• Katha Chanakya

    0

    రాజు , ఋషి ?
    నృపతి, నృపతి నిర్మాత ?
    మనిషి , మర్మయోగి ?

    చంద్రగుప్త సార్వభౌముల ఆరాధ్య గురువు చాణక్యుల జీవితం నిగూఢము, వివేచనామయం. ఆయన మాటలు, చర్యలు అత్యంత అప్రమత్తతో యంత్రవతుగా కట్టుబడి, అమలు జరిగినవి. చాణక్యులు జీవితంలో పాఠాలను సోదాహరణంగా బోధించారు. చేయి తిరిగిన రచయిత రాధాకృష్ణన్ పిళ్లే ఈ అద్భుత పుస్తకంలో

    అక్షరాలా అదే చేశారు.

    ‘కధ చాణక్య’ ఘనయశస్వి ఆచార్యుల జీవితంలో నించి కధలు చెప్పి, భారతావని మహోత్తమ వ్యూహాశీలి, స్వాప్నికుల సిద్ధాంతాలను, ఆచరణలను ఆధునిక సందర్భాలకు అన్వయింప జేస్తుంది. ఈ కధలలో కొన్ని యదార్థాలు, మిగతావి కల్పితాలు. అది ఒక నాయకుడి ఎన్నిక అయినా, అవినీతిని రూపుమాపటం అయినా, ఘనవిరోధిని ఓడించటం అయినా అన్నీ ప్రజాసంక్షేమం దృష్ట్యా జరిగినవే.

    స్రుకు ఒక స్వప్నం, ఒక ధ్యేయం ఉంటే దానిని సాకారం
    చేయటంలో కధ – చాణక్య తోడ్పడుతుంది

    రాధాకృష్ణన్ పిళ్లే ప్రఖ్యాత రచయిత. ఆయన రచనలు ‘కార్పొరేట్ చాణక్య’, ‘చాణక్యాస్ 7 సీక్రెట్స్ టు లీడర్ షిప్’, ‘మీలోని చాణక్య’, ‘చాణక్య అలా చెప్పాడు’, ‘చాణక్య నీతి’ అత్యుత్తమ అమ్మకాలు సాధించాయి. సంస్కృతంలో ఆయన మాస్టర్ డిగ్రీ పొందారు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ఆయన పిహెచ్.డి సాధించారు. ఆయన పేరుపొందిన మేనేజ్ మెంట్ సలహాదారులు, వక్త. యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చాణక్య ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్ పిప్ స్టడీస్ (CIILS) విభాగానికి ఆయన డెప్యూటీ డైరెక్టర్. handle @rchanakyapillai ద్వారాఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇతర ముఖ్య సామాజిక మాధ్యమాలలో కూడా ఆయన చురుకుగా పాల్గొంటారు.

    195.00
    Add to cart
  • Kalnal Ekalingam Adventures

    0

    జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్ లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులని ఎంటర్ టైన్ చేసేవే. మధ్య నుంచి మొదటికీ, లేదా చివరి నుంచి మధ్యకి కూడా చదువుకో దగ్గ మల్లాది రాసిన మొదటి నవల ఇది. అసలు హాస్యం ఎలా పుడుతుంది? ఎక్కడ అవకతవక లేదా అసంపూర్ణం ఉంటే అక్కడ హాస్యం పుడుతుంది.

    ఉదాహరణకి సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందులో హాస్యం ఉండదు. అదే సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తూ, అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే, ఆ అవకతవక లోంచి హాస్యం పుడుతుంది. ఇలాగే అందాన్ని ఎవరూ ఆక్షేపించరు. అనాకారితనం లోనే హాస్యం ఉంటుంది. అనేక విదేశీ జోక్స్ పత్రికలు ఇచ్చి సహాయం చేసిన మిత్రులు, కార్టూనిస్టు మీనా గారికి నా కృతఙ్ఞతలు.

    – మల్లాది వెంకట కృష్ణమూర్తి

    310.00
    Add to cart
  • Jeevana Laalasa

    0

    విన్సెంట్ చనిపోలేదు. అతనికి మరణం లేదు. అతని ప్రేమా, ప్రజా, అతడు సృజించిన మహా

    సౌందర్యమూ కలకాలం నిలిచిపోతాయి, ఈ ఈ లోకాన్ని సుసంపన్నం చేస్తాయి. అతని చిత్రాల్లో

    నూత్న విశ్వాసం, బతుక్కి కొత్త అర్థం గోచరిస్తాయి. అతడు గొప్ప మానవుడు, గొప్ప వర్ణచిత్రకారుడు, గొప్ప తాత్వికుడు. ప్రేమించిన కళ కోసం ప్రాణాలు ధారపోసి అమరుడయ్యాడు.

