• Cherabanda Raju Sahitya Sarvaswam 1 & 2

    0

    సంపాదకుడి మాట

    మార్గదర్శి అల్లం రాజయ్య

    ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి – తను ఆర్థిక మాంద్యంలో కూరుకపోయి స్థానిక ఉత్పత్తి శక్తుల మీద – ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. కోపోద్రిక్తమైన యువకులు, విద్యార్థులు పారిన్లో తిరుగుబాటు చేశారు. హెచిమిన్ నాయకత్వంలో క్రూరమైన జిత్తులమారి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు పోరాటం పతాకస్థాయికి చేరింది. అది రష్యా సోషల్ సామ్రాజ్యవాదంగా రూపొందుతున్న కాలం. చైనాలో కొత్తగా రూపొందుతున్న పెట్టుబడిదారీవర్గానికి వ్యతిరేకంగా మావో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చిన కాలం.. ఇలా ప్రపంచవ్యాపితంగా పెను సంచలనాలు – యుద్ధాలు చెలరేగుతున్న కాలం అది.

    మన దేశంలో నెహ్రూ మార్కు బూటకపు సోషలిజం విఫలమయ్యింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని వైరుధ్యాలను అర్థం చేసుకోలేక పోరాడే ప్రజలకు నాయకత్వం వహించే చారవ కోల్పోయింది. వర్గపోరాటం సానే వర్గ సామరస్యం వల్లిస్తూ రివిజనిజంలో కూరుకుపోయి రెండుగా చిలింది. దేశం జాతుల బందీభానాగా, ఉత్పతి శక్తుల బందిఖానాగా మారింది. గ్రామాలు సుదీర్ఘ కాలం కులాల కాన్సంట్రేషన్ క్యాంపులుగా మారి ఉత్పత్తి శక్తుల వికాసానికి ఆటంకమయ్యాయి. సంతో దాదో రేవో తేలుకొని పోరాడవలసి వచ్చింది. ఈ పోరాటాలన్నిట్లో సరైన నిర్మాణం, నాయకత్వం లేక వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతున్న కాలం అది.

    అలాంటి గడ్డుకాలంలో తెలంగాణా సాయుధ పోరాటం జరిగి(1948-51) నాయకత్వ హం వలన విరమించబడిన నేపథ్యం గల నల్గొండ జిల్లాలోని అంకుశాపురంలో బద్దం

    హ 1944లో పడి గాయాల నొప్పుల నీతిలో బాల్యం గడిపాడు. సంవత్సరం లో ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద గ్రూపులుగా చిలింది. ఆయన బాల్యం రక్తసిక్త

    సాయుధ పోరాటం అతలాకుతలంతో గడిచింది. అయిదవ తరగతి నాటికి బాల తహ పేరు స్కూల్లో భాస్కరరెడ్డిగా మారింది. ఇలాంటి ఒత్తిడి చిత్తడిలో కౌమారపు స్వేచ్ఛా

    లలు గన్నారు. పలవరింతల మధ్య కవిత్వం ఓదార్చింది. కవిత్వం పూనిన తరువాత పెట్టు తప్పింది. ఈ గడబిడల మధ్యనే పదహారో ఏట శ్యామలతో పెండ్లి జరిగింది. – రైతు కుటుంబంలో శ్యామల వ్యవసాయ పనుల్లో గొడ్డు చాకిరీలో ఉండగా భాస్కర్ రెడ్డి………….

    1,000.00
    Add to cart
  • Chandamama Kathalu- 8 (1969- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

    0

    శేషపతి అనే ఆయన పనిమీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవిదారి తెలియదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి, అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తికాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి, అదృష్టవశాన, చీకటిపడే వేళకు ఏదో గ్రామం చేరాడు.

    ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్నగ్రామం ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శ్లేషపతి తలుపుమీద బాదగానే, లోపలి నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు.

    “మా ఊరు పోతూ దారి తప్పాను. ఈరాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇయ్యగలరా ?” అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు.

    వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, “నువు సాంబశివుడి కొడుకువు కాదూ ? మీది పలానా ఊరు కాదూ ?” అని అడిగాడు.

    శేషపతి నిర్ఘాంతపోయి, “అవును, మా విషయాలు మీకు ఎలా తెలుసు ?” అని వృద్ధుణ్ణి అడిగాడు.

    “నేనూ, మీ నాయనా బాల్యమిత్రులం. పెళ్ళికాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ ! సరదాగా గడిపి మరీ వెళుదువు గాని!” అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి, తన భార్యకూ,

    పిల్లలకూ పరిచయం చేశాడు. తరవాత శేషపతి స్నానం చేసి, భోజనం చేసి, ప్రయాణపు బడలికవల్ల నిద్ర ముంచుకు వస్తూంటే తనకోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో, పెద్ద పట్టెమంచం మీద పడుకుని, వెంటనే నిద్రపోయాడు.

