Availability: In Stock

Money Purse

SKU: GOD00010

250.00

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా?… అవును కాస్తాయి!! విత్తునాటే నేలనుబట్టి చెట్టు పెరుగుదల ఫలాలు ఉంటాయి. రూపాయి కూడా అంతే! నువ్వు దాన్ని పోస్టాఫీసులో నాటుతావా? బ్యాంకులో నాటుతావా? షేర్స్ లో నాటుతావా? ఇంటిపై నాటుతావా? బీమాలో నాటుతావా? లేదా అన్నీకలిపిన నేలలో నాటుతావా? అన్నదాన్ని బట్టి ఫలం. మరి ఎక్కడ నాటాలి? మీరు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా వంగా రాజేంద్రప్రసాద్ చెబుతారు. ‘ఫీజు’ రూపాయలు. ‘చదువులు మనకన్నీ నేర్పుతాయి. డబ్బును ఎలా వాడుకోవాలో తప్ప’ అన్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు మిమ్మల్ని ఆలోచనల్లో పడేసి ఉంటే ఆ మిగిలిన ఒక్క నైపుణ్యాన్ని నేర్పే టీచరే ఈ పుస్తకం. పత్రికల్లో ఆర్ధిక సలహాలు అందిస్తున్న రాజేంద్రప్రసాద్ వృధా వాక్యాలు వాడకుండా ఇంత సరళంగా ఆర్ధిక పాఠాలెలా చెప్పారన్నదే పెద్ద ప్రశ్న.

– సాక్షి దినపత్రిక

17 in stock (can be backordered)

Additional information

select-format

Paperback

book-author

Vanga Rajendra Prasad