    విన్సెంట్ జీవితం, నిరాశలు వాస్తవమైనవాటికన్న ఎక్కువ కల్పనలా అనిపిస్తాయి. అతని మానవ సంబంధాలను, చిత్రలేఖనాలను, వర్ణసమ్మేళనాలను, ఆశనిరాశలను తన ఊహాశక్తితోనూ, కవితాత్మక సాంద్ర వ్యక్తీకరణలతోనూ అక్షరాల్లో పునర్జీవింపజేసే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకుని నవలగా మలిచాడు ఇర్వింగ్ స్టోన్.

    ఈ అనువాదం కేవలం ఆసక్తి కొద్దీ సాగినది మాత్రమే కాక ఇర్వింగ్ స్టోన్ రచనలాగ అభిరుచితో హృదయమంతా రంగరించి సాగడం , తెలుగు పాఠకులకు దొరికిన గొప్ప రంగుల వెల్లువ….

    ఎన్. వేణుగోపాల్

    300.00
    Add to cart
  • Divine Comedy

    0

    ది హాస్య నవల. గతంలో వెలువడ్డ “కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్. మిస్టర్ వీరియం, సుందరి సుబ్రావ్” కామెడీ నవలల్లా ఇది జోక్స్ తో కూర్చబడ్డ నవల. అక్కడక్కడ చదివితే దేవుడు, మతాలు, ఆలయాలు, ప్రవాచనాలు, తీర్ధయాత్రలు లాంటి దేవుడికి సంబంధించిన జోక్స్ బుక్ చదివినట్లుంటుంది. వరసగా చదివితే మిస్టర్ శఠగోపం జీవిత కథని చదువుతారు.
    “డివైన్ కామెడీ” నవల కోసం ఆంధ్రుల అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వెయ్యికి పైగా ఇలాంటి జోక్స్ ని సేకరించి అందిస్తున్న నవల ఇది. మీరు నాస్తికులైనా లేదా ఆస్తికులైనా ఈ నవల మీకు తృప్తినిస్తుంది.

    290.00
    Add to cart
  • Dooram

    0

    రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
    వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.

    అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?

    ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.

    ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.

    ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.

    షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.

    ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.

    చదవండి! చదివించండి!!

    230.00
    Add to cart
  • Chantabbai

    0

    తెనాలి రామకృష్ణ.
    షెర్లాక్ హోమ్స్.
    సాహిత్యంలో వీళ్ళద్దరి లక్షణాలని కలిపితే వచ్చే పాత్రే ఏకదంతం. డిటెక్టీవ్ యుగంధర్ ఏకలవ్య శిష్యుడైన ఏకదంతానికి, చాల ఏళ్ళ క్రితం దత్తత కెళ్ళిన చెంటబ్బాయ్ ని వెదికే పని అప్పగించబడింది.
    ఆ అన్వేషణ చుట్టూ జరిగే అనేక సంఘటనలు, పాత్రలతో అల్లిన “చంటబ్బాయ్” నవల ఉత్కంఠంతో సాగుతుంది. హాయిగా నవ్విస్తుంది.
    సస్పెన్స్. హాస్యం మిళితమైన “చంటబ్బాయ్” చిరంజీవి హీరోగా సినిమాగా కూడా వచ్చింది .
    స్టోరీ టెల్ లో శ్రవణనవలగా కూడా రూపొందింది.
    నలభై ఏళ్ళ క్రితం ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన “చెంటబ్బాయ్:” ఈ నాటికీ పాఠకులని అలరిస్తోంది.

    230.00
    Add to cart
  • Ahame Mee Satruvu

    0

    పరిచయం

    మీరు సులువుగా మోసపోగలుగుతారు. మొట్టమొదట మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండటమే.

