• Spoorthi kahtalu

    0
    90.00
    Add to cart
  • Kovvali Navalalu Konni

    0

    సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల  తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.

    ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా ‘కాలక్షేపపు నవలలు’ 1000 రాసి ‘వేయి నవలల కొవ్వలి’ అయ్యారు.

    కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.

    1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.

    యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.

    కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.

     

    “తెలుగు నవలా రచనా పధశోధకులు

    తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు

    వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు” ఐన

    శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న  మహాప్రస్థానమొందారు.

    – కొవ్వలి లక్ష్మీనరసింహారావు

    280.00
    Add to cart
  • Gorky Kathalu

    0

    గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటిని, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. మొరట పితృస్వామిక భావాలకూ, పైపై నాగరిక పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులున్న వాళ్ళ ప్రపంచం, సంప్రదాయక నీతి స్థానంలో అపేక్షలను పెంచే ప్రపంచం. సమాజంతో సంబంధాలు లేని వాళ్ళ బతుకుల్ని ఈసడించుకునే ప్రపంచం, బాధలూ, భయాలూ, కరువులూ, కాటకాలు లేని ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చాటేవే ఈ సంపుటిలోని కథలు కూడా.

    – మాక్సిం గోర్కీ

    60.00
    Add to cart
  • Manishi Lopali Mahasamudralu

    0

      నా చిన్న మాట….

                           పదిహేడేళ్ళ అమ్మాయి తన ప్రాణాన్ని థానే తీసేసుకుంది. కలకలం రేపింది. చిన్నాపెద్దా “అయ్యో” అన్నారు. గాలి కూడా సానుభూతి చూపింది. ఆకాశం కన్నీళ్ళు కార్చింది. “జీవితాన్ని ఎం చూసిందని” అన్నారు. నిజమే! కలలకు చోటులేని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. “అంత బరువెం మౌసిందని” అన్నారు మరికొందరు. పరీక్షలో ఫెయిలవడం కూడా ఒక కారణమేనా అన్నారు. ఏమో! ఎం తెలుసు. ఆ పరీక్ష చుట్టూ ఎన్ని కలల సాలిగూళ్లు అల్లుకున్నాయో. సమాజం తనకై నిర్మించిన ఎన్ని సౌధాలను ఆ వైఫల్యం కూల్చివేసిందో. మొత్తనికి ఆ ఘటన నన్ను కుదిపేసింది. తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                               -కిల్లాడ సత్యనారాయణ.

    80.00
    Add to cart
  • Manishi Roopalu – మనిషి రూపాలు

    0

    కొండప్రాంతాలలో నివసించే ఒక వితంతు యువతి కథ ఇది. ఇందులో మనిషి యొక్క అనేక రూపాలను ఎంతో నైపుణ్యంతో చిత్రించాడు రచయిత. మన సంఘంలో ప్రబలివున్న వైరుధ్యాలనూ, తారతమ్యాలనూ వేలెత్తి చూపించాడు. మనిషి పరిస్థితులకు కేవలం బానిస అనీ, పరిస్థితులే అతని జీవితాన్ని నడిపిస్తాయనీ నమ్ముతాడు రచయిత.

    యశ్‌పాల్‌ విప్లవవాది. అతను తన జీవితంలో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. అతని రచనల్లో సాంఘిక, రాజకీయ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరుపేదలపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు, సాంఘిక చైతన్యం కలగజేసేందుకు అతను తన కలాన్ని శక్తివంతంగా ఉపయోగించారు.

    పేజీలు : 314

    280.00
    Add to cart
  • Matruthvam

    0

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.

    ‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.

    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.

    తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.

