• Andhrapradesh Dharmika Mariyu Hindumatha Samsthala Mariyu Dharmadaya Chattamu, 1987

    0

      ధార్మిక, మత సంస్థలు తృప్తికరముగా నిర్వహింపబడక పోవుచుండుట వలనను, వాటి ఆస్తుల నిర్వహణకు ప్రస్తుత మత లౌకిక ఆచారములను సంతృప్తిగా పాటింపబడుటకు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయముల చట్టము, 1966లోను, తిరుమల తిరుపతి దేవస్థానముల చట్టము, 1979లో నున్న నిబంధనలు అందుకు సరిపోవునంత మేరకు లేకపోవుటవలన, ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానములతో సహా అన్ని సంస్థల ధర్మాదాయముల ఆస్తులను సమర్ధవంతముగా నిర్వహింపబడుటకు, నిధులను అర్ధవంతముగా వినియోగింప బడుటకు, ట్రస్టీలు తమకు వంశపారంపర్యానున్న ఆధారముతో చేయుచున్న క్లెయింలను, ట్రస్టీల ఎంపికకు వారి నియామకమునకు మరియు, వారు ప్రవర్తనా నియమావళిలో పాటించవలసిన విధానములను, దేవాలయములలో వంశపారంపర్యానున్న అర్చకుల మిరాసీదారుల మరియు యితర అధికార సిబ్బంది పొందుచున్న హక్కుల స్వభావము, ఆగమ శాస్త్రానుసారము, సాంప్రదాయానుసారము అట్టి సిబ్బంది పూజలు, పునస్కారములను నిర్వహించుటకు వారికి ముట్ట చెప్పవలసిన ప్రతిఫలము, మరియు ధర్మాదాయశాఖ సాధారణ పనితీరుపై తగిన మార్గదర్శక సూత్రములను సూచించుటకు ప్రభుత్వము న్యాయమూర్తి చల్లా కొండయ్య కమీషన్ ను యేర్పాటు చేసింది. కమీషను తన రిపోర్టును 28.2.1986నాడు ప్రభుత్వమునకు అందచేయగా ప్రభుత్వము దానిని పరిశీలించి కొన్ని మార్పులతో ఆ రిపోర్టును ఆమోదించింది.

    270.00
    Add to cart