    – రిచర్డు ఫెన్మెస్

    మీరు యువకులుగా ఉండి ఏదో ఆశయం కోసం పట్టుదలతో పనిచేస్తున్న వారు కావచ్చు లేదా సమస్యలతో తెగ పోరాడుతున్నవారు కావచ్చు. తొలి మిలియన్ సంపాదించి, ఒక పెద్ద ఒప్పందం చేసుకుని పేరుపొందిన బృందంలో సభ్యత్వం పొందిన వారు కావచ్చు లేదా ఇప్పటికే మీరు జీవితాశయాన్ని సాధించిన వారు కావచ్చు. విజయశిఖరాలు చేరిన తర్వాత అక్కడ ఎంత శూన్యం ఆవరించిందో అన్న ఆలోచనలతో ఉన్న వ్యక్తయినా కావచ్చు. సంక్లిష్ట వాతావరణంలో ఓ పెద్ద బృందానికి నాయకత్వం వహిస్తున్నవారు కావచ్చు లేదా ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా బయటకు నెట్టివేయబడిన వారు కావచ్చు. ఇవేమీ కాకపోతే ఒక్కసారిగా కుప్పకూలి జీవితంలో అథోగతి పాలయిన వారు కూడా కావచ్చు.

    మీరేం చేస్తున్నా, మీరెక్కడ ఉన్నా, మీకు చేటు చేసే శత్రువు మీలోనే ఉంటుంది. దాన్నే ‘అహం’ అని పిలుస్తారు.

    “నాకు అహం లేదు. నన్నెవరూ ఇంత వరకూ అహంకారి అని అనలేదు తెలుసా?” అని మీరు అనవచ్చు. చాలా సంయమనంతో నడుచుకునే వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించుకో వచ్చు. కానీ ఆశయాలు, నైపుణ్యాలు, సమర్థత, ప్రేరణ, శక్తితో ఏదయినా సాధించ దలుచుకున్నప్పుడు అక్కడ అహం రంగప్రవేశం చేస్తుంది. మనం ఆలోచనా పరులుగా, సృజనాత్మక జీవులుగా, క్రియాశీలురుగా, వ్యాపారవేత్తలుగా ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి చేరేందుకు సాగించే ప్రయత్నంలో మనస్సులో దాగి ఉంటే ఈ చీకటి కోణం మనల్ని దుర్బలులుగా మారుస్తుంది.

    ఫ్రాయిడ్ పరిభాషలో అహాన్ని గురించి వివరించే పుస్తకం కాదిది. గుర్రంపై స్వచేసే వ్యక్తి లాంటిది అహం అని, జంతువు మాదిరిగా ఉపచేతన మనసు దానిని నడుపుతూ ఉంటుందని ఫ్రాయిడ్ ఒక పోలిక ద్వారా దాని గురించి చెప్పే మత్నం చేస్తారు. ఆధునిక మనస్తత్వవేత్తలు మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతారు.

    ఆ పట్ల అలక్ష్యం చూపుతూ, ప్రమాదకరస్థాయిలో తమను గురించి తాము అప్పగా ఆలోచించుకునే వారిని అహంకారులు అని చెబుతారు. ఇవన్నీ నిర్వచనాలు వలన,కానీ వైద్యసంబంధమైన వ్యవహారాలకు వెలుపల మాత్రం వాటికంత వ్యాపారవేత్తలుగా ఆయా రంకటి కోణం మనల్ని మన పుస్తకం కాదిది. పరంగా సరైనవే,కానీ వైద్యసంబంధమైన విలువ లేదు………..

    350.00
    Add to cart
  • Akhari Athidhi

    0

    ప్రతి మనిషి తప్పని సరిగా ఎదో రోజు ఆఖరి అతిథిని ఒక్కసారే కలుసుకుంటాడు. కాని డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు.
    ఎందుకు? ఎప్పుడు? ఎలా?
    మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన, అతింద్రియ నేపథ్యంతో సాగే ఈ సస్పెన్స్, ఫాంటసీ డైరెక్ట్ నవల వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించింది. మూడు రోజుల్లో డాక్టర్ శ్రీజిత్ కి ఎదురైన విచిత్ర అనుభవాలు ఉత్కంఠంగా సాగుతాయి.
    – మల్లాది వెంకటకృష్ణ మూర్తి

    230.00
    Add to cart
  • Vidwan Viswam Panchatantram

    0

    పంచతంత్రం

    విను మహిలా రోప్య మను పట్టణమ్ము
    వెనుక, దక్షిణభూమి వెలయుచు నుండె.

    అమరేంద్ర వైభవుం డా యూరి రాజు;
    అమరశక్తి యటందు రాతని జనులు.

    మువ్వురు కొడుకులు మూర్ఖులై రంచు
    చివ్వుమన్నది రాజు చిత్తమ్ములోన

    చింతతో మంత్రుల చేరంగ బిలిచి
    మంతన మ్మొనరించి మాట్లాడె నిట్లు:

    తెలివిమాలిన కుమారుల పాడు నడత
    తెలియుగదా మీకు తీర్పరులార: |

    చదువుసాములు లేని చవటలై వీరు
    పదుగుర నవ్వుల పాలయినారు.