    ఒక రా త్రివేళ ఏదో అలికిడి అయి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటినిండా మనుషులు మసులుతున్నట్టు తోచింది. పిండివంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ, తన గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మరొకగదిలో వృద్ధుడూ, ఆయన భార్యా,

    పిల్లలూ గాఢనిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటినిండా జనం ! కొందరు బూజు దులుపుతున్నారు. కొందరు ఊడుస్తున్నారు. కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు. కొందరు ఎక్కడి నుంచో బరువైన

    400.00
    Add to cart
  • Bali Kathalu

    0

    అప్పికట్ల వారి వీధికి ఆహ్వానం

    1972లో వడ్డెర చండీదాస్ గారి నవల “

    హిమజ్వాల” ఆంధ్రజ్యోతి

    భాగానికి వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, ప్రతివారమూ ఆ నవలా వేసిన బొమ్మలు కూడా ఆ నవలంత కొత్తగా, అధునాతనంగా వుండేవి. ఆ బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు బాలి. అదీ బాలిగారితో తెలుగు సాహిత్యానికి తొలి పరిచయం. (అప్పటికే కొన్ని నవలలకు బొమ్మలు వేసి ఉంటారు). అప్పటి నుంచీ తెలుగు పత్రికలకో కొత్త చిత్రకారుడు దొరికాడు. అప్పటి పత్రికల చిత్రకారుల్లాగే ఆయన కూడా ఆ తరువాత కార్టూన్లూ గీసి నవ్వించారు. వాళ్లలో చాలా మందికి భిన్నంగా అప్పుడప్పుడు కథలూ రాశారు. బాపూగా రొకటి రెండు కథలు రాసినట్టు యెవరో చెబుతుంటే విన్న గుర్తు. చంద్రగారు చాలా కథలు రాశారు. అయితే యిలా కథల సంపుటాన్ని ప్రచురిస్తున్న తొలి పత్రికా చిత్రకారుడు నాకు తెలిసి బాలిగారొకరే!

    యీ సంపుటంలోని కథలన్నీ వొక ప్రముఖ చిత్రకారుడి కుంచెలోంచి వచ్చిన కథలు, అంతకంటే మౌలికంగా విశాఖపట్టణం దగ్గరి అనకాపల్లి అనే వూళ్లో వుంటే వొక మధ్యతరగతి వ్యక్తి బాల్య ప్రజ్ఞాపకాల దొంతరలు. పట్టుమని అయిదారు పేజీలకు మించని కథలే వున్న యీ సంపుటంలో చిత్రంగా, వూహించ రీతిలో, (238వ పేజీ నుంచి దాదాపు 57 పేజీల నిడివుండే) పెద్ద కథ వొకటుంది. దాని పేరు ‘అప్పికట్ల వారి వీధి’. ఆ కథ చదువుతున్నంత సేపూ నాకు ముళ్లప్పూ

    వెంకటరమణ గారి ‘జనతా ఎక్స్ ప్రెస్’ కథే గుర్తుకొచ్చింది. ముళ్లపూడి గా బాపూగారనే గొప్ప స్నేహితుడుండేవారు. ఆయన తన స్నేహితుని కథలకు యిం ముబ్బడిగా బొమ్మలేసి పెట్టేవాడు. ‘జనతా ఎక్స్ ప్రెస్’ అనే ఆ పెద్ద కథ నా

    ండా…………

    320.00
    Add to cart
  • Andhamaina Viplavam

    0

    ఇటలీలో కళాచంద్రోదయం

    ఆరువందల ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. పద్నాలుగవ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది.

    కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది.

    అదొక అందమైన విప్లవం. మానవ మేధ లోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం , విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది. ఆ విప్లవం.

    ఆ విప్లవం పద్నాల్గవ శాతాబ్దంలో ఎందుకు జరిగింది?

    ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. ఒకటవ శతాబ్దంలో యూరప్, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడెయాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడెయా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పేగన్ (Paganism) మతానికి ఈ కొత్త మతభావాలు విరుదంగా ఉండడంతో, రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి నాలుగు శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా ఐదవ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా ఛిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం | కాంస్టాంటినోపుల్ రాజధానిగా మరో వేయేళ్లపాటు వర్ధిల్లింది. – తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ | కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం | బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే, జన్మానంతరం సద్గతిని పొంది,…………

    300.00
    Add to cart
  • Viswa Vijetha By Yandamuri Veerendranath

    0

    మొదటి అధ్యాయం

    1898వ సంవత్సరం. కలకత్తా ఉత్తర ప్రాంతం. హారిసన్ రోడ్. మూడంతస్తుల భవనంలో ఒక మారుమూల గది. మంచం మీద రెండేళ్ళ బాలుడు టైఫాయిడ్ జ్వరంతో పడుకుని ఉన్నాడు. అతడి వళ్ళు కాలిపోతోంది. గుమ్మం దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు అతని వైపే ఆందోళనగా చూస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఆ కుర్రవాడి తండ్రి గారి

    మోహన్ డే. పక్కనే ఉన్న వ్యక్తి ఆ బాలుడిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ బోస్. మోహన్ డే స్నేహితుడు.

    “అబ్బాయి బలహీనంగా ఉన్నాడు. చికెన్ సూప్ ఇస్తే మంచిది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం” అన్నాడు డాక్టర్ బోస్.

    “మేం వైష్ణవులం. ప్రాణం పోయినా ఒప్పుకోను.”

    బోస్ బ్రతిమిలాడుతున్నట్టూ “నీకంత అభ్యంతరమైతే మా ఇంట్లో చేయించి తీసుకువస్తాను మోహన్. దయచేసి ఒప్పుకో. ఇది జీవన్మరణ సమస్య” అన్నాడు.

    “తప్పనిసరి అయితే ఇక నీ ఇష్టం” అయిష్టంగా జవాబిచ్చాడు తండ్రి. ఇంటిలో చికెన్ సూప్ తయారు చేయించి తెప్పించాడు డాక్టర్ బోస్. బాలుడిని రెండు చేతులు | మీద పైకి లేపి స్వయంగా తాగించబోగా మరుక్షణం వాంతి అయిపోయింది. అది చూసిన తండ్రి విశ్రాంతంగా ఊపిరి తీసుకున్నాడు. ఆ పై మరో రెండు రోజులు గడిచాయి. ఏ సూపు అవసరం లేకుండానే ఆ బాలుడు ఆరోగ్య వంతుడయ్యాడు.

    “నీ కొడుకు అంత పెద్ద విషజ్వరంతో బాధపడుతూ ఉంటే, అతడి ఆరోగ్యం గురించి అంత ధీమాగా ఎలా ఉన్నావ్? ఏమిటి నీ ధైర్యం?” ఆశ్చర్యంగా ప్రశ్నించాడు | బోస్.

    పుట్టగానే మా అబ్బాయి జాతకచక్రం వేసిన జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా? నా కొడుకు సముద్రాలు దాటుతాడని, వందకి పైగా గుళ్ళు కడతాదని, | కృష్ణతత్వాన్ని వాడవాడలా చాటిన ప్రవక్తగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పాడు. దాన్ని మనసా వాచా పూర్తిగా విశ్వసించిన నేను, భగవత్సంకల్పం వల పుట్టిన నా కొడుకు ఏ జ్వరము ఏమీ చేయదని మనస్ఫూర్తిగా నమ్మాను” అన్నాడు…………..

    250.00
    Add to cart
  • Agnipatham_Mattimanushulu

    0

    విభిన్న ఇతివృత్తాలతో విలక్షణ నవలలు

    కథారచయితగా ‘పాలపిట్ట’ పాఠకులకు సుపరిచితులైన గన్నవరపు నరసింహమూర్తి రాసిన రెండు నవలలు ఇవి. పోలీస్ వ్యవస్థలో నిజాయితీగా పని చేయడానికి పూనుకున్న ఒక యువ ఐపిఎస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్ళను, రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళను అధిగమించి నిజాయితీగా పని చేసిన తీరును ‘అగ్నిపథం’ నవల ఆవిష్కరించింది. నీతి, నిజాయితీ, చట్టాన్ని అమలు చేసే పట్టుదల గల పోలీసు అధికారులు ఉన్నపుడు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించిందీ నవల. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో నడిచింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలోని ప్రకృతినీ, పరిస్థితులనీ, సమస్యలనీ బలంగా చిత్రించిన నవల ఇది. ప్రజలకు సేవ చేయడానికి అంకితమై పనిచేసే అధికారులు జనానికీ, సమాజానికి ఎన్నివిధాల మేలు చేసే అవకాశం ఉన్నదో ఈ నవల చదివితే బోధపడుతుంది.

