• Kundalini (Rahasyam)

    0
    పరమానంద స్థితి అనుభవించటానికి మీరు యోగులు కానక్కరలేదు!
                                                         అవును, నిజం.
                      తన పుస్తకం కుండలిని – రహస్యం,లో హిమాలయ మర్మయోగి ఓం స్వామి కుండలిని – భగవతి నిరుణాంశ, మీలోని ఆదిమ శక్తి – రహస్యాన్ని ఆవరించి ఉన్న ఆచ్చాదనా తొలగిస్తారు.
                         ఈ శక్తీ మూలాన్ని మేలుకొలపటానికి ఆచరణాత్మకమైన అడుగులలో కుండలిని, ఏడుచక్రాల గూఢార్థన్ని, కంటికగుపించే అర్ధాన్ని రచయిత తన హాస్యధోఅరణిలో వివరిస్తారు. కదలనీయని వృత్తాంతాలు , సంవత్సరాల తరబడి అయన కొనసాగించిన ధ్యానంలో కలిగిన అనుభవాల ఆధారంగా వెలువడ్డాయి.
                         సంభ్రమం కలిగించే ప్రయాణం – ఆధ్యాత్మకత ఫై మారె ఇతర పుస్తకమూ తెలియజేయలేని విశేషం- కుండలిని మూలం నుంచి ఆధునిక యుగంలో స్వామి స్వయంసాధన వరకు – చేయండి.
    165.00
    Add to cart
  • ANANDHANI PONDHE MARGHAM

    0
    225.00
    Add to cart
  • Anandanni Ponde Margam

    0

    ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అరుదైన పుస్తకం ఇప్పుడు 10 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లోని ఒకరు దైనందిన సమస్యలని అధిగమించి శాశ్వత ఆనందాన్ని ఎలా పొందవచ్చో తన వ్యవహారిక జ్ఞానంతో ఇందులో వివరిస్తారు. దలైలామా ప్రాచ్య ఆధ్యాత్మిక సంప్రదాయమూ, కట్లర్ పాశ్చాత్య దృక్కోణమూ పొందుపరచబడ్డ ఆనందాన్ని పొందే మార్గం అందరికీ అందుబాటులో ఉండే కరదీపిక. ఇందులో మన అనుభావాలలోని కీలక అంశాలన్నిటినీ స్పృశిస్తూ, వాటికి టిబెట్ బౌద్ధమత సిద్ధాంతం సూచించే పరిష్కారాలని అన్వయిస్తూ, సమతూకాన్నీ, సంపూర్ణ మానసిక స్వేచ్చనీ పొందుతూ ఆధ్యాత్మికతని మనిషి ఎలా సాధించవచ్చో వారు వివరించారు. జీవితం పట్ల దలైలామాకి గల దృక్పథాన్ని వివరంగా తెలుసుకోవాలని కోరుకునేవారికి, ఆయన విశ్వాసాలని వాస్తవ ప్రపంచానికి ఇంతకన్నా స్పష్టంగా తెలియజేసే పుస్తకం మరొకటి లేదు.

    225.00
    Add to cart
  • Sri Datta Puranam

    0

    ఇది శ్రీ దత్తపురాణమను మహాగ్రంథము, సంస్కృతమున పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి                  రచించినది,  తెలుగులో టీకతో సమర్పింపబడుచున్నది. ఇది ఎన్మిది అష్టకములుగను, ఒక్కొక్క అష్టకము ఎన్మిది అద్యాయముల                    గుచ్చముగను  రూపము దాల్చినది. ఇందు మొత్తము 3500 శోకములున్నవి.

    ఈ అష్టాష్టక అష్టాధ్యాయ విషయములు సూచికలో చూడవచ్చును. సంస్కృత వ్యాఖ్యతో కూడిన నాగరిలిపి ప్రతి నాకు                      లభించినది. దానిని పరిశీలించి తెలుగులో ప్రతిపదార్థతాత్పర్యములను కూర్చినాను. పాఠకమహోదారులకు ఇది ప్రయోజనకారి కాగలదని నమ్మిక.

    సర్దము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము అను ఈ అయిదు లక్షణములున్నది పురాణము, అని              లక్షణము చెప్పబడినది. ఈ గ్రంథమునందు ఈ లక్షణములున్నవా? అను ప్రశ్నకు శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి వారి సమాధానము : ఈ        గ్రంథమున ప్రకరణవశాత్తు ప్రథమకాండమున సర్గము, అంతిమకాండమున ప్రతిసర్గము, మధ్యలో వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము      వర్ణింపబడినవి కావున దీనిని పురాణమనుట సార్థకమే.

    ఇందు ఉపాసనాకర్మజ్ఞానకాండల విషయములను సమాచరించు భక్తుల అనుభవము ప్రతిపాదింపబడినది. తెలుగువారికీ                  గ్రంథవిషయము నందించుట కర్తవ్యముగా నెంచి మిత్రులు రావి మోహనరావుగారు ప్రోత్సహించగా నే నీ పనికి పూనుకొని యథాశక్తి                    శ్రమించినాను. నా శ్రమ ఫలవంతమైనదను నమ్మికతో దీనిని మీ ముందు ఉంచుచున్నాను. ఈ కృషిలో నా ప్రతిభావ్యుత్మతులు చాలినవో              లేదఆశ్రీ  దత్తునకే ఎఱుక. ఎఱుక గల పాఠకులు దతస్వరూపులై మన్నింప ప్రార్థన.

    450.00
    Read more
  • Sri Vishnu Vidya

    0

    (శ్రీ విష్ణు సహస్రనామ భాష్యము)
    “ఇది నామ విద్య. ఈ నామాలు అక్షరాల గుంపులు కావు. నారాయణుని శబ్దాకృతులు. మొత్తంగా ఈ సహస్రనామ స్తోత్రమే విష్ణుని శబ్దమయీమూర్తి, ఇవి వేదమందు ప్రతిపాదింపబడిన పరమాత్ముని శబ్దాలు. వీటి వ్యాఖ్యానం మన వైదిక విజ్ఞానాన్ని, పరమేశ్వర జ్ఞానాన్ని స్పష్టపరుస్తాయి. అందుకే ఇది ‘విష్ణువిద్య’. .. ప్రాచీన, అర్వాచీన భాష్యాల ననుసరించి, వైదిక శాస్త్రాల సంప్రదాయాధారంగా ఒకొక్క నామానికి ఉన్న ఔచితీమంతమైన క్రమబద్ధతనీ, నిర్దిష్టమైన వ్యాఖ్యానాన్ని అందించే సమన్వయ భాష్యమిది. ప్రతినామ వ్యాఖ్యానము పారాయణయోగ్యంగా, భావనాయోగంగా సమకూర్చిన విష్ణుతేజో విలసిత గ్రంథమిది”. —

    -సామవేదం షణ్ముఖ శర్మ

    800.00
    Add to cart