    అనగా అనగా దక్షిణాపథంలో మహిలా రోప్యం అనే పటణం కలదు. అంగ రంగ వైభవంతో ఆ నగరాన్ని అమరశక్తి అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారు ముగురూ మూరులయినందువల్ల ఆ రాజు మనస్సు చివుక్కు మన్నది. విచారంతో ఆయన మంత్రులందరినీ పిలిపించి వారితో మంతనం సాగించినాడు.

    ఆ నరపాలుడు ఇట్లన్నాడు – “ఈ తెలివిలేని నా కుమారుల

    నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు చదువూ, సామూ లేక చవటలె పోయి ఉన్నాడు. పాడు నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు. చదువు, సాము లేక చావతలై పోయిన వీరు పడుగుర ముందు నవ్వుల పాలవుతారు . …..

    150.00
    Add to cart
  • Vallu Padina Bhupalaragam

    0

    కాలాతీత కథల కథనశిల్పం

    శీలా సుభద్రాదేవి, సంపాదకురాలు

    డా|| పి.శ్రీదేవి పేరు చెప్పగానే సాహితీలోకంలో ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. ఆమె కథలు రాసినట్లు తెలిసినా, ఆ కథల గురించి తెలిసినవారూ తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలూ వాటిలో ఉన్నాయి. 1955 నుండి 1960 వరకూ రాసిన కథలు సుమారుగా ఇరవై వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె రచనా జీవితం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్దికాలంలోనే నవల, కథలు, కవిత్వం, వ్యాసాలతో సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని సాధించిందామె. అరవై ఏళ్ళకు పైగా ఆ ముద్ర చెరిగిపోకుండా ఉందంటే శ్రీదేవి రచనలకు గల విశిష్టత తెలుస్తుంది.

    శ్రీదేవి 1929 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జన్మించింది. తండ్రి డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత,

    జాతీయవాది కావటాన శ్రీదేవికి బాల్యంనుండీ సాహిత్యాభిలాష, అభినివేశం అలవడ్డాయి. తండ్రితోపాటూ అనేక సమావేశాల్లో పాల్గొనటంవలన జాతీయ సమస్యల పట్లా, సాహిత్యంపట్లా స్పష్టమైన అవగాహన ఆమెకి కలిగింది.

    250.00
    Add to cart
  • Swapna Jeevi

    0

    మనకు జరిగిందే కథ కాదు. మనలో జరిగేది కూడా కథే!

    మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఎన్నో అంశాలలో కళ కూడా ఒకటి. మనిషి అంతరంగంలోని ఎన్నో విషయాలను వ్యక్తీకరించే మార్గం కళ. మాటలు, పదాలు వ్యక్తీకరించే భావాలను సైతం వివిధ కళారూపాల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని మనిషి కనుగొన్నాడు. మానవుల మొట్టమొదటి కళారూపాలు పురాతన గుహల ‘గోడలపై చిత్రించిన బొమ్మలుగా కనుగొనబడ్డాయి. ఆ విధంగా చిత్రలేఖనం మానవుడి మొదటి కళగా అర్థం చేసుకోవచ్చు. కళల ద్వారానే సంస్కృతి వ్యాపించింది. కళ మరియు సంస్కృతి ప్రజలని ఒక సమాజంగా దగ్గర చేశాయి. సమాజాన్ని బలోపేతం చేయడానికి కూడా కళ, సంస్కృతి ఎంతో ఉపయోగపడతాయి. వినోదం, విశ్రాంతి పొందడం కోసమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్పించడం, వ్యక్తిగత వృద్ధి సాధించడంలో కూడా వివిధ కళలు ఎంతో ఉ పయోగపడతాయి. సమాజానికి ఇంత మేలు చేసే కళ వెనుక ఉండే కళాకారుల జీవితాలు చాలా వరకూ ఎన్నో కష్టనష్టాలతో కూడి ఉండడం మాత్రం ఎంతో బాధాకరమైన విషయం. బహుశా అందుకు కారణం కళాకారుడు మిగిలిన వారికంటే ఎక్కువ వ్యాకులత కలిగి ఉండి, సమాజం పట్ల చింతకలిగిన వాడై ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. |

    మరణం తప్పదని తెలిసిన మనిషికి తన క్షీణతను అధిగమించగలిగే ఒకే ఒక సాధనం కళ, కళాకారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా, కళాకారుడు చేసిన సృష్టి అతనికి…………

    175.00
    Add to cart