• Jeevanayanam – జీవనయానం

    5

    నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండలు కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవితనాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! ఆపదల్లోనే ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం!

    250.00
    Add to cart