    – ఆలూరి విజయలక్ష్మి

    200.00
    Add to cart
  • Molakala Punnami

    0
    80.00
    Add to cart
  • Navala Prajalu – నవల ప్రజలు

    0

    మానవజాతి చరిత్రలో ఎన్నో కొత్తకళలు (ఉదాహరణకు సినిమా) పుట్టాయి. కానీ ఇంతవరకూ ఏ కళకూడా పూర్తిగా నశించిపోలేదు. తన చైతన్యాన్నీ వాస్తవిక ప్రపంచంపట్ల తన సంవేదననూ అభివృద్ధి చేసే ఏ అంశాన్ని కూడా మానవుడు జారవిడుచుకోడు. నవల కొత్తకళేకావచ్చు. కానీ దాని వేళ్ళు సూదూరగతంలో ఉన్నాయి. ప్రాచీనగ్రంథాలైన ”టిమాల్కియోస్‌ బాంక్వెట్‌,” ”డాఫ్నీ అండ్‌ ఓలీ” వద్దనో, మరింత వెనక్కువెళ్ళితే సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్‌ (క్రీ.పూ.5వ శతాబ్దం) వద్దనో నవల చరిత్ర ప్రారంభమౌతుంది. కానీ స్వతంత్ర ఆధునిక సాహిత్య ప్రక్రియగా నవల మన నాగరికతకు సంబంధించింది మాత్రమే. సొంత నిర్మాణ సూత్రాలను కలిగి, అందరిమెప్పునూ, ఆమోదాన్ని పొందిన సాహిత్య ప్రక్రియ అయిన నవల మన నాగరికతకు – మరీ ముఖ్యంగా ముద్రణా యంత్రయుగానికి చెందిన వస్తువే.

    సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రంచేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమేకాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతణ్ణి సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల.  మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది…..

    100.00
    Add to cart
  • Noone Sukka Inkinni Kathalu – నూనె సుక్క ఇంకిన్ని కథలు

    0

    సమూహంలోంచి వెలివేయబడితే అది ఒంటరితనం. ఆ సమూహాన్నే వెలివేస్తే అది ఏకాంతం. ఒంటరితనం భయపెడుతుంది, ఏకాంతం పునరుజ్జీవింపచేస్తుంది. – ఒంటరి ఏకాంతం

    జిందగీ అంటేనే ఊర్లు, పట్నాలల్ల బత్కేటివన్ని పానమున్న పీనిగెలు. పానంతోటి బత్కాలంటే ఊర్లల్లనే బత్కాలె. – రెండో ఉత్తరం

    మాత కైకేయి కోరిక అయోధ్యావాసుల పాలిట దు:ఖహేతువైనది, అదే మా పాలిట వరమైనది. – కాకి రామం

    మనం అడిగినవన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావలసినవన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతిని ఏమనాలి? దేవుడే ప్రకృతి-ప్రకృతే దేవుడు. – 3456 జిబి

    ”ఆడపుట్క’ పుట్టుంటే సల్లగ బతుకుతుంటివి కొడకా,” అన్నది అమ్మ – బలిపసువు

    పేజీలు : 143

    120.00
    Add to cart
  • Yevaree Chatrapati Sivaji – ఎవరీ ఛత్రపతి శివాజి

    0

    భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ”వక్రీకరించి” అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు – వాళ్లు ముస్లింలు అయినా, హిందువులు అయినా, అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.

    శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.

    ‘రాయఘడ్‌’ రాజధానిగా ఆయన స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయటపడెయ్యడం కోసం ఆయన ఎన్నో ఘనకార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువును తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ”ప్రజల మనిషి” అని ప్రజల మన్నన పొందాడు.

    శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.

    40.00
    Add to cart
  • thirteen fourteen fifteen

    0

    హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మనిద్దరం బలవంతంగా తోయబడ్డాం. ఒకరికొకరు ఏమీ కాకుండా …. కేవలం భార్యాభర్తలమయి…. ఇలా అసంతృప్తితో వేగిపోతున్న ఆమె – భర్తని ఒక అర్ధరాత్రి హోటల్‌ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్ళి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది. పురుషుడికొక న్యాయం స్త్రీకో న్యాయం ఎందునుకుంది.

    అదొక తాత్కాలికమైన అసంకల్పిత ప్రతీకార చర్య, పర్యవసానం ? బ్లాక్‌ మెయిలింగ్‌, మానసిక సంఘర్షణ, ఊపిరి సలుపనివ్వని క్లైమాక్స్‌.

    నకిలీ హిప్నటిజాల మాఫియా, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల మోసాల నేపధ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపార వేత్త, భారతదేశపు నెంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయరు ఒకరు –

    నాలుగువిభిన్న మనస్తత్వాలతో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ఆడుకున్న గేమ్‌ ’13-14-15′.

    100.00
    Add to cart