• Maharani Rudramadevi

    0

    గణపతి

    ఏ జాతి వర్తనమ్మీ విశ్వవసుధైక

    కల్యాణ లబ్ధికి కల్పవల్లి ఏ జాతి శేముషి యెల్ల తంత్రజ్ఞుల

    పల్లటీల్ గొట్టించు పని న జేయ ఏ జాతి కీర్తివాహిని కవేరసుతా సు రాపగాదులకు సఖ్యప్రదాయి ఏ జాతి దుర్వార తేజమ్ము శాత్రవ రాజన్యకోటి కారటముగూర్చు ఆ మహాజాతి స్తవనీయ మనుపమాన మప్రతి ద్వంద్వ మకలంక మాంధ్రజాతి అట్టి తెల్గుల కాణాచి యగుచు వెలసె ప్రాజ్యకాకతి పూజ్య సామ్రాజ్యలక్ష్మి

    జినదాసాచ్ఛదనాగ్రగణ్యు డొగి శాసించెన్ త్రిలింగమ్ము పెం పునకై కట్టగ పత్తన; మ్మెఱుక దేవుండాన పాలించి పు ‘ణ్యనిధుల్ పుత్రుల పేరుపై ననుమ కొండన్ గట్టి, వారాహ కే తన మెత్తించెను భావి కాకతి ప్రభుత్వ స్థాపనా రంభుడై.

    125.00
    Add to cart
  • Jashuva Rachanalu-1 (Gabbilam) – జాషువా రచనలు – 1 గబ్బిలం

    5

    జాషువా రచనలు – 1 గబ్బిలం :

    జాషువా 1941లో గబ్బిలం వెలువర్చాడు. 20వ శతాబ్దంలో వచ్చిన ఆధునిక తెలుగు కావ్యాల్లో విశిష్టమైంది గబ్బిలం. ఖండకావ్య రచనలో సుమారు 22 సంవత్సరాలు పదునెక్కిన కలం సృష్టించిన అద్భుత ప్రతీకాత్మ కళాఖండం గబ్బిలం.

    ఖండకావ్య ప్రక్రియకు, ఊపిరులూది జవం జీవంతో తొణికిసలాడేలా చేసి ఆధునికాంధ్ర సాహిత్యంలో ప్రతిష్ఠాకరమైన స్థానం సంపాదించి పెట్టినవాడు జాషువ.

    సామాజిక అసమానతలపై ఏవగింపు, సంస్కరణల ఫలాలు చేతికి అందగలవన్న ఆశ రగుల్కొంటున్న తరుణంలో వర్ణాశ్రమ ధర్మాల పరిరక్షణను సమర్ధించే లక్షణాలు ముందుకొస్తున్నవైనం జాషువాను కలవరపరచాయి. హక్కుల సాధనకు ఉద్యమించే తరుణం ఆసన్నమైందని భావించాడు. హరిజనులుగా పిలవబడుతున్న వారిలో చైతన్యం రగిల్చి ఉద్యమించేలా చేసి దళితుల్లో ఆత్మగౌరవ సాధనకై తపించాలని ఊహించాడు. పీడకవర్గాల ముక్కుగుద్ది హక్కుల సాధనా దిశగా సాగిన మహాప్రస్థానంలో జాషువా ఎత్తిన అనల పతాకం గబ్బిలం. ఆగామి యుగంలో దళిత సూర్యుడి శిరసు నుంచిన అగ్ని కిరీటం గబ్బిలం.

    50.00
    Add to cart
  • Amrutham Kurisina Ratri

    5

    తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి; అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు.

                 భావకవులు శబ్ద సౌందర్యానికి, శైలీ రమ్యతకూ ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయినదయినా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించాడు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే – తిలక్, ఆచరణ ద్వారా చేసిన సూచన.   

                                                          – కుందుర్తి    

    200.00
    Add to cart