ‘కుజుడి కోసం’ అనే నవల రచన మాసపత్రికలో సీరియల్ గా ప్రచురితం అయింది. దానికి కొనసాగింపు ‘నీలి ఆకుపచ్చ’ కనిగె జాలపత్రికలో సీరియల్ గా వచ్చింది.

    గ్రహాంతర ప్రయాణాలు, సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు, ప్రేమలు భవిష్యత్ లో జరిగినట్లు కథనం స్పేస్ ఒపేరా లక్షణాలు. ఈ రెండు నవలలు ఆంగ్లంలో మొదటగా ప్రచురించబడ్డాయి. వీటిని రచయిత స్వంతంగా తెలుగులోకి అనువాదం చేశారు. భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో సాగే కథనం జరగబోయే శాస్త్రీయ పురోగతిని వివరిస్తూ హనీ ఆమ్రపాలి అనే హీరో భూమికి కుజుడి నుంచి తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. కుజుడి వర్ణం అరుణం అయితే ప్రాణవాయువు పాత్రహరితం చూస్తే కన్పించే రంగులు అవే. ఉత్కంఠ కలిగించే ఈ నవల మిమ్మల్ని మరో భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది.

    140.00
    Add to cart
  • Vaktha (Telugu Edition)

    0

    మీరూ కావచ్చు ‘వక్త’
    వేదిక ఎక్కి ఉపన్యాసం ఇవ్వమంటే వణికిపోయే వారందరికీ ఉపయోగపడే పుస్తకమిది. చైతన్య, తపస్య అనే ఇద్దరు మిత్రుల మధ్య సంభాషణల రూపంలో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌’ లో మెలకువలన్నీ వివరించి చెప్పారు రచయిత. పుట్టుకతోనే ఎవరూ ‘వక్త’ లు కారనీ, అది నేర్చుకుంటే వచ్చే నైపుణ్యమనీ చెబుతారు. పరాజయభీతి, విమర్శల భయం, ఆత్మన్యూనత… లాంటి అంతర్గత శత్రువులతో మొదలుపెట్టి, కండిషనింగ్‌ మనని ఎలా వెనక్కి లాగుతుందో వివరించారు. వేదిక ఎక్కగానే గొంతు పెగలకపోవడానికి కారణాలేమిటీ, ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చూ, ఉపన్యాపం ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌కున్న ప్రాధాన్యమేమిటీ, గొంతును ఎలా మలచుకోవాలీ, భాష ఎలా ఉండాలీ… ఇలాంటి ఎన్నో కీలకాంశాలను సందర్భానికి తగిన ఉదాహరణలతో, స్ఫూర్తినిచ్చే కథలతో ఆసాంతం చదివించి ఆలోచింపజేసేలా రాసిన పుస్తకమిది.

    200.00
    Add to cart
  • AVADHANA SATHAKAM

    0
    500.00
    Add to cart
  • AMUKTHA MAALYADA

    0
    657.00
    Add to cart
  • Abhijnana Shakuntalam

    0
    288.00
    Add to cart
  • DASA MAHAAVIDYALU (Telugu)

    0
    600.00
    Add to cart
  • GODHA GOVINDA GEETHAM

    0
    500.00
    Add to cart
  • Gomatha Vaibhavam

    0
    25.00
    Add to cart