    ఉత్తరాంధ్రలోని వ్యవసాయిక పరిస్థితులను, నీటి ప్రాజెక్టుల కోసం ఆందోళనలని చిత్రించిన నవల ‘మట్టిమనుషులు’. అంతేగాక తన ఊరి ప్రజల కోసం తపించే ఓ ఐఐటి చదువుకున్న యువకుడి జీవనగమనం భూమికగా రూపుదిద్దుకున్న నవల ఇది. వ్యవసాయరంగం సంక్షోభరహితంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ నవలలో రచయిత చర్చించారు. అలాగే పల్లెల నుంచి వలసలు ఆగిపోవాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో బాగా చెప్పారు. ముఖ్యంగా మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని ఆరంగా చిత్రించారు రచయిత. ఈకాలాన అమెరికాకు తరలిపోవడమే లక్ష్యంగా ఉన్నత చదువుల్లో చేరుతున్నారు. దీనికి భిన్నంగా తన గ్రామం కోసం, అక్కడి ప్రజల కోసం, నీటివసతుల కలువ కోసం ఓ యువకుని తపనని, కృషిని దృశ్యమానం చేసిన నవల ‘మట్టిమనుషులు, ఈ నవలా పఠనం ఉదాత్త అనుభవం. ముఖ్యంగా సన్నివేశాల కల్పన, సంబాపణలు సహజంగా ఉన్నాయి. గన్నవరపు నరసింహమూర్తి కథనశైలిలోని ప్రత్యేకత…………

    150.00
    Add to cart
  • Nalla Trachu

    0

    నల్లతాచు

    ఇంతకుముందు ‘వారియర్ షాడో’ కథను గురించి కొంచెం గుర్తుచేసే ప్రయత్నం ఇది. దేశంలో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్సంస్థలన్నిటినీ తందనాలు తొక్కిస్తున్న గజదొంగ షాడోని పట్టుకోవటంలో సహాయం చేసేందుకు వచ్చిన సిఐబి చీఫ్ కులకర్ణిగారికి చాలా దగ్గిరిగా వచ్చి కూడా ఆయన దృష్టిలో పడకుండా తప్పించుకున్నాడు షాడో.

    సరిహద్దులకు ఆవల నివశించే అసరుద్దీన్ అనే పెద్దమనిషిని బంధించి, అతని ఎస్టేట్ ని తను స్వాధీనం చేసుకున్న అజ్మల్ భాయ్ అనే ఒక క్రిమినల్ ఆట కట్టిస్తాడు అతను.

    ఆ ఎస్టేట్లో బంధింపబడిన భాంజీ సాబ్ కూతుర్నీ, ఇతర ఆడబిడ్డలను చెరనుంచి విడిపిస్తాడు.

    భాంజీసాబ్ సరిహద్దులకు ఇవతల ఉన్న తన ఎస్టేట్లో ఒక విచిత్రమైన ఒంటెల్ని పెంచుతూ ఉంటాడు,……….

    120.00
    Add to cart
  • Janani Janmabhoomi

    0

    శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని “పాన్ దాన్ ” తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. “చుక్కుమా! ఓ చుక్కుమ్మ!” అని పిలిచింది విసుగ్గా.

                      “అమ్మ!” అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ.

                      “వంటయిందా?”

                      “అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?”

                    “వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు… ” ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. “వచ్చావా సాజి?” అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

    90.00
    Add to cart
  • saptabhoomi (శప్తభూమి)

    0

    శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.

    ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.

    – బండి నారాయణస్వామి

    275.00
    Add to cart
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    0

    “వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”

    “ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”

    “సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”

    “తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “

    200.00
    Add to cart
  • SIKKOLU KATHALU

    0
    140.00
    Add to cart
  • Telugu Sahitya Samiksha- 1, 2

    0

     సుమారు దశాబ్దంన్నర  కాలంలో ఆంధ్ర సాహిత్య చరిత్రను సవిమర్మకంగా సప్రమాణంగా అధ్యయనం చేసి స్నాతకోత్తరస్థాయిలోకి అధ్యేతలకు భోదిస్తున్న తెలుగు సాహిత్య చరిత్ర నిపుణులు డాక్టర్ జి। నాగయ్య గారు। ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రకు , కవి జీవితాలకు సంబంధించి గ్రంధరూపంగాను, పత్రికా వ్యాసాలుగాను వెలువడిన రచనల నన్నింటిని ఔపోశనం పట్టిన ఆదర్శ అధ్యాపకులు డా।। జి। నాగయ్య గారు।  ఏది వ్రాసినా , సవిమర్శకంగా , సప్రమాణంగా స్పష్టంగా సరళశైలిలో వ్రాయడం డా।। నాగయ్య గారి ప్రాత్యేకత

    680.00
    Add to cart